FIFA World Cup 2022 : ఫుట్ బాల్ ప్రపంచకప్ (Foot Ball World Cup) 2022లో సోమవారం ఆసక్తిక మ్యాచ్ లు జరగనున్నాయి. ప్రిక్వార్టర్స్ లో భాగంగా జరిగే ఈ మ్యాచ్ ల్లో క్రొయేషియా (Croatia)తో జపాన్ (Japan).. ఐదు సార్లు చాంపియన్ బ్రెజిల్ (Brazil)తో దక్షిణ కొరియా (South Korea) తాడో పేడో తేల్చుకోనున్నాయి. భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 8.30 గంటలకు జరిగే తొలి మ్యాచ్ లో జపాన్ తో క్రొయేషియా తలడనుంది. అనంతరం భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి గం. 12.30లకు జరిగే పోరులో బ్రెజిల్ తో దక్షిణ కొరియా తలపడనుంది. ఈ రెండు మ్యాచ్ ల్లో గెలిచిన రెండు జట్లు క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకోనున్నాయి.
ఫేవరెట్ గా బ్రెజిల్
2022లో జరిగిన ఫుట్ బాల్ ప్రపంచకప్ లో బ్రెజిల్ చివరి సారిగా చాంపియన్ గా నిలిచింది. ఆ తర్వాత 20 ఏళ్లు గడుస్తున్నా మరోసారి విశ్వ విజేతగా నిలువలేకపోయింది. 2014లో సెమీఫైనల్ వరకు చేరింది. కానీ, ఈసారి మాత్రం ఎలాగైనా ప్రపంచకప్ నెగ్గి 20 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని పట్టుదలగా ఉంది. కొరియాతో జరిగే ఈ పోరులో బ్రెజిల్ హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగనుంది. తొలి మ్యాచ్ లో గాయపడ్డ బ్రెజిల్ స్టార్ ప్లేయర్ నేమార్ జూనియర్ ఈ మ్యాచ్ లో ఆడనున్నాడు. మరో మ్యాచ్ లో క్రొయేషియాతో జపాన్ ఆడనుంది. లీగ్ దశలో మాజీ చాంపియన్స్ జర్మనీ, ఫ్రాన్స్ లాంటి జట్లను ఓడించిన జపాన్.. 2018 ప్రపంచకప్ రన్నరప్ క్రొయేషియాతో తలపడనుంది.
The Quarter-Finals are starting to take shape ????#FIFAWorldCup | #Qatar2022
— FIFA World Cup (@FIFAWorldCup) December 4, 2022
ఆదివారం జరిగి ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్ (France) 3-1 గోల్స్ తేడాతో పొలాండ్ (Poland)పై గెలిచింది. కెయిల్ ఎంబాపే రెండు గోల్స్ (74వ, 90+1వ నిమిషాల్లో) చేశాడు. మరో గోల్ ను జిరోడ్ (44వ నిమిషంలో) సాధించాడు. ఇక పొలాండ్ తరఫున నమోదైన ఏకైక గోల్ ను ఆ జట్టు కెప్టెన్ లెవండోస్కీ (90+9వ నిమిషంలో) పెనాల్టీ రూపంలో సాధించాడు. ఆట ఆరంభం నుంచే ఫ్రాన్స్ అద్భుత ఆటతీరును కనబరిచింది. పొలాండ్ కు ఎటువంటి అవకాశం ఇవ్వకుండా చెలరేగిపోయింది. బంతిని ఎక్కువ సేపు తన ఆధీనంలోనే ఉంచుకున్న ఫ్రాన్స్ 44వ నిమిషంలో తొలి గోల్ చేసి ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక రెండో అర్ధ భాగంలో ఫ్రాన్స్ ప్లేయర్ ఎంబాపే చెలరేగిపోయాడు. అద్భుత పాస్ లతో పాటు పవర్ ఫుల్ షాట్లతో పొలాండ్ గోల్ కీపర్ కు పని పెట్టాడు. ఈ క్రమంలో రెండు సార్లు పొలాండ్ ఢిపెన్స్ ను ఛేదించి గోల్స్ సాధించాడు. దాంతో ఫ్రాన్స్ విజయం ఖాయం అయ్యింది. ఆఖరి నిమిషాల్లో పొలాండ్ గోల్ చేసినా అది ఫ్రాన్స్ గెలుపును ఆపలేకపోయింది.
ప్రపంచకప్ లో నేడు
క్రొయేషియా X జపాన్ (భారత కాలమానం ప్రకారం రాత్రి గం. 8.30 నుంచి)
బ్రెజిల్ X దక్షిణ కొరియా (భారత కాలమానం ప్రకారం అర్ధ రాత్రి గం. 11.30 నుంచి)
ఈ రెండు మ్యాచ్ లను స్పోర్ట్స్ 18, జియో సినిమాలు ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Brazil, FIFA, FIFA World Cup 2022, Japan, South korea