ఫిఫా ఫుట్ బాల్ ప్రపంచకప్ (FIFA World Cup) 2022లో రౌండ్ ఆఫ్-16 మ్యాచులు ముగిశాయి. ఆఖరి ప్రి క్వార్టర్స్ లో పోర్చుగల్ విజృంభించింది. స్విస్ జట్టును చిత్తు చేసి పోర్చుగల్ (Portugal) క్వారర్ట్స్ ఫైనల్ కు దూసుకెళ్లింది. ప్రి క్వార్టర్స్ ఫైనల్స్ లో పోర్చుగల్ దెబ్బకి స్విట్జర్లాండ్ జట్టు దగ్గర మాటల్లేవ్. డూ ఆర్ డై ఫైట్ లో పోర్చుగల్ జట్టు గోల్స్ వర్షం కురిపించింది. పోర్చుగల్ సూపర్ షో కి స్విస్ జట్టు 6-1 తేడాతో ఘోర ఓటమిని మూటగట్టుకుంది. ఈ దెబ్బతో ఫిఫా ప్రపంచకప్ నుంచి ఔటైంది స్విట్జర్లాండ్ జట్టు. గొంకలో రామోస్ మూడు గోల్స్‌తో అదరగొట్టాడు. అతని దెబ్బకి స్విస్ జట్టు వణికింది. ఈ మ్యాచ్‌లో పోర్చుగల్ ఆటగాళ్లు దూకుడుకు స్విస్ జట్టు దగ్గర సమాధానం లేకపోయింది.
అందివచ్చిన అవకాశాలు ఉపయోగించుకుంటూ చెలరేగిపోయారు పోర్చుగల్ ఆటగాళ్లు. మ్యాచ్ ప్రారంభమైన 17 నిమిషాల వద్ద జావో ఫెలిక్స్ నుంచి పాస్ అందుకున్న రామోస్ బంతిని గోల్‌పోస్టులోకి నెట్టడంతో పోర్చుగల్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 33 నిమిషాల వద్ద బ్రూనో ఫెర్నాండెస్ నుంచి పాస్ అందుకున్న పీప్ తలతో కళ్లుచెదిరే రీతిలో గోల్ కొట్టాడు. దీంతో 2-0 తేడాతో పోర్చుగల్ జట్టు ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. దీంతో ఫస్టాఫ్ ముగిసే సమయానికి స్పష్టమైన ఆధిక్యంతో నిలిచింది క్రిస్టియానో రొనాల్డో సేన.
ఇక సెకండాఫ్ లో 51 నిమిషాల వద్ద రామోస్ మరో గోల్ కొట్టి 3-0 తేడాతో తన జట్టును మరింత ఆధిక్యంలో తీసుకెళ్లాడు. కాసేపటికే 55 నిమిషాల వద్ద రామోస్ నుంచి పాస్ అందుకున్న రాఫేల్ గెరీరో గోల్ చేయడంతో పోర్చుగల్ 4-0 లీడ్‌లోకి వెళ్లింది. అయితే 58 నిమిషాల వద్ద స్విట్జర్లాండ్ ఆటగాడు మాన్యువల్ అకంజీ గోల్ చేయడంతో స్విస్ జట్టు ఖాతా తెరిచింది.
A six-goal outing to send Portugal to the Quarter-finals ????????#FIFAWorldCup | #Qatar2022
— FIFA World Cup (@FIFAWorldCup) December 6, 2022
ఇక 67 నిమిషంలో మరోసారి రామోస్, మ్యాచ్ అదనపు సమయంలో రాఫేల్ లియో గోల్ చేశారు. ఈ ఆటలో స్విస్ ఆటగాళ్లు ఏ మాత్రం దూకుడు ప్రదర్శించలేకపోయారు. పోర్చుగల్ కంటే ఎక్కువ పాస్‌లు అందుకున్నప్పటికీ స్విట్జర్లాండ్ ఆటగాళ్లు గోల్స్ చేయడంలో విఫలమయ్యారు. తొలి అర్ధభాగంలో దూకుడుగా ఆడిన పోర్చుగల్.. సెకండాఫ్ లో మాత్రం స్విస్ జట్టుకు చుక్కలు చూపించింది. గొంకలో రామోస్ మూడు గోల్స్‌తో ఇక తన తదుపరి మ్యాచ్‌లో మాజీ ఛాంపియన్ స్పెయిన్ ఓడించి సంచలనం సృష్టించిన మొరాకో జట్టుతో తలపడనుంది.
Is Portugal missing Cristiano Ronaldo anymore? ????#GoncaloRamos | #FIFAWorldCup pic.twitter.com/U5jZrr5Lk7
— Sportstar (@sportstarweb) December 6, 2022
ఎక్కువ సేపు బెంచ్ పైనే రొనాల్డో
ఇక, ఈ నాకౌట్ మ్యాచులో క్రిస్టియానో రొనాల్డో ఎక్కువ సేపు బెంచ్ పైనే కూర్చున్నాడు. దీంతో ఫ్యాన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే.. సౌత్ కొరియాతో జరిగిన ఆఖరి గ్రూపు మ్యాచులో ఆ జట్టు ఆటగాణ్ని రొనాల్డో అవమానించాడు. దీంతో.. రొనాల్డోను బెంచ్ పైనే కూర్చొబెట్టారు. అయితే.. ఆట 74 వ నిమిషంలో.. జొవో ఫెలిక్స్ స్థానంలో రొనాల్డోను తీసుకువచ్చింది పోర్చుగల్ జట్టు. 14 ఏళ్ల తర్వాత రొనాల్డో ఓ మ్యాచును ప్రారంభించకపోవడం జరిగింది. 2008 యూరోపియన్ ఛాంపియన్షిప్ లో ఇలా జరిగింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అప్పటి ప్రత్యర్థి కూడా స్విస్ జట్టే. అప్పట్నుంచి పోర్చుగల్ జట్టుకు రొనాల్డో 31 మ్యాచులు ఆడాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cristiano Ronaldo, FIFA, FIFA World Cup 2022, Foot ball