హోమ్ /వార్తలు /క్రీడలు /

FIFA World Cup 2022 : వాటే మ్యాచ్.. హోరాహోరీ పోరులో గెలిచి నిలిచిన అర్జెంటీనా.. నెదర్లాండ్స్ ఇంటికి..

FIFA World Cup 2022 : వాటే మ్యాచ్.. హోరాహోరీ పోరులో గెలిచి నిలిచిన అర్జెంటీనా.. నెదర్లాండ్స్ ఇంటికి..

Photo Credit : FIFA

Photo Credit : FIFA

FIFA World Cup 2022 : తొలి మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అనామక సౌదీ అరేబియా చేతిలో ఓటమితో అర్జెంటీనా ఓడిపోవడంతో ఆ జట్టు ముందుకెళ్లడం కష్టమనుకున్నారు. కానీ, ఆ అంచనాల్ని తలకిందులు చేస్తూ దూసుకెళుతుంది మెస్సీ జట్టు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఖతార్ వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్ (FIFA World Cup 2022)లో తమ తొలి మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అనామక సౌదీ అరేబియా చేతిలో ఓటమితో అర్జెంటీనా ఓడిపోవడంతో ఆ జట్టు ముందుకెళ్లడం కష్టమనుకున్నారు. కానీ, ఆ అంచనాల్ని తలకిందులు చేస్తూ దూసుకెళుతుంది మెస్సీ జట్టు. సౌదీ అరేబియా చేతిలో అనూహ్య ఓటమి తర్వాత అర్జెంటీనా బలంగా పుంజుకుంది. నాకౌట్ పోరుల్లో తమ అసలైన ఆటను బయటకు తీస్తూ దుమ్మురేపుతుంది. ఇక, హోరాహోరీగా సాగిన మ్యాచులో నెదర్లాండ్స్ ను పెనాల్టీ షూటౌట్లో చిత్తు చేసి సెమీస్ లోకి అడుగుపెట్టింది అర్జెంటీనా. శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత జరిగిన క్వార్టర్స్‌ మ్యాచ్‌లో మెస్సీ జట్టు 2-2 (4-3)తో నెదర్లాండ్స్ జట్టును ఓడించింది. చివర్లో, అర్జెంటీనా గోల్ కీపర్ ఎమిలియానో ​​మార్టినెజ్ పెనాల్టీ షూటౌట్‌లో హీరోగా నిలవడంతో అర్జెంటీనా 4-3తో విజయం సాధించింది.

ఇక, ఈ మ్యాచులో లియోనల్ మెస్సీ మరోసారి తన మాయాజాలాన్ని ప్రదర్శించాడు. ఒక అసిస్ట్, గోల్ సహాయంతో.. అర్జెంటీనాకు 2-0 గోల్స్ తో ముందంజలో నిలిపాడు. ఇక, అర్జెంటీనా గెలుపు ఖాయమనుకున్న సమయంలో నెదర్లాండ్స్ ఆటగాడు వౌట్ వెఘోర్స్ట్ ఆలస్యంగా మెరిశాడు. 83 వ నిమిషం, 101 నిమిషంలో గోల్స్ చేసి.. నెదర్లాండ్స్ ను రేసులో నిలిపాడు. దీంతో.. అదనపు సమయం అనివార్యమైంది.

పెనాల్టీ షూటౌట్ సాగిందిలా..

అదనపు సమయంలో కూడా రెండు జట్లు గోల్స్ చేయలేకపోయాయి. దీంతో, పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. పెనాల్టీ షూటౌట్ లో అర్జెంటీనా గోల్ కీపర్ ఎమిలియానో ​​మార్టినెజ్ అదరగొట్టాడు. పెనాల్టీ షూటౌట్ కూడా హోరాహోరీగా సాగింది. ఫస్ట్ నెదర్లాండ్స్ ఆటగాడు వర్జిల్ వాన్ డిజ్క్ వేసిన పెనాల్టీ గోల్ ను ఎమిలియానో మార్టినెజ్ ఆపాడు. ఆ తర్వాత మెస్సీ కూల్ గా గోల్ చేయడంతో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత నెదర్లాండ్స్ ప్రయత్నాన్ని ఎమిలియానో సమర్ధవంతంగా ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత అర్జెంటీనా మరో గోల్ చేయడంతో 2-0 ఆధిక్యాన్ని సంపాదించింది.

ఇక, మూడో ప్రయత్నంలో గోల్ చేయడంలో నెదర్లాండ్స్ సఫలం అయింది. అర్జెంటీనా మూడో ప్రయత్నంలో కూడా సక్సెస్ అవ్వడంతో 3-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. నెదర్లాండ్స్ ఆటగాడు వౌట్ వెఘోర్స్ట్ మరోసారి మెరవడంతో 3-2కి అర్జెంటీనా ఆధిక్యాన్ని తగ్గించింది. అయితే.. నాలుగో ప్రయత్నంలో అర్జెంటీనా గోల్ చేయడంలో విఫలం అయింది. అయితే.. నాలుగో ప్రయత్నంలో నెదర్లాండ్స్ మెరవడంతో 3-3 తో రెండు జట్లు మరోసారి సమఉజ్జీలుగా నిలిచాయి. అయితే, ఆఖర్లో అర్జెంటీనా గోల్ కీపర్.. ఎమిలియానో మెరవడం.. డి జాంగ్ గోల్ చేయడంతో 4-3 తో విక్టరీ కొట్టి సెమీస్ కు దూసుకెళ్లింది అర్జెంటీనా.

ఇక, ఈ ఫిఫా వరల్డ్ కప్ 2022లో మెస్సీకి ఇది నాలుగో గోల్. ఓవరాల్ గా మెగాటోర్నీల్లో తన గోల్స్ సంఖ్యను పదికి పెంచుకున్నాడు. ఇదే తన ఆఖరి ఫిఫా ప్రపంచకప్ అని మెస్సీ ఇప్పటికే ప్రకటించాడు. దీంతో.. మెస్సీ తమ జట్టుకు మెగాటోర్నీ అందిస్తాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఫ్యాన్స్ అంచనాలకు అనుగుణంగానే అర్జెంటీనా ఇప్పుడు రెండు అడుగుల దూరంలో నిలిచింది. ఇక, సెమీస్ లో క్రొయేషియాతో అమీతుమీ తేల్చుకోనుంది అర్జెంటీనా.

First published:

Tags: FIFA, FIFA World Cup 2022, Football, Lionel Messi, Netherlands

ఉత్తమ కథలు