హోమ్ /వార్తలు /క్రీడలు /

FIFA World Cup 2022 : ప్రపంచకప్ వీరుడికి ఘన స్వాగతం పలికిన అర్జెంటీనా.. జనసంద్రమైన రోడ్లు

FIFA World Cup 2022 : ప్రపంచకప్ వీరుడికి ఘన స్వాగతం పలికిన అర్జెంటీనా.. జనసంద్రమైన రోడ్లు

PC : TWITTER

PC : TWITTER

FIFA World Cup 2022 : ఒకటి కాదు.. రెండు కాదు.. 36 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర దించిన అర్జెంటీనా (Argentina) ఖతర్ వేదికగా జరిగిన 2022 ఫిఫా ఫుట్ బాల్ ప్రపంచకప్ (FIFA World Cup 2022)లో చాంపియన్ గా అవతరించింది

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

FIFA World Cup 2022 : ఒకటి కాదు.. రెండు కాదు.. 36 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర దించిన అర్జెంటీనా (Argentina) ఖతర్ వేదికగా జరిగిన 2022 ఫిఫా ఫుట్ బాల్ ప్రపంచకప్ (FIFA World Cup 2022)లో చాంపియన్ గా అవతరించింది. గత ఆదివారం జరిగిన ఫైనల్లో లియోనెల్ మెస్సి (Lionel Messi) నాయకత్వంలోని అర్జెంటీనా పెనాల్టీ షూటౌట్ లో ఫ్రాన్స్ పై జయభేరిని మోగించింది. ఈ క్రమంలో 1986 తర్వాత మరోసారి ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడింది. ప్రపంచకప్ ను గెలవడంతో మెస్సి దిగ్గజాల సరసన నిలిచాడు. అర్జెంటీనా దేశంలో అభిమానులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ క్రమంలో అర్జెంటీనా ఫుట్ జట్టు సొంత గడ్డపై అడుగుపెట్టింది. సోమవారం అర్ధ రాత్రి అర్జెంటీనా రాజధాని బ్రూనో ఎయిర్స్ లో ల్యాండ్ అయ్యారు. ఈ క్రమంలో మెస్సి అండ్ కోకు అభిమానులు ఘనస్వాగతం పలికారు.

అర్ధ రాత్రి అయినా బ్రూనో ఎయిర్స్ నగరం రోడ్లన్ని జనసంద్రంతో నిండిపోయాయి. విమానాశ్రయం నుంచి ట్రోఫీతో బయలుదేరిన మెస్సి టీంకు అడుగడుగునా అర్జెంటీనా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ప్రస్తుతం వీటికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

చివరి నిమిషం వరకు ట్విస్ట్ లతో సాగిన ఈ మ్యాచ్ లో చివరి పంచ్ అర్జెంటీనాదే అయ్యింది. తన కెరీర్ లో లోటుగా ఉన్న ట్రోఫీని ఆనందంతో ముద్దాడి అభిమాన లోకాన్ని ఆనందంలో ముంచెత్తేలా చేశాడు. ఆదివారం జరిగిన ఈ థ్రిల్లర్ పోరులో అర్జెంటీనా 4-2తో పెనాల్టీ షూటౌట్ లో ఫ్రాన్స్ పై నెగ్గింది. నిర్ణీత సమయంలో ఇరు జట్లు కూడా 3-3 గోల్స్ తో నిలిచాయి. దాంతో విజేతను తేల్చేందుకు పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. ఇక్కడ అర్జెంటీనా నాలుగింటికి నాలుగు గోల్స్ వేయగా.. ఫ్రాన్స్ మాత్రం నాలుగింటిలో రెండే వేసింది. 20 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత యూరోపియన్ జట్టు కాకుండా ఫుట్ బాల్ ప్రపంచకప్ ను వేరే జట్టు నెగ్గడం ఇదే తొలిసారి. చివరిసారిగా దక్షిణా అమెరికాకు చెందిన బ్రెజిల్ 2022లో విశ్వవిజేతగా నిలిచింది.

First published:

Tags: Celebrations, FIFA, FIFA World Cup 2022, Football, France, Lionel Messi, Qatar

ఉత్తమ కథలు