ఖతార్ వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్ (FIFA World Cup 2022) హోరాహోరీగా సాగుతుంది. ఈ మెగాటోర్నీలో ఇప్పటికే చాలా సంచలనాలు నమోదు అయ్యాయి. అర్జెంటీనా లాంటి మేటి జట్టును సౌదీ అరేబియా చిత్తు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు గ్రూప్ దశ ఆఖర్లో ఇప్పుడు మరో సంచలనం నమోదు అయింది. పసికూన అయిన ట్యునీసియా.. డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్ ను చిత్తు చేసింది. అయితే.. ఇప్పటికే రెండు విజయాలతో ఫ్రాన్స్ నాకౌట్ కు స్టేజీకు చేరుకుంది. అయితే.. ఆస్ట్రేలియా.. డెన్మార్క్ మీద గెలవడం వల్ల ఆ జట్టుకు రెండో నాకౌట్ బెర్తు దక్కింది. దీంతో.. ఫ్రాన్స్ మీద గెలిచినా ట్యునీసియాకు ఫలితం లేకపోయింది. దీంతో.. ఇంటి దారి పట్టాల్సి వచ్చింది. ప్రపంచకప్ నుంచి ఔట్ అయినా.. ట్యునీసియాకు ఇది అతి పెద్ద విజయమే అని చెప్పాలి.
ఉత్కంఠభరితంగా ముగిసిన గ్రూప్ - డి నాకౌట్ రేసులో ఫ్రాన్స్ జట్టును 1-0 తేడాతో ఓడించింది ట్యునీసియా. పసికూనతో పోలీస్తే చాలా మెరుగ్గా ఆడినా ఫ్రాన్స్ ఆటగాళ్లు గోల్ కొట్టడంలో మాత్రం తడబడ్డారు. ఎంబాపే లాంటి స్టార్ ప్లేయర్ కూడా మంచి అవకాశాల్ని వృథా చేశాడు. ట్యునీసియా గోల్ పోస్ట్ పై ఫ్రాన్స్ ఆటగాళ్లు వరుస పెట్టి దాడులు చేసినా.. వారి రక్షణ శ్రేణి అదుర్స్ అన్పించింది. దీంతో ఫస్ట్ హాఫ్ లో రెండు జట్లు గోల్ చేయలేదు. అయితే.. సెకండ్ హాఫ్ లో దూకుడు పెంచినా ట్యునీసియా.. అవకాశం సృష్టించుకున్నారు. ఖజ్రకి 58వ నిమిషంలో గోల్ చేయడంతో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది పసికూన. చివరి వరకు ఇదే ఆధిక్యాన్ని కాపాడుకుని మ్యాచ్ సొంతం చేసుకుంది.
That's a wrap for Group C & Group D ✅
The best result of the day goes to ...?#FIFAWorldCup #Qatar2022 — FIFA World Cup (@FIFAWorldCup) November 30, 2022
ఆఖర్లో హైడ్రామా..
అయితే.. ఈ మ్యాచ్ ఆఖర్లో హై డ్రామా నడిచింది. నిర్ణీత సమయం 90 నిమిషాలు పూర్తయి.. ఇంజురీ టైం మొదలయ్యాకు.. ఇంకో నిమిషం ఆటే మిగిలుండగా ఫ్రాన్స్ ఆటగాడు గ్రీజ్ మన్ మెరుపు షాట్ తో నెట్ లోకి గోల్ పంపాడు. దీంతో.. ట్యునీషియా ఆటగాళ్లు షాక్ లోకి వెళ్లారు. అయితే.. రిఫరీ రీప్లే కోరగా.. అది ఆఫ్ సైడ్ అని తేలడంతో ట్యునీసియా ఆటగాళ్లు ఊపిరి పీల్చుకున్నారు. ఆఖరి మ్యాచ్ ట్యునీసియా సొంతమైంది. అయితే.. ట్యునీసియాతో పోరును ప్రాక్టీస్ లా వాడుకుందామనుకున్న ఫ్రాన్స్ కు ఇది పెద్ద షాకే.
అర్జెంటీనా అదుర్స్..
ఫిఫా ఫుట్ బాల్ ప్రపంచకప్ లో మరో హాట్ ఫేవరెట్ జట్టు రౌండ్ ఆఫ్ 16కి చేరుకుంది. మెస్సీ నేతృత్వంలోని అర్జెంటీనా పోలాండ్ పై జరిగిన పోరులో 2-0 తేడాతో విజయం సాధించింది. ఫస్ట్ హాఫ్ లో రెండు జట్లు హోరాహోరీగా పోరాడటంతో ఎటువంటి గోల్స్ నమోదు కాలేదు. అయితే.. సెకండ్ హాఫ్ లో అర్జెంటీనా తన దూకుడుతో.. పోలాండ్ రక్షణ శ్రేణిని చిత్తు చేసింది.
46 వ నిమిషంలో అలెక్సిస్ మాక్ అలిస్టర్ గోల్ చేయడంతో 1-0 ఆధిక్యంలోకి వచ్చింది. మరో 20 నిమిషాల తర్వాత జులియన్ అల్వరేజ్ గోల్ చేయడంతో అర్జెంటీనా 2-0 గోల్స్ తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక.. చివరి వరకు పోలాండ్ కు ఎటువంటి అవకాశం ఇవ్వకుండా విజయాన్ని సొంతం చేసుకుంది అర్జెంటీనా.
Group C kept us on the edge of our seats! #ARG and #POL are heading to the last 16.
— FIFA World Cup (@FIFAWorldCup) November 30, 2022
పోలాండ్ ఓడినా.. తర్వాత స్టేజికి చేరుకుంది.ఈ గ్రూప్ లోనే ఉన్న సౌదీ అరేబియా, మెక్సికో జట్ల కన్నా పోలాండ్ గోల్స్ ఎక్కువ ఉండటంతో ఆ జట్టు నాకౌట్ స్టేజికి చేరుకుంది. మరోవైపు.. ఈ మ్యాచ్ సందర్భంగా మెస్సీ ఖాతాలో మరో రికార్డ్ నమోదైంది. అర్జెంటీనా తరఫున అత్యధిక ప్రపంచకప్ మ్యాచ్ లు ఆడిన ఆటగాడిగా నిలిచాడు. దిగ్గజం డిగో మారోడానా పేరును ఉన్న రికార్డును పొలాండ్ తో జరిగిన మ్యాచ్ తో బ్రేక్ చేశాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: FIFA, FIFA World Cup 2022, Football, France, Lionel Messi