ఖతార్ వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్ (FIFA World Cup 2022) హోరాహోరీగా సాగుతుంది. ఈ మెగాటోర్నీలో ఇప్పటికే చాలా సంచలనాలు నమోదు అయ్యాయి. అర్జెంటీనా లాంటి మేటి జట్టును సౌదీ అరేబియా చిత్తు చేసిన సంగతి తెలిసిందే. గ్రూప్ దశ ఆఖర్లో ఇప్పుడు మరో సంచలనం నమోదు అయింది. పసికూన అయిన ట్యునీసియా.. డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్ ను చిత్తు చేసింది. ఇప్పుడు అగ్రశ్రేణి జట్లు బెల్జియం, జర్మనీలు ఇంటి దారి పట్టాయి. స్పెయిన్‌ను ఓడించి 20 ఏళ్ల తర్వాత టోర్నమెంట్లో నాకౌట్లో తమ స్థానాన్ని నిర్ధారించుకున్న జపాన్.. చరిత్రను తిరగరాసింది. హాట్ ఫేవరేట్ గా బరిలోకి దిగిన జర్మనీ గెలిచినా ప్రయోజనం లేకుండా పోయింది. తక్కువ పాయింట్లు ఉండటం వల్ల ఇంటి దారి పట్టింది.
92 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి..
92 ఏళ్ల ఫిఫా ప్రపంచకప్ చరిత్రలో జర్మనీ బ్యాక్ టు బ్యాక్ టోర్నమెంట్లో తొలి రౌండ్లోనే నిష్క్రమించడం ఇదే తొలిసారి. అంతకుముందు, 2018లో జరిగిన ప్రపంచకప్‌లో జర్మనీ జట్టు తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. జర్మనీ తన చివరి గ్రూప్ మ్యాచ్‌లో కోస్టారికాను 4-2 తో చిత్తు చేసింది. అయినా, ఫలితం లేకపోయింది. జర్మనీ ఆశలపై జపాన్ నీళ్లు చల్లింది.
ఓడినా స్పెయిన్ ముందుకే..
అయితే, జపాన్ చేతిలో ఓడిపోయినా స్పెయిన్ జట్టు మాత్రం నెక్ట్స్ దశకు క్వాలిఫై అయింది. స్పెయిన్‌తో జరిగిన మ్యాచ్‌లో జపాన్ 2-1 తేడాతో ఘన విజయం సాధించింది. అయితే మ్యాచ్ తొలి అర్ధభాగంలో స్పెయిన్ ఆధిక్యంలో నిలిచింది. దీంతో తొలి అర్ధభాగం 1-0తో స్పెయిన్ చేతిలో నిలిచింది. కానీ, జపాన్ అద్భుత పునరాగమనం ద్వితీయార్థంలో కనిపించింది. మ్యాచ్‌లో 48వ, 51వ నిమిషాల్లో జపాన్ రెండు గోల్స్ చేసి 2-1 తేడాతో మ్యాచ్‌ని ముగించింది.
#MAR and #JPN finish at the top of their groups in a matchday we'll always remember. This is why it's called the beautiful game! Matchday twelve in 60 seconds ⏲️#FIFAWorldCup | #Qatar2022 pic.twitter.com/QfBVK57YH1
— FIFA World Cup (@FIFAWorldCup) December 1, 2022
స్పెయిన్‌పై ఈ ఘన విజయంతో జపాన్ తమ గ్రూప్‌లో నంబర్‌వన్‌కు చేరుకుంది. అదే సమయంలో ఓటమి తర్వాత కూడా స్పెయిన్‌కు నాకౌట్‌కు టికెట్ దక్కింది. స్పెయిన్ ఓటమి తర్వాత, ముగ్గురికి సమాన పాయింట్లు వచ్చాయి. అయితే, గోల్ తేడాతో స్పెయిన్‌కు నాకౌట్‌కు టికెట్ దక్కింది. గ్రూప్ దశ తొలి మ్యాచ్‌లో స్పెయిన్ 7–0తో కోస్టారికాను ఓడించింది. అవే పాయింట్లు ఇప్పుడు కలిసి వచ్చాయి.
అయితే, గ్రూప్ ఈ నుంచి జర్మనీతో పాటు, కోస్టారికా కూడా మొదటి రౌండ్ నుంచి నిష్క్రమించింది.
ప్రపంచకప్ నౌకాట్ కు క్రొయేషియా.. బెల్జియంకు షాక్..
మరోవైపు.. గత మెగా టోర్నీ రన్నరప్ క్రొయేషియా రౌండ్ ఆఫ్ -16 కి దూసుకెళ్లింది. వరల్డ్ నెం-2 బెల్జియంకు ఈ సారి గట్టి షాక్ తగిలింది. ముందంజ వేయాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచులో క్రొయేషియాతో 0-0 తో డ్రా చేసుకున్న ఆ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. గురువారం బెల్జియంతో మ్యాచ్ ను గోల్ లేని డ్రాగా ముగించిన ఆ జట్టు ఐదు పాయింట్లతో గ్రూప్ ఎఫ్ లో తొలి స్థానంలో నిలిచింది. వచ్చిన ఛాన్సుల్ని మిస్ చేసుకున్న బెల్జియం ఇంటి దారి పట్టింది. ఆడిన మూడు మ్యాచుల్లోనూ ఓడిన కెనాడా గ్రూపులో అట్టడుగు స్థానంతో టోర్నీని వీడింది. మొరాకో ఏడు పాయింట్లతో గ్రూపులో మొదటి స్థానం సాధించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: FIFA World Cup 2022, Football, Germany, Japan, Spain