FIFA World Cup 2022: ఫుట్ బాల్ (Football) ప్రియులకు శుభవార్త. ఈ ఏడాది జరిగే ఫిఫా (FIFA) ప్రపంచకప్ కు సంబంధించిన గ్రూప్ ’డ్రా‘ను అధికారులు విడుదల చేశారు. నాలుగేళ్లకు ఒకసారి జరిగే సాకర్ ప్రపంచకప్... ఈ ఏడాది ఖతర్ (Qata) వేదికగా జరగనుంది. నవంబర్ 21 నుంచి డిసెంబర్ 18 వరకు ఈ మెగా ఈవెంట్ జరుగుతుంది. మొత్తం ఎనిమిది గ్రూప్ ల్లో గ్రూప్ కు నాలుగు జట్ల చొప్పున మొత్తం 32 జట్లు ఈ మెగా ఈవెంట్ లో తమ లక్ ను పరీక్షించుకోనున్నాయి. అయితే కోవిడ్ 19 వల్ల కొన్ని జట్లు ఇంకా ప్రపంచకప్ కు క్వాలిఫై కాకపోవడంతో మొత్తం 37 జట్లతో గ్రూప్ డ్రాను విడుదల చేశారు. అయితే ప్రపంచకప్ లో మాత్రం 32 జట్లే పాల్గొంటాయి. ఆతిథ్య దేశం ఖతర్, ఈక్వెడార్ దేశాల మధ్య జరిగే మ్యాచ్ లో టోర్నీ మొదలు కానుంది. ఫైనల్ డిసెంబర్ 18న జరుగుతుంది.
ఈసారి కూడా 2006 చాంపియన్, 2020 యూరో కప్ చాంపియన్ ఇటలీ క్వాలిఫై కాలేకపోయింది. ప్రపంచకప్ కు అర్హత సాధించకపోవడం ఇటలీకిది వరుసగా రెండో సారి కావడం విశేషం. 2018లో కూడా ఇటలీ విశ్వ సంగ్రామానికి అర్హత సాధించలేకపోయింది. నార్త్ మెసడోనియాపై గెలుపొందడంతో క్రిస్టియానో రొనాల్డో నాయకత్వంలోని పోర్చుగల్ కూడా ప్రపంచకప్ కు క్వాలిఫై అయ్యింది.
మెస్సీ జట్టుకు కష్టమే
మెస్సీ నాయకుడిగా ఉన్న అర్జెంటీనా జట్టుకు కఠినమైన డ్రా ఎదురైంది. గ్రూప్ ’సి‘లో ఉన్న అర్జెంటీనా... ప్రిక్వార్టర్స్ కు చేరాలంటే చెమటోడ్చక తప్పదు. ఎందుకంటే ఆ గ్రూప్ లో మెక్సికో, పొలాండ్ రూపంలో రెండు కఠిన ప్రత్యర్థులు ఉన్నాయి. ప్రతి గ్రూప్ లో నాలుగు జట్లు ఉండగా... ఒక్కో జట్టు మిగతా మూడు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. గ్రూప్ దశ ముగిసిన తర్వాత టాప్ 2లో నిలిచిన జట్లు మాత్రమే ప్రిక్వార్టర్స్ కు అర్హత సాధిస్తాయి. ఇక గ్రూప్ ’ఇ‘లో మాజీ చాంపియన్స్ స్పెయిన్ (2010), జర్మనీ (2014) జట్లు ఉన్నాయి. వీటితో పాటు జపాన్ కూడా ఉండటంతో ఈ గ్రూప్ కూడా ఆసక్తికరంగా ఉండనుంది. తనదైన రోజున ఎంతటి మేటి జట్టునైనా సరే ఓడించడంలో జపాన్ ముందుంటుంది. మరో స్థానంలో న్యూజిలాండ్ లేదా కోస్టారికా ఆడనుంది.
ఏ గ్రూప్ లో ఏ జట్లు ఉణ్నాయంటే
గ్రూప్ ’ఎ‘ : ఖతర్, నెదర్లాండ్స్, సెనెగల్, ఈక్వెడార్
గ్రూప్ ’బి‘: ఇంగ్లండ్, యూఎష్, ఇరాన్, వేల్స్ OR స్కాట్లాండ్ OR ఉక్రెయిన్
గ్రూప్ ’సి‘: అర్జెంటీనా, మెక్సికో, పొలాండ్, సౌదీ అరేబియా
గ్రూప్ ’డి‘: ఫ్రాన్స్, డెన్మార్క్, ట్యునీషియా, పెరూ OR ఆస్ట్రేలియా OR యూఏఈ
గ్రూప్ ’ఇ‘: స్పెయిన్, జర్మనీ, జపాన్, కోస్టారికా OR న్యూజిలాండ్
గ్రూప్ ’ఎఫ్‘: బెల్జియమ్, క్రొయేషియా, మొరాకో, కెనడా
గ్రూప్ ’జి‘: బ్రెజిల్, స్విట్జర్లాండ్, సెర్బియా, కెమరూన్
గ్రూప్ ’హెచ్‘: పోర్చుగల్, ఉరుగ్వే, సౌత్ కొరియా, ఘనా
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cristiano Ronaldo, Football, Lionel Messi, Spain, World cup