ఫిఫా ప్రపంచకప్ (FIFA World Cup 2022) లో హాట్ ఫేవరేట్ జట్టు అర్జెంటీనా (Argentina) ముందడుగు వేసింది. తన ప్రారంభ గ్రూప్ మ్యాచ్‌లో సౌదీ అరేబియాతో జరిగిన షాకింగ్ ఓటమి నుండి పూర్తిగా కోలుకొన్న అర్జెంటీనా ఆ తర్వాత నుంచి దుమ్మురేపుతుంది. మెస్సీ తడాఖా చూపించి.. మరోసారి ప్రపంచానికి తానెంటో చూపాడు. మెస్సీ, జూలియన్ అల్వారెజ్ గోల్స్ తో అర్జెంటీనా.. 2-1 తేడాతో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. ఆసీస్ ను చిత్తు చేయడంతో క్వార్టర్స్ ఫైనల్ లోకి సగర్వంగా అడుగుపెట్టింది. కెరీర్ లో 1,000వ ప్రొఫెషనల్ గేమ్ ఆడుతున్న మెస్సీ.. 35 వ నిమిషంలో అద్భుతమైన గోల్ తో తన జట్టుకు ఆధిక్యాన్ని అందించాడు. ఫస్టాఫ్ లో అర్జెంటీనా దూకుడుతో ఆస్ట్రేలియా పూర్తిగా డిఫెన్స్ లోకి వెళ్లింది. ఇక 1-0 గోల్ ఆధిక్యంతో అర్జెంటీనా ఫస్టాఫ్ ను ముగించింది.
ఇక.. సెకండాఫ్ లో జూలియన్ అల్వారెజ్ 57వ నిమిషంలో కొట్టిన గోల్ తో.. అర్జెంటీనాకు స్పష్టమైన ఆధిక్యాన్ని అందించాడు. ఇక, ఆట 77 వ నిమిషంలో క్రెయిగ్ గోడ్విన్స్ కొట్టిన షాట్.. అర్జెంటీనా మిడ్‌ఫీల్డర్ ఎంజో ఫెర్నాండెజ్ కు తగిలి సెల్ఫ్ గోల్ అవ్వడంతో ఆస్ట్రేలియాకు ఓదార్పు గోల్ దక్కింది. ఆస్ట్రేలియన్లు ఆలస్యంగా దూకుడు ప్రదర్శించినా ఫలితం లేకపోయింది. మ్యాచును 2-1 తేడాతో అర్జెంటీనా కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియా నాకౌట్ చేరడం ఇది రెండో సారి. మొదటి సారి 2006 వరల్డ్ కప్ లో ఇటలీ చేతిలో రౌండ్ ఆఫ్ 16 లో ఓడిపోయింది.
Argentina secure their spot in the Quarter-finals! ????@adidasfootball | #FIFAWorldCup
— FIFA World Cup (@FIFAWorldCup) December 3, 2022
మెస్సీ మ్యాజిక్..
ఇక, ఈ మ్యాచులో మెస్సీ అరుదైన రికార్డు అందుకున్నాడు. ఈ మ్యాచులో చేసిన గోల్ ప్రపంచకప్ టోర్నీల్లో మెస్సీకి 9వది. దీంతో.. అర్జెంటీనా లెజెండ్ డిగో మారడోనాను అధిగమించాడు. డిగో మారడోనా ప్రపంచకప్ టోర్నీల్లో 9 గోల్స్ చేశాడు. ఇక, ఈ మెగాటోర్నీలో మెస్సీకి ఇది మూడో గోల్. ఇక, 1000 వ ప్రొఫెషనల్ గేమ్ ఆడుతున్న మెస్సీ 789 గోల్స్ చేశాడు. ఇక, మెస్సీకి ఇది చివరి ప్రపంచకప్. దీని తర్వాత మెగాటోర్నీ ఆడనని ఇప్పటికే మెస్సీ స్పష్టం చేశాడు. దీంతో.. అర్జెంటీనా ఫ్యాన్స్.. మెస్సీ ప్రపంచకప్ అందించి.. గుడ్ బై చెబుతాడని ఆశిస్తున్నారు. ఇక, క్వార్టర్ ఫైనల్ లో నెదర్లాండ్స్ తో అమీతుమీ తేల్చుకోనుంది అర్జెంటీనా.
నెదర్లాండ్స్ అదుర్స్..
అంతకుముందు.. ఫిఫా వరల్డ్ కప్ 2022 (FIFA World Cup 2022)లో ప్రిక్వార్టర్స్ లో డచ్ జట్టు (Netherlands) అదుర్స్ అన్పించింది. గ్రూప్ దశలో సాధారణ ప్రదర్శనతో నిరాశపర్చినా నెదర్లాండ్స్.. కీలకమైన నాకౌట్ మ్యాచులో జూలు విదిల్చింది. ఆద్యంతం అద్భుతమైన ఆటతో అమెరికా(USA)ను మట్టికరిపించి.. క్వారర్స్ ఫైనల్ లో సగర్వంగా అడుగుపెట్టింది. అమెరికాపై ఆధిపత్యం చలాయిస్తూ 3-1తో ఆ జట్టును చిత్తు చేసింది. మెంఫిస్ డిపే (10వ), డాలీ బ్లైండ్ (45+1), డెంజల్ డమ్‌ఫ్రైస్ (81వ) గోల్స్ చేయగా.. అమెరికా తరఫున హజీ రైట్ (76వ) ఏకైక గోల్ సాధించాడు. రెండు గోల్స్‌కు బాటలు వేసిన డమ్‌ఫ్రైస్.. మూడో గోల్ చేసి ఫినిషింగ్ టచ్ ఇచ్చా డు. ఈ ఓటమితో అమెరికా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ప్రపంచకప్ టోర్నీలో నెదర్లాండ్స్ జట్టు క్వార్టర్స్ చేరడం ఇది ఏడోసారి. అమెరికా జట్టు 2002లో మాత్రమే క్వార్టర్స్ ఆడింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Australia, FIFA World Cup 2022, Foot ball, Lionel Messi