Home /News /sports /

FIFA SUSPENDS ALL INDIA FOOTBALL FEDERATION FOR THIRD PARTY INFLUENCE SJN

FIFA : భారత ఫుట్ బాల్ సమాఖ్యపై వేటు వేసిన ఫిఫా.. కారణం ఇదేనా?

PC : TWITTER

PC : TWITTER

FIFA : అఖిల భారత ఫుట్ బాల్ సమాఖ్య (All India Football Federation)కు ఫిఫా (FIFA) షాకిచ్చింది. భారత ఫుట్ బాల్ సమాఖ్యను సస్పెన్స్ చేస్తున్నట్లు ఫిఫా మంగళవారం ప్రకటించింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
FIFA : అఖిల భారత ఫుట్ బాల్ సమాఖ్య (All India Football Federation)కు ఫిఫా (FIFA) షాకిచ్చింది. భారత ఫుట్ బాల్ సమాఖ్యను సస్పెన్స్ చేస్తున్నట్లు ఫిఫా మంగళవారం ప్రకటించింది. భారత ఫుట్ బాల్ ఫెడరేషన్ లో బయటి వ్యక్తుల జోక్యం ఎక్కువగా ఉన్నట్లు తేల్చిన ఫిఫా.. ఇలాంటి సమాఖ్యలను తాము గుర్తించలేమని స్ఫష్టం చేస్తూ భారత ఫుట్ బాల్ ఫెడరేషన్ పై నిషేధం విధించింది.  ఈ సస్పెన్షన్‌ తక్షణమే అమల్లోకి వస్తుందని ఫిఫా తమ అధికారిక ప్రకటనలో పేర్కొంది.  ఫిఫా చట్టాలను ఉల్లఘించినందుకు భారత ఫుట్ బాల్ ఫెడరేషన్ పై ఈ మేరకు చర్యలకు ఉపక్రమించినట్లు వివరించింది. ఈ విషయంపై ఫిఫా కౌన్సిల్ బ్యూరో ఏకగ్రీవ తీర్మానం చేసింది.

కారణం ఇదే

పేరుకు అఖిల భారత ఫుట్ బాల్ సమాఖ్యే కానీ.. ఇప్పటి వరకు ఈ ఫెడరేషన్ కు పూర్తి స్థాయి కార్యవర్గం లేదు. కేవలం ముగ్గురు సభ్యులతో కూడిన ఎగ్జిక్యూటివ్ కమిటీతోనే కార్యకలాపాలను సాగిస్తూ వచ్చింది. ఫిఫా చట్టాల ప్రకారం ప్రతి ఫుట్ బాల్ సమాఖ్య కూడా 12 నుంచి 15 మందితో కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కానీ, భారత ఫుట్ బాల్ సమాఖ్య మాత్రం ముగ్గురు సభ్యులతోనే కార్యవర్గ కమిటీని నడిపిస్తోంది.



ఇప్పటికే ఫిఫా ఈ విషయంలో భారత్ ను హెచ్చరించింది. అయినా వాటిని భారత సమాఖ్య లెక్కలోకి తీసుకోలేదు. దాంతో నిషేధం వేసింది.  తాజా నిర్ణయంతో ముగ్గురు సభ్యుల ఏఐఎఫ్‌ఎఫ్‌ ఎగ్జిక్యూటివ్ కమిటీ అధికారాలు పూర్తిగా రద్దు అయ్యాయని, ఏఐఎఫ్ఎఫ్‌పై పాలక మండలి తిరిగి నియంత్రణ పొందేందుకు నిర్వాహకుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు వివరించింది.



భారత ఫుట్ బాల్ సమాఖ్యపై సస్పెన్షన్‌ కారణంగా భారత్ వేదికగా ఈ ఏడాది అక్టోబర్ 11 నుంచి 30 వరకు జరగాల్సిన అండర్17 మహిళల ఫుట్ బాల్ ప్రపంచకప్ పై అనిశ్చితి నెలకొంది. ఆతిథ్య దేశం హోదాలో భారత్ ఈ టోర్నీలో ఆడనుంది. దీనిపై ఫిఫా త్వరలోనే ప్రకటన విడుదల చేసే అవకాశముంది. కాగా, ఏఐఎఫ్‌ఎఫ్‌ రాజ్యాంగాన్ని సవరించేందుకు అలాగే 18 నెలలుగా పెండింగ్‌లో ఉన్న ఏఐఎఫ్‌ఎఫ్‌ ఎన్నికలను నిర్వహించేందుకు సుప్రీం కోర్టు ఈ ఏడాది మే నెలలో ఏఐఎఫ్‌ఎఫ్‌  పాలక మండలిని రద్దు చేసి ముగ్గురు సభ్యుల ఎగ్జిక్యూటివ్ కమిటీని నియమించింది.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: FIFA, Foot ball, Football, India

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు