ఢిల్లీ ఫిరోజ్‌ షా కోట్లా క్రికెట్ స్టేడియానికి అరుణ్ జైట్లీ పేరు

స్టేడియానికి అరుణ్ జైట్లీ పేరు పెట్టే కార్యక్రమానికి కేంద్రహోంమంత్రి అమిత్ షా, క్రీడాశాఖ మంత్రి రిజుజు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.

news18-telugu
Updated: August 27, 2019, 6:35 PM IST
ఢిల్లీ ఫిరోజ్‌ షా కోట్లా క్రికెట్ స్టేడియానికి అరుణ్ జైట్లీ పేరు
అరుణ్ జైట్లీ-పద్మ విభూషణ్-ప్రజా సేవ-ఢిల్లీ
  • Share this:
అరుణ్ జైట్లీకి ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (DDCA) ఘన నివాళి అర్పించింది. ఢిల్లీలోని ఫిరోజ్‌షా కోట్ల స్టేడియం పేరును అరుణ్ జైట్లీ స్టేడియంగా మార్చుతున్నట్లు మంగళవారం ప్రకటించింది. స్టేడియం పేరును మాత్రమే అరుణ్‌జైట్లీ స్టేడియంగా మారుస్తున్నామని.. మైదానానికి ఫిరోజ్‌ షా కోట్ల పేరునే కొనసాగిస్తామని డీడీసీఏ స్పష్టం చేసింది. ఇక స్టేడియంలోని ఓ స్టాండ్‌కు విరాట్ కోహ్లీ పేరు పెట్టనున్నారు. గతంలో అరుణ్ జైట్లీ డీడీసీఏ అధ్యక్షుడిగా ఉన్నారు. బీసీసీఐలో కీలక పదవులను అలంకరించిన ఆయన క్రికెట్‌ రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు ఎంతో కృషి చేశారు.

విరాట్‌ కోహ్లీ, వీరేంద్ర సెహ్వాగ్‌, గౌతమ్‌ గంభీర్‌, ఆశిష్‌ నెహ్రా, రిషభ్‌ పంత్‌తో పాటు చాలా మంది క్రికెటర్లు అరుణ్ జైట్లీ పోత్సాహం వల్లే దేశం గర్వించేలా చేశారని డీడీసీఐ అధ్యక్షుడు రజత్ శర్మ అన్నారు. ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలో స్టాండ్ల నిర్మాణం, మౌలిక వసతులు, ఆధునీకరణ వంటి అరుణ్ జైట్లీ ఆధ్వర్యంలోనే జరిగాయని గుర్తు చేశారు. స్టేడియానికి అరుణ్ జైట్లీ పేరు పెట్టే కార్యక్రమానికి కేంద్రహోంమంత్రి అమిత్ షా, క్రీడాశాఖ మంత్రి రిజుజు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.


First published: August 27, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading