ఆటల్లో ప్రత్యర్థి ఆటగాళ్లని కవ్వించడం మనం ఎప్పుడూ చూస్తూనే ఉంటాం. క్రికెట్ లో అయితే స్లెడ్జింగ్ పేరుతో జరిగిన ఎన్నో ఘటనలు మనకు తెలుసు. ఇక ఫుట్ బాల్ గేమ్ లో కూడా ఇలాంటి కవ్వింపు చర్యల్ని చాలానే చూశాం. అయితే ఒక్కొక్కసారి ఈ కవ్వింపు చర్యలు హద్దు మీరి గొడవలకు దారితీస్తుంటాయ్. కానీ, ఒక జట్టుకు చెందిన ఆటగాళ్లు కొట్టుకోవడం చాలా అరుదు. కానీ, ఇలాంటి గొడవే పోర్చుగల్ ప్రీమియర్ లీగ్ లో జరిగింది. పోర్చుగల్ ప్రీమియర్ లీగ్ లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. మంగళవారం పోర్టో-ఫారెన్సె జట్ల మధ్య మ్యాచ్ ముగిశాక.. పోర్టో టీమ్ కెప్టెన్ పెపె అదే జట్టులోని సహచర ఆటగాడు మామడులోమ్ మధ్య గొడవ జరిగింది. ఇరువురు ఆటగాళ్లు కాస్త హద్దుమీరి ప్రవర్తించారు. ఒకరి మీద మరొకరు చేయి చేసుకునే వరకు వెళ్ళారు. అంతలో మిగతా ఆటగాళ్లు, రిఫరీలు వచ్చి వారిని కంట్రోల్ చేసి గొడవను సద్దుమణిగేలా చేశారు. ఈ పోరులో ఫారెన్సె జట్టుపై పోర్టో 1-0తేడాతో విజయం సాధించింది. అయితే, గ్రౌండ్ లో గొడవకు దిగడంపై లీగ్ నిర్వహకులు సీరియస్ అవతున్నారు. ఆటగాళ్ల ప్రవర్తన నియమ ఉల్లంఘనా కిందకు వస్తోందని లీగ్ నిర్వహకులు చెబుతున్నారు.
పోర్టో టీమ్ కెప్టెన్ పెపె మరియు మామడులోమ్ లపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఇద్దరి మ్యాచ్ ఫీజుల్లో కోత విధించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై విచారణ జరిపిన తర్వాత ఇద్దరి ఆటగాళ్లపై ఒకటి, రెండు మ్యాచ్ లు నిషేధం పడే అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Football, Viral Video, Youtube