• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • FANS REACTS TO ROHIT RUN OUT BY RCB SKIPPER RUSHES TO RUN HITMAN OUT SA

నా ఫస్ట్ వికెట్ నీ వల్లే... సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన రనౌట్!‌

నా ఫస్ట్ వికెట్ నీ వల్లే...   సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన రనౌట్!‌

Rohith sharma Run out

ఇక తొలి ఐపీఎల్ మ్యాచ్‌లో ఆర్‌సీబీ విజేతగా నిలిచింది. 2 వికెట్ల తేడాతో డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. టాస్ గెలిచిన కోహ్లీ ముంబైని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.

  • Share this:
    చెన్నైలో చెపాక్‌ వేదికగా ముంబై ఇండియన్స్‌, ఆర్‌సీబీ మధ్య జరుగి తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ రనౌట్‌గా వెనుదిరిగిన సంగతి తెలిసిందే. బెంగళూర్ చహల్‌ వేసిన 4వ ఓవర్‌‌లో చివరి బంతిని క్రిస్‌ లిన్‌ కవర్స్‌ ఆడాడు. దీంతో నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌లో ఉన్న రోహిత్‌ పరుగు కోసం పయత్నించాడు. దీంతో బంతిని అందుకున్న కోహ్లీ చహల్‌కు త్రో వెంటనే అతను వికెట్లను గిరాటేయడంతో రోహిత్ రనౌట్ అయాడు. ప్రస్తుతం ఈ రనౌట్ సోషల్ మీడియా బాగా వైరల్‌గా మారింది.  ఐపీఎల్ 2021లో ఫస్ట్ వికెట్ కోహ్లీకే దక్కిందంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.





    ఇక తొలి ఐపీఎల్ మ్యాచ్‌లో ఆర్‌సీబీ విజేతగా నిలిచింది. 2 వికెట్ల తేడాతో డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. టాస్ గెలిచిన కోహ్లీ ముంబైని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. దీంతో ముంబై 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ముంబై ఇండియన్స్ బాట్స్‌మెన్‌లలో క్రిస్‌ లిన్‌ (35 బంతుల్లో 49; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. మెుదటి రోహిత్ శర్మతో మెుదలైన ముంబై ఇండియన్స్ పతనం చివరి వరకు కోనసాగింది. రోహిత్ తర్వాత లిన్‌, సూర్యకుమార్ జోడీ ముంబైకి అండగా నిలిచారు. తర్వాత వీరి జేమీసన్‌ విడదీశాడు. పదో ఓవర్‌ చివరి బంతికి సూర్య‌ను బోల్తా కొట్టించాడు. అతడు కీపర్‌ డివిలియర్స్‌కు చిక్కడంతో ముంబై 94 పరుగుల వద్ద రెండో వికెట్‌ కోల్పోయింది. ఆ తర్వాత కాసేపటికే లిన్‌ అర్ధ శతకానికి ఒక్క పరుగు ముందు సుందర్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌ చేరాడు. ఆ తర్వాత హార్దిక్‌ పాండ్యా (13), ఇషాన్‌ కిషన్ ‌(28) ధాటిగా ఆడే ప్రయత్నం చేసినా.. ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. బెంగళూరు పేసర్ హ‌ర్ష‌ల్ ప‌టేల్ ఐదు వికెట్ల‌తో చెలరేగడంతో డిఫెండింగ్ చాంపియ‌న్స్ ముంబై ఇండియ‌న్స్‌ తడబడింది.



    ఆ తర్వాత చేధనను అరభించిన ముంబై అదే రీతిలో తన ఆటను కోనసాగించింది. కోహ్లీ,వాషింగ్టన్ సుందర్ ఓపెనర్లగా బరిలోకి దిగారు. సుందర్(10) స్వల్ఫ స్కోర్‌తో నిరాశ పరచగా.. తొలి సారి ఐపీఎల్‌ మ్యాచ్‌ ఆడుతున్న రజత్‌ పటిదార్‌ (8) అదృష్టం కలసి రాలేదు. ఆ తర్వాత వచ్చిన మ్యాక్స్‌వెల్‌.. కోహ్లికి తొడవ్వడంతో ఇన్నింగ్స్ వేగంగా ముందుకు వెళ్ళింది. ఆ తర్వాత ఆర్సీబీ వరకుసగా వికెట్లు కొల్పోయింది. 35 బంతుల్లో 57 పరుగులు చేయాల్సి ఉండగా డివిలియర్స్ సిక్సర్లతో విరుచుపడ్డాడు. తర్వాత అతను ఔట్ కావడంతో ఆర్సీబీ కాస్త ఇబ్బందుల్లో పడింది. ఆఖరి ఓవర్లో 7 పరుగులు కావాల్సి ఉండగా సింగిల్స్‌తో టెలండర్లు మ్యాచ్‌ని గెలిపించారు.
    Published by:Rekulapally Saichand
    First published:

    అగ్ర కథనాలు