FANS PUZZLED OVER YUZVENDRA CHAHAL AND ASISH NEHRAS HILARIOUS INTERACTION WATCH VIDEO SRD
Viral Video : ' ఓరి మీ దుంపతెగ.. తప్ప తాగి రోడ్డు మీద ఈ రచ్చ ఏంటి సామీ..! '
Photo Credit : Instagram
Viral Video : టీమిండియా మాజీ పేసర్, గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) కోచ్ ఆశిష్ నెహ్రా (Asish Nehra), రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) ఆటగాడు చాహల్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
టీమిండియా(Team India) మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ (Yuzvendra Chahal) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. స్పిన్ మాయాజాలంతో పాటు చిలిపితనం కూడా మనోడికి బాగానే ఉంటుంది. మ్యాచ్ జరుగుతుండగానే సహచరులను తన పనులతో ఆటపట్టిస్తుంటాడు. యూజీకి ప్రత్యేకంగా ఓ యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది. అందులో టీమిండియా ఆటగాళ్లను ఇంటర్వ్యూ కూడా చేస్తుంటాడు. ఆ సమయంలో చాలా ఫన్ క్రియేట్ చేస్తాడు. ఇక, ఏదైనా మ్యాచ్ లో భారత్విజయం సాధించగానే.. చాహల్ మైక్ పట్టుకొని వచ్చి హంగామా చేస్తూ ఉంటాడు. ఎవరినో ఒకరిని ఇంటర్వ్యూ చేస్తుంటాడు. ఆ వీడియోలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతుంటాయ్. కానీ, లేటెస్ట్ గా చాహల్ గురించి వైరలవుతున్న వీడియో (Viral Video) చూసి ఫ్యాన్స్ షాక్ కు గురవుతున్నారు.
వివరాల్లోకెళితే..టీమిండియా మాజీ పేసర్, గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) కోచ్ ఆశిష్ నెహ్రా (Asish Nehra), రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) ఆటగాడు చాహల్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఐపీఎల్ (IPL) ఫైనల్ ముగిసిన అనంతరం ఓ పార్టీలో మద్యం సేవించగా.. అనంతరం రోడ్డు మీద ఈ ఇద్దరు నానా రచ్చ చేశారు. పార్టీ అయిపోయిన తర్వాత చాహల్‌ను నెహ్రా ‘అరే బస్‌లో వెళ్దాం రా’ అంటే దానికి ‘అన్నా నేను కార్లో వెళ్తా.. నా వైఫ్ కూడా ఉంది. తనను వదిలి ఎలా రావాలి’ అంటూ చాహల్ సమాధానమిచ్చాడు.
దీంతో నెహ్రా స్పందిస్తూ.. ‘అవునా.. నీ భార్య కూడా మనతో పాటే బస్‌లో వస్తుంది పదా..’ అంటూ కారు ఎక్కబోతున్న చాహల్ భార్య ధనశ్రీ వర్మను కూడా బస్ దగ్గరికి తీసుకెళ్లాడు. అయితే ఈ ఇద్దరి మాటలు, ప్రవర్తన చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. తప్ప తాగి రోడ్డు మీద ఈ రచ్చ ఏంటి అంటూ కామెంట్లు చేస్తున్నారు. క్రికెటర్ల అయి ఉండి.. యూత్ కు ఏం మేసేజ్ ఇస్తున్నారు..ఇలా చేయడం ఏందని ప్రశ్నిస్తున్నాను
అయితే.. రాజస్తాన్ రాయల్స్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ తో నెహ్రా క్లోజ్‌గా ఉంటాడు. నెహ్రా ఆర్సీబీ కోచింగ్ టీమ్‌లో ఉన్నప్పుడు చాహల్ తో క్లోజ్‌గా ఉండేవాడు.ఐపీఎల్-15లో చాహల్.. 17 మ్యాచుల్లో 27 వికెట్లు తీసి సీజన్ లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు.
ఈ సీజన్ లో ఓ హ్యాట్రిక్ తో పాటు ఒక మ్యాచ్ లో 5 వికెట్ల ప్రదర్శన చేసిన చాహల్‌కే పర్పుల్ క్యాప్ దక్కింది. ఇక, సౌతాఫ్రికాతో జరగనున్న ఐదు టీ20 మ్యాచ్ ల సిరీస్ కోసం టీమిండియా జట్టులోకి ఎంపికయ్యాడు చాహల్. ఇక నెహ్రా.. గుజరాత్ టైటాన్స్ కోచ్‌గా టైటిల్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా ఐపీఎల్ టైటిల్ అందించిన తొలి భారత కోచ్ గా రికార్డు క్రియేట్ చేశాడు.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.