• Home
  • »
  • News
  • »
  • sports
  • »
  • FANS INAPPROPRIATE BEHAVIOR WITH NEW ZEALAND CRICKETERS TWO FANS REMOVED FROM STADIUM JNK

WTC Final : ఆటగాళ్లను అసభ్య పదజాలంతో దూషించిన ఫ్యాన్స్.. రోజ్ బౌల్ స్టేడియం నుంచి గెంటివేత

డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఆటగాళ్లపై అభ్యంతరకర వ్యాఖ్యలు (twitter ICC)

  • Share this:
    న్యూజీలాండ్ (New Zealand), ఇండియా (India) మధ్య సౌతాంప్టన్‌లోని రోజ్ బౌల్ స్టేడియం (Rose Bowl Stadium) వేదికగా ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC Final) జరుగుతున్న సంగతి తెలిసిందే. ఐదో రోజు (మంగళవారం) మ్యాచ్ జరుగుతుండగా అనుకోని సంఘటన చోటు చేసుకుంది. ఫైనల్ చూడటానికి వచ్చిన ప్రేక్షకులు మైదానంలోని న్యూజీలాండ్ ఆటగాళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. స్టేడియంలోని 'ఎం' బ్లాక్‌లో కూర్చున్నారు. అది ఇరు జట్లు బస చేస్తున్న హోటల్ కిందనే ఉంటుంది. అయితే ఆ సమయంలో అక్కడ కనపడిన న్యూజీలాండ్ క్రికెటర్ రాస్ టేలర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. జాతివివక్ష వ్యాఖ్యలతో పాటు అనుచితంగా మాట్లాడినట్లు గుర్తించారు. వెంటనే భద్రతా సిబ్బందికి విషయం తెలియజేయడంతో వారిని మైదానం నుంచి బయటకు గెంటేసినట్లు సమాచారం. కాగా. ఈ విషయంపై ఐసీసీ స్పందించింది. 'రోజ్ బౌల్ స్టేడియంలో ఇద్దరు వ్యక్తులు ఆటగాళ్లను దూషించినట్లు మాకు సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వారిని క్రికెట్ స్టేడియం నుంచి గెంటేశారు. వివక్షతో కూడిన వ్యాఖ్యలు చేస్తే మాత్రం అస్సలు ఉపేక్షించం' అని ఐసీసీ తెలిపింది.

    అయితే ఎం బ్లాక్‌లో కూర్చున్న ఇద్దరు వ్యక్తులు ఆటగాళ్లపై అభ్యంతర రీతిలో దూషిస్తున్నట్లు ఇతర అభిమానుల ద్వారా ఐసీసీకి సోషల్ మీడియాలో పిర్యాదు చేశారు. ఈ పిర్యాదును అందుకున్న తర్వాతే ఐసీసీకి చెందినే భద్రతా సిబ్బంది అక్కడకు చేరుకొని విషయాన్ని దృవీకరించుకున్నారు. అనంతరం వెంటనే ఇద్దరు వ్యక్తులను బయటకు పంపించేశారు. కివీస్ బ్యాట్స్‌మాన్ రాస్ టేలర్‌ను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసినట్లు ఒక క్రీడా ఛానల్ పేర్కొన్నది. మరోవైపు మైదానం బయట ఏం జరిగిందో తమకు తెలియదని మీడియా సమావేశంలో టిమ్ సౌథీ పేర్కొన్నాడు. మేమైతే ఎప్పుడైనా క్రీడా స్పూర్తి తోనే ఆడతాము. ఏనాడూ గీత దాడి ప్రమర్తించలేదు. టేలర్‌పై వ్యాఖ్యలు చేసినట్లు మాకు తెలియదు అని అతడు మీడియాకు తెలిపాడు. టీమ్ ఇండియా ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా కూడా పేసర్ మహ్మద్ సిరాజ్‌పై జాత్యహంకార వ్యాఖ్యలు చేశారు. అప్పుడు కూడా ఒక బృందాన్ని సిడ్నీ క్రికెట్ స్టేడియం నుంచి బయటకు పంపించి వేశారు.







    ఇక డబ్ల్యూటీసీ ఫైనల్ వర్షం ఆటంకాల మధ్య సాగుతూనే ఆసక్తికరంగా మారింది. టీమ్ ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 217కు ఆలౌట్ అవగా.. న్యూజీలాండ్ జట్టు 249 పరుగులకు చాప చుట్టేసింది. మహ్మద్ షమి, ఇషాంత్ శర్మ కలిసి కివీస్ నడ్డి విరిచారు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో భారత జట్టు తడబడింది. కీలకమైన ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. ఆట ముగిసే సమయానికి భారత జట్టు 2 వికెట్ల్ నష్టానికి 64 పరుగులు చేసింది. రిజర్వ్ డే రోజు మిగిలిన 3 సెషన్ల పాటు ఆట జరిగితే మ్యాచ్ రసవత్తరంగా మారే అవకాశం ఉన్నది.
    Published by:John Naveen Kora
    First published: