హోమ్ /వార్తలు /క్రీడలు /

IPL 2022 Final : ' కొంచెమన్నా సిగ్గుండాలి.. ఫైనల్ మజా లేకుండా చేశారు.. పీకిపారేయండి సార్ '..

IPL 2022 Final : ' కొంచెమన్నా సిగ్గుండాలి.. ఫైనల్ మజా లేకుండా చేశారు.. పీకిపారేయండి సార్ '..

Photo Credit : Twitter

Photo Credit : Twitter

IPL 2022 Final : క్రికెట్‌లో ఐపీఎల్‌కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రపంచ క్రికెట్‌లో భారత్ (India) అగ్రస్థానంలో నిలవడానికి, బీసీసీఐ (BCCI) రిచెస్ట్ బోర్డ్ అవ్వడానికి కూడా కారణం ఇదే. కామధేనువులా మారిన ఐపీఎల్.. బీసీసీఐకి కాసుల వర్షాన్ని కురిపిస్తోంది.

ఇంకా చదవండి ...

ఇంగ్లండ్ (England) లో పుట్టి అక్కడ విజయవంతమైన పొట్టి క్రికెట్ (T20 Cricket) కు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ తెచ్చింది నిస్సందేహంగా ఐపీఎల్ (IPL) అనేది ఎవ్వరూ కాదనలేని అంశం. క్రికెట్‌లో ఐపీఎల్‌కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రపంచ క్రికెట్‌లో భారత్ (India) అగ్రస్థానంలో నిలవడానికి, బీసీసీఐ (BCCI) రిచెస్ట్ బోర్డ్ అవ్వడానికి కూడా కారణం ఇదే. కామధేనువులా మారిన ఐపీఎల్.. బీసీసీఐకి కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. అయితే.. ఫైనల్ లైవ్ ప్రసారాల్లో జరిగిన తప్పులు ఐపీఎల్, బీసీసీఐ దిగజారేలా చేసింది. ప్రపంచ క్రికెట్ లో ఫేమస్ లీగ్ లో అది.. ఫైనల్ లైవ్ లో ఇలాంటి సమస్యలు అభిమానులకు చికాకులు తెప్పించాయ్. ఇంతకీ ఏం జరిగిదంటే.. రెండు నెలల పాటు క్రికెట్‌ ప్రేమికులను ఉర్రూతలూగించిన ఐపీఎల్​ 15వ సీజన్​లో గుజరాత్​ టైటాన్స్​ జట్టు విజేతగా​ నిలిచింది. లీగ్​లో అడుగుపెట్టిన తొలి సీజన్​లోనే ఫైనల్​ చేరి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన గుజరాత్​.. అదే ఊపులో కప్పుకొట్టేసింది. ఆరంభ సీజన్​లో టైటిల్ గెలిచాక ఇంత కాలానికి మళ్లీ ఫైనల్లో అడుగుపెట్టిన రాజస్థాన్​కు నిరాశ ఎదురైంది.

అయితే, ఫైనల్ మ్యాచు ఫ్యాన్స్ కు మాత్రం నిరాశపర్చింది. ముఖ్యంగా హాట్ స్టార్ సబ్ స్రైబర్లకి చికాకు తెప్పించింది. ప్రతిష్టాత్మక పైనల్ కోసం చాలా మంది ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఆన్ లైన్ స్ట్రీమింగ్ యాప్ హాట్ స్టార్ లో చాలా మంది ఐపీఎల్ కోసమే సబ్ స్క్రిప్షన్ కూడా తీసుకున్నారు.

అయితే.. హాట్ స్టార్ మాత్రం వాళ్లను చాలా నిరాశపర్చింది. ఫైనల్ మ్యాచు జరిగేటప్పుడు చాలా సార్లు అంతరాయం కలిగింది. ముఖ్యంగా గుజరాత్ ఇన్నింగ్స్ లో హాట్ స్టార్ లో చాలా సార్లు లైవ్ ఆగిపోయింది. అలా లైవ్ వస్తా.. పోతా ఉండటంతో అభిమానులు చాలా చిరుకుగా గురయ్యారు. ఇంకేముంది హాట్ స్టార్ ని కడిగిపారేశారు. కొంచెమన్న సిగ్గుండాలన్న రీతిలో ప్రశ్నల పరంపరతో హాట్ స్టార్ కి దారుణంగా ట్రోల్ చేశారు.

కోట్లు కోట్లు రూపాయలు యాడ్లు రూపంలో వసూలు చేస్తోన్న హాట్ స్టార్ కొంచెమైనా సిగ్గు ఉండాలని కొందరు కామెంట్లు చేశారు. బీసీసీఐ.. హాట్ స్టార్, స్టార్ స్పోర్ట్స్ కి ఈ సారి ఐపీఎల్ హక్కులు ఇవ్వకుండా వాటిని పీకి పారేయాలని డిమాండ్ చేశారు. ఇంకొందరైతే హాట్ స్టార్ ని మరీ దారుణంగా తిట్టారు. మా దగ్గర సబ్ స్క్రిప్షన్ రూపంలో డబ్బులు దొబ్బావ్.. కానీ.. ఫైనల్ మ్యాచుని చూడకుండా చేశావ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మా డబ్బులు మాకు తిరిగి చెల్లించు అంటూ మరికొందరు డిమాండ్ చేస్తున్నారు.

First published:

Tags: Bcci, Cricket, Gujarat Titans, Hotstar, IPL 2022, Rajasthan Royals, Star sports

ఉత్తమ కథలు