హోమ్ /వార్తలు /క్రీడలు /

Rohit Fan Pitch Invade: గ్రౌండ్‌లోకి దూసుకొచ్చి రోహిత్ శర్మ కాళ్లు మొక్కిన ఫ్యాన్.. బయోబబుల్ బ్రీచ్ అంటూ బీసీసీఐ ఆందోళన

Rohit Fan Pitch Invade: గ్రౌండ్‌లోకి దూసుకొచ్చి రోహిత్ శర్మ కాళ్లు మొక్కిన ఫ్యాన్.. బయోబబుల్ బ్రీచ్ అంటూ బీసీసీఐ ఆందోళన

మైదానంలోకి దూసుకొచ్చిన రోహిత్ శర్మ ఫ్యాన్.. ఆందోళనలో బీసీసీఐ (PC: Twitter Video Grab)

మైదానంలోకి దూసుకొచ్చిన రోహిత్ శర్మ ఫ్యాన్.. ఆందోళనలో బీసీసీఐ (PC: Twitter Video Grab)

Rohit Fan Pitch Invade: రాంచిలో న్యూజీలాండ్‌తో జరిగిన రెండవ టీ20 సందర్భంగా ఒక ఫ్యాన్ మైదానంలోకి దూసుకొని వచ్చాడు. రోహిత్ శర్మ వద్దకు నేరుగా వచ్చి అతడికి పాదాభివందనం చేశాడు.

  ఇండియాలో (India) క్రికెట్‌ను (Cricket) ఒక మతంలా భావిస్తుంటారు. మన దేశంలో క్రికెటర్లకు చాలా మంచి ఫ్యాన్ (Fans) బేస్ ఉన్నది. ఆటపరంగా ఒక్కొక్క క్రికెటర్‌కు డిఫరెంట్ ఫ్యాన్స్ ఉన్నారు. సచిన్‌కు సుధీర్ వంటి ఫ్యాన్ ఉన్నట్లే.. మిగతా ఆటగాళ్లకు కూడా అభిమానులు ఉన్నారు. సాధారణంగా ఇలాంటి అభిమానులు క్రికెట్ జరిగే సమయంలో స్టేడియంలో ఒంటకి రంగులు పూసుకొనో.. జాతీయ జెండాలు పట్టుకొనో మన దేశానికి సపోర్ట్ చేయడం చూస్తుంటాము. కానీ మరో టైపు ఫ్యాన్స్ ఉంటారు. వాళ్ల అభిమాన క్రికెటర్‌పై పిచ్చి ప్రేమ పెంచుకొని ఎలాగైనా వారిని కలవాలని కలలు కంటుంటారు. మనం టీవీల్లో ఎన్నో సార్లు ఇలాంటి ఫ్యాన్స్‌ను చూస్తుంటాము. మ్యాచ్ జరుగుతున్న సమయంలో అకస్మాత్తుగా మైదానంలో ప్రత్యక్షమవుతుంటారు. తమ అభిమాన క్రికెటర్ దగ్గరకు పరుగులు తీసి వారిని కలవాలని భావిస్తుంటారు.

  ప్రస్తుతం న్యూజీలాండ్‌తో (New Zealand) జరుగుతున్న సిరీస్‌లో రెండో మ్యాచ్ సందర్భంగా ఇలాంటి పిచ్ ఇన్వేడింగ్ (Pitch Invading) ఘటన జరిగింది. టీ20 కెప్టెన్ రోహిత్ శర్మకు (Rohit Sharma) వీరాభిమాని అయిన ఒక వ్యక్తి మ్యాచ్ సమయంలో మైదానంలోకి పరుగులు తీశాడు. నేరుగా రోహిత్ శర్మ పీల్డింగ్ చేస్తున్న ప్రదేశానికి వెళ్లి అతడి ముందు మోకరిల్లాడు. పూర్తిగా నేలపై పడుకొని రోహిత్‌కు దండం పెట్టాడు. అతడు రోహిత్ శర్మకు పాదాభివందనం చేయడానికి ప్రయత్నించినా.. నా పాదాలు తాకొద్దు అని రోహిత్ హెచ్చరించడం టీవీల్లో కనిపించింది. దీంతో స్టేడియంలో సెక్యూరిటీ, పోలీసులు అతడిని పట్టుకొని వచ్చేందుకు అక్కడకు వెళ్లారు. పోలీసులను చూసిన సదరు అభిమాని అక్కడి నుంచి తిరిగి గ్యాలరీల వైపు వెనుకకు పరుగెత్తుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత మరి ఆ అభిమానిని పోలీసులు అదుపులోనికి తీసుకొని స్టేడియంలో నుంచి బయటకు పంపించేశారు.

  Ravichandran Ashwin: రీఎంట్రీలో అదరగొడుతున్న రవిచంద్రన్ అశ్విన్.. అతడి విజయానికి కారణం ఏంటి?


   కాగా, ఈ తతంగాన్నంతా ఒక వ్యక్తి తన ఫోన్‌లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీంతో ఒక్కసారిగా వీడియో వైరల్‌గా మారింది. రోహిత్ శర్మకు ఇలాంటి అభిమానులు ఉండటం చాలా గ్రేట్ అంటూ పొగుడుతున్నారు. మరోవైపు అందరికీ ఫ్యాన్స్ ఉంటారు.. కానీ రోహిత్‌కు భక్తులు ఉంటారని సెటైర్లు వేస్తున్నారు. ఇదే మొదటి సారి కాదు. గతంలో కూడా రోహిత్ శర్మ కోసం మైదానంలోకి వచ్చి కాళ్లు మొక్కిన సంఘటనలు కూడా ఉన్నాయి.


  అయితే ఈ విషయాన్న పక్కన పెడితే బీసీసీఐ పిచ్ ఇన్వేడింగ్‌పై ఆందోళన వ్యక్తం చేసింది. కోవిడ్ నేపథ్యంలో ఇండియా, న్యూజీలాండ్ ఆటగాళ్లందరూ బయోబబుల్‌లో ఉన్నారు. మ్యాచ్ ముందు, తర్వాత జరిగే ప్రెస్ మీట్లను కూడా వర్చువల్ విధానంలో నిర్వహిస్తున్నారు. ఇక ప్రేక్షకులను స్టేడియంలోనికి అనుమతించినా.. వాళ్లు బయోబబుల్‌లో ఉన్న వారితో కలవడంపై నిషేధం ఉన్నది. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న సదరు ఫ్యాన్ ఎలా లోపలకు వచ్చాడని బీసీసీఐ ప్రశ్నిస్తున్నది. వెంటనే ఈ ఘటనపై విచారణ చేయాలని జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్‌ను ఆదేశించినట్లు తెలుస్తున్నది.

  Published by:John Kora
  First published:

  Tags: Bcci, Rohit sharma, Team India

  ఉత్తమ కథలు