Home /News /sports /

T20 World Champions: తండ్రి, కొడుకులు ఇద్దరూ ప్రపంచ చాంపియన్లే.. అప్పుడు తండ్రి గెలిపిస్తే.. ఇప్పుడు కొడుకు

T20 World Champions: తండ్రి, కొడుకులు ఇద్దరూ ప్రపంచ చాంపియన్లే.. అప్పుడు తండ్రి గెలిపిస్తే.. ఇప్పుడు కొడుకు

ఆ కుటుంబంలో ముగ్గురూ క్రికెటర్లే.. ఇద్దరు వరల్డ్ చాంపియన్లు

ఆ కుటుంబంలో ముగ్గురూ క్రికెటర్లే.. ఇద్దరు వరల్డ్ చాంపియన్లు

T20 World Champions: ఆస్ట్రేలియా టీమ్ టీ20 వరల్డ్ కప్ చాంపియన్‌గా నిలవడంలో మిచ్ మార్ష్ కీలక పాత్ర పోషించాడు. అయితే ఒకప్పుడు మార్ష్ తండ్రి జెఫ్ మార్ష్ కూడా ఆస్ట్రేలియాను వరల్డ్ చాంపియన్‌గా నిలబెట్టిన సంగతి తెలుసా?

    పురుషుల టీ20 వరల్డ్ కప్‌ (T20 World Cup) ప్రారంభమైన 14 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు (Australian Cricket Team ) చాంపియన్‌గా (Champion) నిలిచింది. వన్డే వరల్డ్ కప్‌ను 5 సార్లు గెలిచిన ఆస్ట్రేలియాకు సుదీర్ఘ విరామం తర్వాత పొట్టి ప్రపంచ కప్ దక్కింది. ఆదివారం దుబాయ్‌లో న్యూజీలాండ్‌తో జరిగిన ఫైనల్‌లో ఆస్ట్రేలియా జట్టు 8 వికెట్ల తేడాతో గెలిచి ప్రపంచ చాంపియన్లుగా నిలిచారు. 173 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో మిచెల్ మార్ష్ (Mitchell Marsh) కీలక పాత్ర పోషించాడు. కేవలం 50 బంతుల్లోనే 77 పరుగులు చేయడంతో మరో 7 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో మిచ్ మార్ష్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. ఈ టోర్నమెంట్ ఆసాంతం మిచ్ మార్ష్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. కీలకమైన ఇన్నింగ్స్ ఆడుతూ మ్యాచ్‌లు గెలిపించాడు. మిచ్ మార్ష్ కూడా ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌కు అర్హుడే అని క్రికెట్ విశ్లేషకులు కూడా అభిప్రాయపడ్డారు.

    కాగా, మిచెల్ మార్ష్ లాగే అతడి తండ్రి ఆస్ట్రేలియా విశ్వవిజేత కావడంలో కీలక పాత్ర పోషించాడని మీకు తెలుసా? 34 ఏళ్ల క్రితం మిచెల్ తండ్రి జెఫ్ మార్ష్ కూడా ఆస్ట్రేలియా తొలి సారి వన్డే వరల్డ్ కప్ గెలవడంతో కీలకపాత్ర పోషించాడు. 1987లో జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో మొత్తం 428 పరుగులు చేసి సత్తా చాటాడు. ఇందులో 2 సెంచరీలు కూడా ఉన్నాయి. ఇక 1999లో ఆస్ట్రేలియా మరోసారి వన్డే వరల్డ్ కప్ గెలిచింది. ఆ సమయంలో జెఫ్ మార్ష్ ఆస్ట్రేలియా జట్టుకు హెడ్ కోచ్‌గా ఉన్నాడు. అంతే తండ్రి కొడుకులు కలసి మూడు సార్లు ఆస్ట్రేలియాకు వరల్డ్ కప్ అందించారు. మిచ్ మార్ష్ అయితే గత 6 పర్యాయాలుగా ఆసీస్‌కు అందని ద్రాక్షగా ఉన్న టీ20 వరల్డ్ కప్ అందించాడు.

    T20 World Champions: బూట్లలో బీర్లు, షాంపేన్ జోరు.. సంగీతం హోరు.. డ్యాన్సులు.. రాత్రంతా ఆస్ట్రేలియన్ల హంగామా












    View this post on Instagram






    A post shared by Mitch Marsh (@mitchmarsh235)













    View this post on Instagram






    A post shared by Mitch Marsh (@mitchmarsh235)













    View this post on Instagram






    A post shared by Mitch Marsh (@mitchmarsh235)








    ఇక వీరి ఇంటిలో మరో క్రికెట్ కూడా ఉన్నాడు. అతడే షాన్ మార్ష్. మిచ్ మార్ష్ సోదరుడైన షాన్ మార్ష్ కూడా ఆస్ట్రేలియా తరపున అనేక చిరస్మరణీయమైన మ్యాచ్‌లు ఆడాడు. ఐపీఎల్‌లో కూడా మార్ష్ రాణించిన విషయం తెలిసిందే. ఇలా ఒకే ఇంటిలో ముగ్గురు క్రికెటర్లు ఆస్ట్రేలియా తరపున ఆడి.. అరుదైన విజయాలు అందించడం విశేషం.
    Published by:John Naveen Kora
    First published:

    Tags: T20 World Cup 2021

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు