AIDS Injection : ఎయిడ్స్ ఇంజెక్షన్‌ మెసేజ్ నమ్మొద్దు... విజయవాడ పోలీసుల ప్రకటన...

Fake News : ఎయిడ్స్ ఇంజెక్షన్‌‌పై సోషల్ మీడియాలో ఇప్పుడో ఫేక్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. దాన్ని నమ్మవద్దని విజయవాడ పోలీసులు స్పష్టత ఇచ్చారు.

Krishna Kumar N | news18-telugu
Updated: July 10, 2019, 2:20 PM IST
AIDS Injection : ఎయిడ్స్ ఇంజెక్షన్‌ మెసేజ్ నమ్మొద్దు... విజయవాడ పోలీసుల ప్రకటన...
ఇది ఫేక్ న్యూస్ అని తేల్చిన పోలీసులు (Image : Twitter)
Krishna Kumar N | news18-telugu
Updated: July 10, 2019, 2:20 PM IST
ఇది చాలా చిత్రమైన ఫేక్ న్యూస్. జనరల్‌గా ఏదైనా పుకారు వచ్చినప్పుడు... అది నమ్మవద్దంటూ పోలీసులు ప్రకటన ఇస్తారు. ఐతే... అలా పోలీసులు ఇచ్చినట్లుగా ఉన్న ప్రకటనే ఫేక్ అని పోలీసులు తేల్చడం ట్విస్ట్. విషయమేంటంటే... "ఎవరైనా ఇంటికి వచ్చి, ప్రభుత్వ హాస్పిటల్ నుంచీ వచ్చాం... ఎయిడ్స్ రాకుండా ఇంజెక్షన్ వేస్తున్నాం అని చెబితే... తొందరపడి ఇంజెక్షన్ వేయించుకోవద్దు" అని విజయవాడ పోలీసులు హెచ్చరిస్తున్నట్లుగా ఓ మెసేజ్... సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిజానికి అది పోలీసులు జారీచేసిన మేసేజ్ కాదు. అందువల్ల ఆ మెసేజ్‌ని నమ్మవద్దని పోలీసులే స్వయంగా ప్రకటన విడుదల చేయాల్సి వచ్చింది. ఇలాంటివి నమ్మవద్దని విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమల రావు తెలిపారు.

ఇది ఫేక్ న్యూస్ అని తేల్చిన పోలీసులు (Image : Twitter)


పోలీసులు హెచ్చరించినట్లు ఉన్న ఈ ఫేక్ న్యూస్ ఫేస్ బుక్, ట్విట్టర్‌లో షేర్ అవుతోంది. విజయవాడ సిటీ పోలీసులే ఈ ప్రకటన జారీ చేసినట్లు ఉండటంతో... నిజమే అనుకుంటున్న నెటిజన్లు ఈ పోస్టును స్నేహితులకూ, తెలిసినవారికీ షేర్ చేస్తున్నారు. ట్విట్టర్‌లో కూడా రీ-ట్వీట్లు మొదలయ్యాయి.

ఇది ఎవరు క్రియేట్ చేశారో తెలుసుకుంటామంటున్న పోలీసులు... తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలు మాత్రం ఈ ప్రకటనను నమ్మవద్దని కోరారు.

First published: July 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...