హోమ్ /వార్తలు /క్రీడలు /

Fact Check: ప్రమాదంలో సనత్ జయసూర్య చనిపోయాడని ఫేక్ న్యూస్

Fact Check: ప్రమాదంలో సనత్ జయసూర్య చనిపోయాడని ఫేక్ న్యూస్

Fact Check: ప్రమాదంలో సనత్ జయసూర్య చనిపోయాడని ఫేక్ న్యూస్
(File: Getty)

Fact Check: ప్రమాదంలో సనత్ జయసూర్య చనిపోయాడని ఫేక్ న్యూస్ (File: Getty)

Fact Check | సనత్ జయసూర్య కెనెడాకు వెళ్లగా, అక్కడ హోండా సివిక్ కార్ ఢీకొట్టడంతో తీవ్రగాయాలపాలై ఆస్పత్రిలో చనిపోయాడన్నది ఆ వార్త సారాంశం. అంతేకాదు శ్రీలంక ఎంబసీ కూడా ధృవీకరించిందని ఆ వార్తలో ఉంది.

ఫేక్ న్యూస్... బతికున్నవాళ్లను కూడా చంపేస్తుంది. కలకలం సృష్టిస్తుంది. శ్రీలంకకు చెందిన మాజీ క్రికెటర్ సనత్ జయసూర్య విషయంలోనూ ఇదే జరిగింది. కెనెడాలో శ్రీలంక మాజీ క్రికెటర్ సనత్ జయసూర్య రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడంటూ ఓ వార్త కలకలం రేపింది. ఇటీవల సనత్ జయసూర్య కెనెడాకు వెళ్లగా, అక్కడ హోండా సివిక్ కార్ ఢీకొట్టడంతో తీవ్రగాయాలపాలై ఆస్పత్రిలో చనిపోయాడన్నది ఆ వార్త సారాంశం. అంతేకాదు శ్రీలంక ఎంబసీ కూడా ధృవీకరించిందని ఆ వార్తలో ఉంది. ఈ ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫేక్ న్యూస్ ఇండియన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు షాకిచ్చింది. ఈ వార్త నిజమేనా అంటూ అశ్విన్ ట్విట్టర్‌లో ప్రశ్నించాడు. అది ఫేక్ న్యూస్ అంటూ నెటిజన్లు చెప్పడంతో హమ్మయ్య అనుకున్నాడు.

రవిచంద్రన్ అశ్విన్‌ మాత్రమే కాదు బాలీవుడ్ సెలబ్రిటీ అర్షద్ వార్సీ కూడా ఇలాగే షాకయ్యాడు. నెటిజన్లు ఫేక్ న్యూస్ అని బదులిచ్చారు.

తను రోడ్డు ప్రమాదంలో చనిపోయాడన్న వార్తల్ని సనత్ జయసూర్య ఖండించాడు. తాను కెనెడా వెళ్లలేదని, శ్రీలంకలోనే క్షేమంగా ఉన్నానని, ఫేక్ న్యూస్ షేర్ చేయొద్దని సనత్ జయసూర్య వేడుకున్నాడు.

చూశారుగా ఫేక్ న్యూస్ ఎలా కలకలం రేపుతుందో. అందుకే మీ వాట్సప్, ఫేస్‌బుక్‌లో వచ్చేవన్నీ నిజమైనవేనని నమ్మకుండా, క్రాస్ చెక్ చేసుకోవడం మంచిది.

Hyundai Venue: స్మార్ట్ ఫీచర్లతో హుందాయ్ వెన్యూ... కారు ఎలా ఉందో చూడండి

ఇవి కూడా చదవండి:

Redmi 7A: షావోమీ నుంచి లో-బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ 7ఏ

Black Shark 2: గేమింగ్ లవర్స్‌ కోసం స్పెషల్ ఫోన్ బ్లాక్ షార్క్ 2

Tata Sky: టాటా స్కై సెట్ టాప్ బాక్స్ ధరలు తగ్గాయి... కొత్త రేట్లు ఇవే

First published:

Tags: Fact Check, Fake news, VIRAL NEWS

ఉత్తమ కథలు