హోమ్ /వార్తలు /క్రీడలు /

Target Olympics: అమెరికాలో టీ20 వరల్డ్ కప్ నిర్వహించడం వెనుక ఐసీసీ పెద్ద ప్లాన్.. ఒలింపిక్స్ చోటు కోసమేనా?

Target Olympics: అమెరికాలో టీ20 వరల్డ్ కప్ నిర్వహించడం వెనుక ఐసీసీ పెద్ద ప్లాన్.. ఒలింపిక్స్ చోటు కోసమేనా?

అమెరికాలో టీ20 వరల్డ్ కప్ నిర్వహణ వెనుక ఐసీసీ భారీ వ్యూహం

అమెరికాలో టీ20 వరల్డ్ కప్ నిర్వహణ వెనుక ఐసీసీ భారీ వ్యూహం

Target Olympics: ఐసీసీలో అసోసియేట్ దేశమైన అమెరికాకు వరల్డ్ కప్ నిర్వహించే ఆతిథ్యపు హక్కులు కట్టిబెట్టడం వెనుక పెద్ద ప్లానే ఉన్నట్లు తెలుస్తున్నది. 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చడానికి తగిన మద్దతు కూడగట్టడానికే ఐసీసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది.

ఇంకా చదవండి ...

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) (ICC) 2024 నుంచి 2031 వరకు గల 8 ఏళ్ల కాలానికి పురుషుల క్రికెట్‌కు సంబంధించిన మెగా ఈవెంట్ల షెడ్యూల్ (Events Schedule) విడుదల చేసింది. చాంపియన్స్ ట్రోఫీని (Champions trophy) తిరిగి పునరుద్దరించగా.. ఇండియాలో 3 ఈవెంట్లకు ఐసీీసీ అవకాశం ఇచ్చింది. ఇక తొలి సారి నమీబియా వరల్డ్ కప్‌కు (World cup) ఆతిథ్యం ఇవ్వనున్నది. ఇవన్నీ పక్కన పెడితే అందరి దృష్టిని ఆకర్షించిన విషయం అమెరికాలో టీ20 వరల్డ్ కప్ 2024ని (T20 World Cup) నిర్వహించడం. ఐసీసీ అసోసియేట్ దేశాల్లో ఒకటైన అమెరికాలో ఇప్పటికీ సరైన జట్టు లేదు. యూఎస్ఏ జట్టు క్వాలిఫయర్ మ్యాచులు ఆడుతున్నా.. ఏనాడూ పెద్ద ఈవెంట్లలో పాల్గొనలేదు. కనీసం నమీబియా, పపువా న్యూగినియా లాగ ఏనాడూ వార్తల్లో కూడా లేదు. అలాంటి దేశానికి వరల్డ్ కప్ వంటి మెగా ఈవెంట్‌ను నిర్వహించే చాన్స్ ఎలా ఇచ్చారని అందరూ ఆశ్చర్యపోతున్నారు.

అయితే ఐసీసీ వ్యూహం వెనుక భారీ స్కెచ్చే ఉన్నది. ముందుగా అమెరికాలో క్రికెట్‌ను విస్తరించాల్సిన అవసరం ఉన్నది. అక్కడ క్రికెట్‌కు పెద్దగా ఆదరణ లేదు. అయితే టీ20 ఫార్మాట్ వచ్చిన తర్వాత క్రికెట్‌ మరింత విస్తృతంగా ఆదరణ పొందుతున్నది. అమెరికా చాలా పెద్ద మార్కెట్. అక్కడ కనుక క్రికెట్‌కు ఆదరణ పెరిగితే తప్పకుండా మున్ముందు ఐసీసీకి చాలా లాభం కలిగిస్తుంది. ఇక మరొక విషయం ఒలింపిక్స్. ఎప్పటి నుంచో క్రికెట్‌ను ఒలింపిక్స్‌లో చేర్చాలని డిమాండ్లు వస్తున్నాయి.

Ind Vs Nz : జట్టులో విరాట్ కోహ్లీ పాత్రపై రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు.. అందరి దృష్టి ఆ ఇద్దరిపైనే..!1900 పారీస్ ఒలింపిక్స్‌లో ఒకే ఒకసారి క్రికెట్‌ను మెడల్ ఈవెంట్‌గా చేర్చారు. ఆ తర్వాత ఇంత వరకు క్రికెట్ ఊసే లేదు. ప్రపంచంలో ఫుట్‌బాల్ తర్వాత ఎంతో ఆదరణ ఉన్న టీమ్ స్పోర్ట్ అయిన క్రికెట్ ఒలింపిక్స్‌లో లేకపోవడం పెద్ద లోటుగా ఉన్నది. అయితే గత రెండు మూడేళ్లుగా క్రికెట్‌ను ఒలింపిక్స్‌లో చేర్చే విషయమై ఐసీసీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. బీసీసీఐతో కలసి ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీకి ఈ మేరకుపలు విజ్ఞప్తులు చేసింది. పారీస్ ఒలింపిక్స్2024కు సంబంధించిన క్రీడా ఈవెంట్ల బిడ్లు ముగిశాయి. ఇక త్వరలో 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌కు సంబంధించి ఆయా క్రీడా సంఘాల నుంచి బిడ్లు వేసే అవకాశం ఉన్నది.

David Warner: 'జట్టు కోసం ఎంతో చేశా... ఎంతో కష్టపడ్డా.. చివరకు ఇలా చేస్తారా? ఏదేమైనా నాకు తోడుంది వాళ్లే'.. నోరు విప్పిన వార్నర్అమెరికాలో జరుగనున్న ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చడానికి తగిన మద్దతు కూడగట్టడానికే ఐసీసీ ఈ వ్యూహం రచించినట్లు తెలుస్తున్నది. అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా టీ20 వరల్డ్ కప్ 2024ను నిర్వహించడం ద్వారా పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుందని ఐసీసీ ఆశిస్తున్నది. అందుకే అసోసియేష్ దేశమైనా దానికి మెగా ఈవెంట్ ఆతిథ్యపు హక్కులు కట్టబెట్టింది. ఐసీసీ వ్యూహం కనుక ఫలిస్తే 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను మెడల్ ఈవెంట్‌గా చూడటం ఖాయమని క్రికెట్ ప్రేమికులు సంతోషపడుతున్నారు.

First published:

Tags: Cricket, ICC, Olympics, T20 World Cup 2021

ఉత్తమ కథలు