హోమ్ /వార్తలు /క్రీడలు /

Explained - Ind Vs Nz: హార్దిక్ పాండ్యా కోసం టీమిండియా ఎందుకింత రిస్క్ తీసుకుంటోంది? రెండో మ్యాచ్‌లో అతడిని ఆడిస్తారా?

Explained - Ind Vs Nz: హార్దిక్ పాండ్యా కోసం టీమిండియా ఎందుకింత రిస్క్ తీసుకుంటోంది? రెండో మ్యాచ్‌లో అతడిని ఆడిస్తారా?

Hardik Pandya

Hardik Pandya

Explained - Ind Vs Nz: భుజం గాయం తర్వాత హార్ధిక్‌ ఇప్పుడు ఫిట్‌గానే ఉన్నాడు. మరి తప్పనిసరిగా గెలవాల్సిన న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో అతనికి స్థానం దక్కుతుంగా అన్నది వేచి చూడాలి.

టీ20 వరల్డ్‌కప్ 2021 (T20 World Cup 2021) మ్యాచ్‌లు రసవత్తరంగా జరుగుతున్నాయి. అన్ని జట్లు గెలుపు కోసం వ్యూహాలు రచిస్తూ ముందుకెళ్తున్నాయి. పాకిస్థాన్‌ చేతిలో ఓటమి తర్వాత న్యూజిలాండ్‌తో ఆదివారం జరిగే మ్యాచ్‌ కోసం భారత్‌ (India Vs New Zealand) సిద్ధమవుతోంది. ఆ టీమ్‌తోనూ ఓటమి ఎదురైతే టోర్నమెంట్‌ ఆశలపై నీలి మేఘాలు కమ్ముకున్నట్లే అవుతుంది. దీంతో పాకిస్థాన్‌పై ఓటమి తర్వాత పదకొండు మంది సభ్యుల్లో హార్థిక్ పాండ్య (Hardik Pandya) స్థానంపై మరోసారి చర్చ మొదలైంది. ఈ మధ్య కాలంలో అతడు బౌలింగ్‌ చేయడం దాదాపు మానేశాడు. టీ20 క్రికెట్‌కు అవసరమైన విలువైన నైపుణ్యంతో మంచి హిట్టర్‌గా నిలుస్తున్నాడు. మరి ఆ కారణంగానే జట్టులో స్థానం సంపాదిస్తాడా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న.

తొలి మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తూ గాయపడ్డ తరువాత పాండ్య ఫీల్డింగ్‌కు రాలేదు. దీంతో కొంత మంది బాహాటంగానే జట్టులో పాండ్య స్థానంపై మాట్లాడుతున్నారు. భుజం గాయం తర్వాత హార్ధిక్‌ ఇప్పుడు ఫిట్‌గానే ఉన్నాడు. మరి తప్పనిసరిగా గెలవాల్సిన న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో అతనికి స్థానం దక్కుతుంగా అన్నది వేచి చూడాలి.

టాప్‌ సిక్స్‌లో బ్యాటింగ్‌ చేసి, కొన్ని ఓవర్లు బౌల్‌ చేయగలిగే వాళ్లతో టీమ్‌ సమతూకంగా ఉంటుంది. సీమ్‌ బౌలింగ్‌ ఆల్‌ రౌండర్‌గా హార్థిక్‌ పాండ్య నిలుస్తున్నాడు. ప్రపంచ క్రికెట్‌లో సిక్స్‌ కొట్టడంలో మంచి హిట్టరే అని చెప్పాలి. హార్ధిక్‌ బౌలింగ్‌ చేస్తున్నప్పుడు ముఖ్యంగా సీమర్‌-ప్రెండ్లీ కండిషన్స్‌లో చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటూ మరో ఎక్స్‌ట్రా ఆప్షన్‌గా కనిపించేవాడు. అతను బౌలింగ్‌లో లేకపోతే కెప్టెన్‌కు కొంత కొరతే ఉండేది.

* హార్ధిక్‌ ఎందుకు బౌలింగ్‌ చేయడం లేదు

చాలా కాలంగా ఉన్న బ్యాక్‌ పెయిన్‌ సమస్య అతని బౌలింగ్‌ సామర్ధ్యాన్ని తగ్గించింది. ఈ సమస్య కోసం 2019లో అతను సర్జరీ కూడా చేయించుకున్నాడు. తాజా ఐపీఎల్‌లో చాలా అరుదుగా బౌలింగ్ చేశాడు. శ్రీలంకతో జూలైలో జరిగిన లిమిటెడ్‌ ఓవర్స్‌ టూర్‌లో బౌలింగ్‌ చేసినా అటు ఇండియాలోనూ, యూఎఈలోనూ 2021 ఐపీఎల్‌లోనూ బాల్‌ ముట్టలేదు.

* మరి హార్ధిక్‌ను ఎంపిక చేయడం ఎందుకు?

అద్భుతమైన బ్యాటింగ్‌ సామర్ధ్యం ఈ హిట్టర్ సొంతం. వైట్‌-బాల్‌ క్రికెట్‌లో కొన్ని బాల్స్‌ ఆడి, ఆట తీరును పూర్తిగా మార్చేయగల సత్తా హార్థిక్‌కు ఉంది. అతి తక్కువ కదలికలతో కూడిన ప్రత్యేకమైన బ్యాటింగ్‌ శైలితో అతను ఫాస్ట్‌ బౌలర్లతో పాటు స్పిన్నర్ల వెన్ను విరుస్తాడు. బ్యాటింగ్‌ నైపుణ్యంతోనే అతను ఇండియాను, ముంబై ఇండియన్స్‌కు అనేక మ్యాచుల్లో విజయాన్ని అందించాడు.

అయితే ఎక్స్‌ట్రా సీమ్‌ బౌలింగ్‌ ఆప్షన్‌గా టీ20 వల్డ్‌ కప్‌ టీమ్‌లో సెలక్టర్లు శార్దూల్‌ ఠాకూర్‌కు తీసుకున్నారు. టెస్టు మ్యాచుల్లో అతను ఇండియాకు లభించిన ఒక మంచి బ్యాటర్. శార్దూల్ శైలి ఎటువంటి భయం లేకుండా, దూకుడుతో కూడి ఉంటుంది. లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌ను ముందు టీమ్‌లోకి ఎంపిక చేసినా, హార్ధిక్‌ బౌలింగ్‌ చేయగలడని గుర్తించిన తర్వాత అక్షర్‌ను తప్పించి శార్దూల్‌కు అవకాశం కల్పించారు. దీంతో బౌలింగ్‌ చేయనప్పుడు హార్థిక్‌ను పూర్తిగా టీమ్‌ నుంచి తప్పించి ఉండాల్సిందని కొంత మంది మాజీ సెలక్టర్లు అభిప్రాయపడుతున్నారు.

* టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఆలోచనేంటి?

పాకిస్థాన్‌తో ఓపెనింగ్‌ మ్యాచ్‌లో స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్‌గా హార్థిక్‌ ఆడాడు. హార్థిక్‌ బౌలింగ్‌ చేయకపోయినా బ్యాట్‌ ద్వారా తగిన విలువ అందిస్తాడన్నది కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అభిప్రాయం. హార్థిక్‌ బౌలింగ్‌ చేసేంత వరకు లభించిన అవకాశాలతో మనం ప్రయత్నాలు చేస్తూ ఉంటే మంచిది. నెంబర్‌ 6 స్పాట్‌లో అతను వచ్చి సృష్టించేది రాత్రికి రాత్రి సాధ్యమయ్యేది కాదని పాకిస్థాన్‌తో మ్యాచ్‌ సందర్భంగా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి స్పష్టం చేశాడు.

* మరి ఇప్పుడు పరిస్థితిలో మార్పు వచ్చిందా?

పాకిస్థాన్‌తో ఓటమి తర్వాత ఆదివారం జరగనున్న న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌.. భారత్‌కు చావో రేవో కాబోతోంది. ఒకవేళ ఈ మ్యాచ్‌ ఓడిపోతే టోర్నమెంట్‌ ఆశలు సజీవంగా ఉండటం కష్టమే. సరైన ఆరో బౌలర్‌ లేకపోవడం కోహ్లిని కట్టిపడేసింది. దీంతో పాక్‌ ఆటగాళ్లు బాబర్‌ ఆజమ్‌, మహమ్మద్‌ రిజ్వాన్‌ ఆటను తమ వైపు తిప్పుకున్నారు. కాబట్టి ఇప్పుడు కివిస్‌తో మ్యాచ్‌ సందర్భంగా టీమ్‌ కూర్పుపై తీవ్ర చర్చ జరుగుతోంది. హార్థిక్‌ కంటే మంచి ఆల్‌-రౌండర్‌ ఆప్షన్‌ శార్దూల్‌ ఠాకూర్‌ అనే భావన కొంత మంది క్రికెట్‌ విశ్లేషకుల్లో ఉన్నది. అతని రాకతో కెప్టెన్‌ కోహ్లికి కొంత వెసులుబాటు లభిస్తుందని అంటున్నారు.

* ప్రత్యర్థి టీమ్‌ కూర్పు ఎలా ఉండనుంది?

ప్రస్తుతం జరుగుతున్న టీ20 వల్డ్‌ కప్‌ మ్యాచుల్లో బ్యాటింగ్‌, బౌలింగ్‌ రెండు చేయగల సామర్థ్యం కలిగిన సభ్యులతో కూడిన టీమ్స్‌ విజయాన్ని చవిచూస్తున్నాయి. ఆస్ట్రేలియా టీమ్‌లో మార్కస్‌ స్టోయినిస్‌, మిషెల్‌ మార్ష్‌, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ ఉన్నారు. ఇంగ్లాండ్‌ జట్టులో మొయిన్‌ అలీ ఉండగా పాకిస్థాన్‌కు మహమ్మద్‌ హఫీజ్‌ ఉన్నాడు. స్పెషలిస్టు బ్యాటర్లు, బౌలర్లతో పాటు వీళ్లు ఆటను అటు ఇటూ చేయడానికి కీలక లింక్‌గా నిలవగలరు.

First published:

Tags: Cricket, Hardik Pandya, Ind vs Nz, India vs newzealand, T20 World Cup 2021, Team India

ఉత్తమ కథలు