Explained: Ind Vs Eng : ఐదుగురు స్పెషలిస్ట్ బ్యాట్స్ మెన్ వ్యూహం.. కోహ్లీసేనకు కలిసొస్తుందా?

Team India

Explained: Ind Vs Eng : సమకాలీన క్రికెట్‌లో అత్యుత్తమ స్పిన్నర్‌గా పరిగణించే రవిచంద్రన్ అశ్విన్‌ (Ravichandran Ashwin) కు కూడా జట్టులో చోటు దక్కలేదు. అడపాదడపా పరుగులు చేసే సామర్థ్యం ఉన్న అశ్విన్‌ కంటే.. ఆల్‌రౌండర్ అయిన జడేజా బెస్ట్ ఆప్షన్ అని టీం మేనేజ్‌మెంట్, కెప్లెన్ కోహ్లీ భావించారు.

  • Share this:
మొదటి నుంచి టీమిండియా (Team India)లో బ్యాట్స్‌మెన్‌కు కొరత అనేది లేదు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా దృఢ నిశ్చయంతో ఆడే ఆటగాళ్లు కోహ్లీసేన సొంతం. అయితే ప్రస్తుతం జరుగుతోన్న ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌లో కోహ్లీ (Virat Kohli Batting)తో సహా పలువురు బ్యాట్స్‌మెన్ రాణించలేకపోతున్నారు. ముఖ్యంగా జట్టు మిడిలార్డర్, ఏడో స్థానంలో బ్యాట్స్‌మెన్ కొరతను ఎదుర్కొంటోంది. లార్డ్స్‌లో జరిగిన రెండో టెస్టులోనూ మహ్మద్ షమీ (Mohammed Shami), జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) అద్భుతమైన పర్ఫార్మెన్స్‌తో భారత్ చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. అయితే ఈ సిరీస్‌లో మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ విఫలమవుతున్న కారణంగా ఈ అంశంపై దృష్టి పెట్టాల్సి ఉంది. మరోవైపు విరాట్ ఐదుగురు స్పెషలిస్ట్ బౌలర్లను తుది జట్టులోకి తీసుకునే వ్యూహాన్ని గట్టిగా నమ్ముతున్నాడు.

* అసలు సమస్య ఏంటి..
మొదటి మూడు టెస్టుల్లో రవీంద్ర జడేజా (Ravindra Jadeja)ను తీసుకున్నారు. అయితే ఈ ఎడం చేతివాటం బ్యాట్స్‌మన్ బ్యాటింగ్ ఆల్ రౌండర్‌గా జట్టులోకి వచ్చాడు. ఫలితంగా సమకాలీన క్రికెట్‌లో అత్యుత్తమ స్పిన్నర్‌గా పరిగణించే రవిచంద్రన్ అశ్విన్‌ (Ravichandran Ashwin) కు కూడా జట్టులో చోటు దక్కలేదు. అడపాదడపా పరుగులు చేసే సామర్థ్యం ఉన్న అశ్విన్‌ కంటే.. ఆల్‌రౌండర్ అయిన జడేజా బెస్ట్ ఆప్షన్ అని టీం మేనేజ్‌మెంట్, కెప్లెన్ కోహ్లీ భావించారు. ట్రెంట్ బిడ్జ్, లార్డ్స్, హెడింగ్లీలో సీమర్లకు అనుకూలమైన వాతావరణం కారణంగా యాజమాన్యం నలుగురు పేసర్లతో ఆడటానికే టీమిండియా మొగ్గు చూపింది.

మొదటి టెస్టు ఆడిన శార్దుల్ బ్యాట్ తోనూ మెప్పించగలడు. శార్దుల్ వల్ల లోయర్, మిడిలార్డర్ బలంగా మారుతుంది. 8,9,10,11 స్థానాల్లో షమీ, ఇషాంత్, బుమ్రా, సిరాజ్ ఆడుతున్నారు. లార్డ్స్ రెండో ఇన్నింగ్స్ మినహా వీరి నుంచి అధికంగా పరుగులు ఆశించలేం. ఇలాంటి పరిస్థితుల్లో వెంట వెంటనే వికెట్లు పడే అవకాశం ఉంది. అందువల్ల మిడిల్ ఆర్డర్‌లో మంచి భాగస్వామ్యాల అవసరముంది.

* ఎవరెవరు ఎలా ఆడుతున్నారు?
జడేజా కాకుండా గత రెండు టెస్టుల్లో స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ చెప్పుకోదగ్గట్లు బౌలింగ్ చేయలేదు, స్పెషలిస్ట్ బౌలర్లు సైతం మెప్పించే బ్యాటింగ్ ఆడలేదు. రాహుల్, చతేశ్వర్ పుజారా, విరాట్, అజింక్య రహానే నుంచి ఎక్కువ ఓవర్ల బౌలింగ్ ఆశించలేం. ప్రధాన బౌలర్లు అందుబాటులో లేనప్పుడు వికెట్లు తీయడం కీలకం.

ఇటీవల కాలంలో బ్యాటింగ్ ప్రదర్శన ఆధారంగా అశ్విన్ స్థానంలో జడేజాను తీసుకున్నారు. టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో ఇద్దరు స్పిన్నర్ల వ్యూహం దెబ్బతినడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉమేష్, ఇషాంత్ కాకుండా మరో బౌలర్ శార్దుల్‌తో ప్రయోజనం ఉండవచ్చు. ఎందుకంటే బ్యాటింగ్ ఆడగల సత్తా ఉన్న ఇతడు లోయర్ ఆర్డర్‌లో ఉపయోగకరంగా ఉంటాడు

* ఈ సమస్య భారత బ్యాటింగ్ ప్రభావితం చేస్తుందా?
తుదిజట్టులోకి తీసుకున్న బ్యాట్స్ మెన్ పరుగులు తీస్తుంటే ఐదుగురు స్పెషలిస్టు బౌలర్ల వ్యూహం బాగానే ఫలిస్తుంది. అయితే ఇది భారత్‌కు పెద్దగా కలిసి రాదు. 3, 4, 5 స్థానాల్లో ఆటగాళ్లు తడబడుతున్నారు. ముఖ్యంగా మిడిలార్డర్ పుంజుకోవాలి. కోహ్లీ నుంచి తన స్థాయి ఇన్నింగ్స్‌ను అభిమానులు ఆశిస్తున్నారు.

పుజారా పుంజుకున్నప్పటికీ, అజింక్య రహానే ఫామ్ లేమి ఆందోళన కలిగిస్తుంది. ఆరో స్థానంలో రిషభ్ పంత్ అయోమయానికి లోనవుతున్నట్లు కనిపిస్తోంది. ఓపెనింగ్ విషయానికొస్తే రోహిత్, రాహుల్ తొలి టెస్టులో మంచి ఆరంభాన్ని అందించాడు. హెడింగ్లీలో ఇద్దరూ విఫలమయ్యారు. దీంతో మిడిలార్డర్‌పై ఒత్తిడి పెరిగింది. ఫలితంగా ఇన్నింగ్స్ తేడాతో భారత్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.

ఇది కూడా చదవండి : వైడ్ ఇవ్వని అంపైర్... కోపంలో పొలార్డ్‌ ఏం చేశాడో చూడండి..

* ఇంగ్లాండ్ పరిస్థితి ఏంటి?
ఇంగ్లాండ్ బ్యాటింగ్ దగ్గరకొస్తే వికెట్ కీపర్‌తో కలిపి మొదటి ఆరుగురు ఆటగాళ్లు తొలి రెండు టెస్టుల్లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. కెప్టెన్ జో రూటే బ్యాటింగ్ భారాన్నంతా మోశాడు. బౌలింగ్ విభాగంలో ఇంగ్లాండ్ కూడా ఐదుగురు స్పెషలిస్ట్ బౌలర్లతోనే బరిలోకి దిగింది. అయితే భారత్‌తో పోలిస్తే వీరి లోయర్ ఆర్డర్ కొంచెం మెరుగ్గా ఉంది. బ్యాటింగ్‌లోనూ ఈ విభాగం రాణిస్తోంది.

మొయిన్ ఆలీ, సామ్ కరన్, ఒల్లీ రాబిన్సన్, క్రెయిక్ ఓవర్టన్ లాంటి వారు ఒత్తిడిలోనూ కొన్ని అదనపు పరుగులు చేస్తున్నారు. ఈ రోజుల్లో చాలా జట్లు లోయర్ ఆర్డర్ నుంచి పరుగులు పొందడానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నాయి. ఆస్ట్రేలియా, కివీస్, దక్షిణాఫ్రికా లాంటి జట్లు చాలా ఏళ్లుగా ఈ వ్యూహాన్ని అవలంబిస్తున్నాయి. గతంలో భారత మిడిలార్డర్ సైతం చెప్పుకోదగ్గ విజయాలను అందించింది. అయితే తాజా సిరీస్‌లో మాత్రం ఒత్తిడిని ఎదుర్కొంటోంది.

ఇది కూడా చదవండి :  వలలో చిక్కుకున్న ఆ 157 చేపలతో కోటీశ్వరుడు అయ్యాడు.. ఒక్కో చేప ఖరీదు ఎంతంటే..!

ఓవల్ వేదికంగా ఇంగ్లాండ్‌తో భారత్ నాలుగో టెస్టు గురువారం నుంచి ప్రారంభం కానుంది. సాధారణంగా ఈ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ 2018లో చివరిగా జరిగిన మ్యాచ్‌లో నాలుగు సెంచరీలు నమోదయ్యాయి. ప్రస్తుతం సిరీస్ 1-1తో సమానంగా ఉంది. దీంతో ఇరు జట్లు నాలుగో టెస్టులో పైచేయి సాధించాలని ఆరాటపడుతున్నాయి. లార్డ్స్‌లో అద్భుతమైన విజయం సాధించిన కోహ్లీసేన.. మూడో టెస్టులో ఘోర పరాజయాన్ని చూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జట్టు కూర్పు ఎలా ఉంటుందోనని అభిమానులు వేచి చూస్తున్నారు.
Published by:Sridhar Reddy
First published: