హోమ్ /వార్తలు /క్రీడలు /

Ben Stokes: స్టోక్స్‌ను అప్పుడే ఔటై ఉంటే ఫలితం మరోలా ఉండేదేమో!

Ben Stokes: స్టోక్స్‌ను అప్పుడే ఔటై ఉంటే ఫలితం మరోలా ఉండేదేమో!

Ben Stokes

Ben Stokes

నెటిజన్లు,మాజీ క్రికెటర్లు ఘాటుగా స్పందిస్తున్నారు. బ్యాట్‌ క్రీజు దాటి లోపలికి రాలేదని అది వీడియోలో స్పష్టంగా కపిపిస్తోందని దాన్ని ఎలా నాటౌట్ ప్రకటిస్తాడని మండిపడుతున్నారు. ఆ సమయంలో స్టోక్స్ 31 పరుగుల వద్ద ఉన్నాడు.

మరో సారి థర్డ్ ఎంఫైర్ నిర్ణయం వివాదాస్పదం అయింది. రెండో వన్డేలో స్టోక్స్‌ రనౌట్‌ విషయంలో థర్డ్ ఎంఫైర్ నిర్ణయం సరైంది కాదంటూ పలువురు విమర్శిస్తున్నారు. ఇంగ్లాండ్ ఛేజింగ్ సమయంలో భువనేశ్వర్‌ వేసిన 26వ ఓవర్‌‌లో బంతిని స్టోక్స్‌ మిడాన్‌ దిశగా షాట్ ఆడాడు. రెండో పరుగు తీసే క్రమంలో కులదీప్ విసిరిన బంతి నేరుగా వికెట్లకు తగిలింది. దీంతో బెన్‌స్టోక్స్‌(Ben Stokes ) ఔట్ ఉంటాడని అందరూ భావించారు. ఎంఫైర్ దాన్ని థర్ఢ్ ఎంఫైర్‌కు రీఫర్ చేశారు. అనేక సార్లు రీప్లై పరీక్షించిన అనంతరం థర్డ్ ఎంఫైర్ దానిని నాటౌట్ ప్రకటించారు.


దీనిపై నెటిజన్లు,మాజీ క్రికెటర్లు ఘాటుగా స్పందిస్తున్నారు. బ్యాట్‌ క్రీజు దాటి లోపలికి రాలేదని అది వీడియోలో స్పష్టంగా కపిపిస్తోందని దాన్ని ఎలా నాటౌట్ ప్రకటిస్తాడని మండిపడుతున్నారు. ఆ సమయంలో స్టోక్స్ 31 పరుగుల వద్ద ఉన్నాడు. ఆ తర్వాత చేలరేగిపోయి భారత్ బౌలర్లపై సిక్సర్లు,ఫోర్లతో విరుచుపడ్డాడు. హాఫ్ సెంచరీ తర్వాత 11 బంతుల్లో వరుసగా 6, 6, 6, 1, 6, 4, 2, 6, 6, 2, 4 బాది మొత్తం 49 పరుగులు సాధించాడు. చివరకు స్టోక్స్‌ (52 బంతుల్లో 99; 4 ఫోర్లు, 10 సిక్సర్లు)తో కాస్తలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఒకవేళ స్టోక్స్‌ 33 పరుగుల వద్దే ఔటై ఉంటే ఫలితం మరోలా ఉండేదేమోని పలువురు అభిప్రాయపడుతున్నారు.

రెండో వన్డేలో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది.. 337 పరుగుల భారీ టార్గెట్ ను మరో 39 బంతులు మిగిలుండగానే  చేధించింది. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్స్ . జానీ బెయిర్ స్టో (Bairstow)  (112 బంతుల్లో 124; 11 ఫోర్లు, 7 సిక్సర్లు) సెంచరీలో చెలరేగగా బెన్ స్టోక్స్ తృటిలో (52 బంతుల్లో 99; 4 ఫోర్లు, 10 సిక్సర్లు) తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు.


. టీమిండియా బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ రెండు వికెట్లు తీయగా..భువనేశ్వర్ ఒక వికెట్ ను సాధించాడు.. స్పిన్నర్లు వి కుల్దీప్, కృనాల్ వికెట్లు ఏమి సాధించకపోగా  భారీగా పరుగులు సమర్పించుకున్నారు. మెుదటి  వన్డే లో కనబరిచిన ఆటతీరును టీమిండియా ఏమాత్రం రెండో వన్డేలో కనబరచలేకపోయింది..రెండో గేమ్ ను ఇంగ్లండ్ దక్కించుకోవడంతో సిరీస్ 1-1 సమంగా నిలిచింది. ఆదివారం జరగనున్న మూడో వన్డేలో గెలిచిన జట్టు సిరీస్ ను కైవసం చేసుకుంటోంది. 337 పరుగుల భారీ టార్గెట్ తో ఛేజింగ్ ను ప్రారంభించిన ఇంగ్లండ్ కు ఓపెనర్లు మరో సారి గ్రేట్ స్టార్ట్ ని అందించారు. జేసన్ రాయ్, బెయిర్ స్టో ఇద్దరూ ఫస్ట్ వికెట్ కు 110 పరుగుల పార్టనర్ షిప్ ని నెలకొల్పారు. జాసన్ రాయ్ (52 బంతుల్లో 55: 7 ఫోర్లు, 1 సిక్స్) రనౌట్‌గా వెనుదిరగడంతో ఇంగ్లండ్ 110 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది

First published:

Tags: India vs england, Yuvraj Singh

ఉత్తమ కథలు