క్రికెట్ పాన్స్‌కు గుడ్ న్యూస్.. వరుసగా మూడు ప్రపంచకప్‌లు

సోమవారం సమావేశమైన ఐసీసీ బోర్డు టీ20 వరల్డ్ కప్ వాయిదాతో సహా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ ఏడాది జరిగే వరల్డ్ కప్‌ను వచ్చే ఏడాదికి వాయిదా వేసింది ఐసీసీ. ఈ నేపథ్యంలో వరుసగా మూడేళ్ళు వరల్డ్ కప్‌లు జరగనున్నాయి. వీటిలో రెండు టీ20 ప్రపంచకప్‌లు కాగా.. ఒకటి వన్డే ప్రపంచకప్‌.

Rekulapally Saichand
Updated: July 21, 2020, 11:34 AM IST
క్రికెట్ పాన్స్‌కు గుడ్ న్యూస్..  వరుసగా మూడు ప్రపంచకప్‌లు
టీమిండియా
  • Share this:
అనుకున్నదే అయింది.. అభిమానులు ఊహించిందే జరిగింది!. గత కొద్ది నెలలుగా కొనసాగుతున్న అనిశ్చితికి తెరపడింది. కరోనా మహమ్మారి కారణంగా టీ20 ప్రపంచకప్‌ను ఐసీసీ వాయిదా వేసింది. దీంతో ఐపీఎల్‌కు మార్గం సుగమమైంది. త్వరలోనే బీసీసీఐ షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉంది. ఇన్ని రోజులు ఐసీసీ నిర్ణయం కోసం ఎదురుచూసిన బీసీసీఐ సోమవారం జరిగిన సమావేశంలో టీ20 ప్రపంచ కప్‌ను వాయిదా వెస్తున్నట్లు ప్రకటించడంతో ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ కోసం ప్రణాళికలు రచిస్తోంది.



సోమవారం సమావేశమైన ఐసీసీ బోర్డు టీ20 వరల్డ్ కప్ వాయిదాతో సహా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ ఏడాది జరిగే వరల్డ్ కప్‌ను వచ్చే ఏడాదికి వాయిదా వేసింది ఐసీసీ. ఈ నేపథ్యంలో వరుసగా మూడేళ్ళు వరల్డ్ కప్‌లు జరగనున్నాయి. వీటిలో రెండు టీ20 ప్రపంచకప్‌లు కాగా.. ఒకటి వన్డే ప్రపంచకప్‌. ఈ మూడు ప్రపంచ కప్‌లు అక్టోబరు-నవంబరు నెలల్లోనే జరగనున్నాయి. అయితే వేదికలపైనే సందిగ్ధత నెలకొంది. 2021, 2022లలో టీ20 ప్రపంచకప్‌లను భారత్‌, ఆస్ట్రేలియాలు మార్చుకునే అవకాశం ఉన్నట్లు ఐసీసీ సీఈవో మను సాహ్నే
Published by: Rekulapally Saichand
First published: July 21, 2020, 11:34 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading