EX BOYFRIEND WON MEDAL IN TOKYO OLYMPICS NOW SHE IS REGRETTING FOR HER BREAK UP READ ATHLETE HAYDEN WILDE STORY JNK
Tokyo Olympics: అప్పుడు బ్రేకప్ చెప్పింది.. ఆ ప్రియుడే పతకం తెచ్చేసరికి బాధపడుతోంది..
అప్పుడు ప్రేమను తిరస్కరించినందుకు ఇప్పుడు బాదపడుతోంది. (Twitter)
చిన్నప్పటి నుంచి కలసి మెలసి తిరిగారు. స్కూల్ నుంచి కాలేజీ వరకు ఇద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. ఒకనాడు అతడు ప్రపోజ్ చేస్తే ఆ అమ్మాయి తిరస్కరించింది. కానీ ఆ తిరస్కరణకు గురైన అబ్బాయి ఒలింపిక్స్‌లో పతకం కొల్లగొట్టాడు. ఇప్పుడు ఆ అమ్మాయి బాధపడుతోంది.
జీవితంలో ఎవరు ఎప్పుడు ఎలా గెలుపును సొంతం చేసుకుంటారో ఎవరికీ అర్దం కాదు. తమ లక్ష్యం కోసం ఎన్నో ఏళ్లుగా పోరాడే వాళ్లు ఉంటారు. ఈ క్రమంలో తమ సొంతం అనుకున్న వాళ్లను కోల్పోవలసి వస్తుంది. అలాంటి పరిస్థితే న్యూజీలాండ్ (New Zealand) హేడెన్ వైల్డ్‌కు (Hayden Wilde)వచ్చింది. న్యూజీలాండ్‌కు చెందిన హేడన్‌కు ఒలింపిక్ పతకం సాధించడం అనేది ఒక కల. టోక్యో ఒలింపిక్స్ 2020కి (Tokyo Olympics) వచ్చిన వైల్డ్ పురుషుల వ్యక్తిగత ట్రయథ్లాన్‌లో కాంస్య పతకం సాధించాడు. తనకు పతకం వచ్చిన ఆనందలో హెడెన్ కన్నీటి పర్యంతం అయ్యాడు. తాను ఎన్నో ఏళ్లు పడిన కష్టానికి తుది ఫలితం దక్కినందుకు సంతోషించాడు. ఇదంతా టోక్యోలో జరుగుతుంటే.. న్యూజీలాండ్‌లో ఒక అమ్మాయి కూడా ఏడుస్తోంది. ఎందుకో తెలుసా? కాంస్య పతకం గెలిచిన హెడెన్ ఒకప్పుడు ఆమె బాయ్‌ఫ్రెండ్. స్కూల్ కాలం నుంచే కలసి తిరిగిన వీళ్లు తర్వాత కొన్నాళ్లకు బ్రేకప్ చెప్పేసుకున్నారు. కాగా, హెడెన్ కాంస్య పతకం గెలవగానే న్యూజీలాండ్‌కు చెందిన 1 న్యూస్ అనే చానల్ ప్రజల్లోకి వెళ్లి వారి స్పందన తెలుసుకుంటున్నది. తమ దేశానికి పతకం తెచ్చిన అథ్లెట్‌కు లైవ్ లోనే ఎంతో మంది సంతోషంగా అభినందనలు తెలియజేస్తున్నారు. ఆ టీవీ కార్యక్రమంలో ఎంతో మంది హెడెన్‌ను పొగుడుతున్నారు.
అకస్మాత్తుగా కెమెరా ముందుకు వచ్చిన ఒక అమ్మాయి మాత్రం ఏడుస్తూ ఉంది. కన్నీటితోనే 'హెడెన్ నీ ప్రేమను తిరస్కరించినందుకు ఈ రోజు బాధపడుతున్నాను' అని చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది. హెడెన్ తనకు ప్రపోజ్ చేసినా ఎందుకు తిరస్కరించిందో చెప్పుకొచ్చింది. అతడు ఒక అథ్లెట్ కావాలని అనుకున్నాడు. కానీ తాను మాత్రం అందుకు ఒప్పుకోలేదు. కానీ అతడు తన లక్ష్యం వైపు సాగిపోయాడు. అంటూ కన్నీటితో చెప్పింది. చివర్లో 'నేను నిన్ను చూసి గర్విస్తున్నాను' అంటూ చెప్పింది. ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని చూసిన దేశ ప్రజలు ఒక్కసారిగా అవాక్కయ్యారు. హెడన్‌ను తిరస్కరించిన ఆమెపై జాలి కూడా చూపించారు. కానీ ప్రేమలో విఫలం అయినా తన లక్ష్యాన్ని వీడని హెడన్పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ప్రేమలో విఫలం అయితే చాలా మంది ఇక అదే జీవితానికి ఆఖరు అని భావిస్తుంటారు. కానీ హెడెన్ మాత్రం తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి మాత్రం ప్రయాణాన్ని ఆపలేదు.
మరి ఇప్పటికైనా ఆ అమ్మాయి హెడన్ ప్రేమను అంగీకరిస్తుందా? అంటే ప్రస్తుతం ఆమెకు ఆ అవకాశమే లేదు. హెడెన్ స్పెయిన్‌కు చెందిన ఒక అమ్మాయి ప్రేమలో ఉన్నాడు. ఇప్పుడు ఈ అమ్మాయి వచ్చినా అతడు చేసేది ఏమీ లేదు. ఈ మొత్తం కథనం ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది.
Published by:John Naveen Kora
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.