అన్నీ పింక్ కలరే... అంతా పింక్ బాల్ సందడి...

India vs Bangladesh Test | పింక్ బాల్ టెస్ట్ ఫస్ట్ సెషన్ మధ్యాహ్నం 1 గంట నుంచి 3 వరకు ఉంటుంది. రెండో సెషన్ మధ్యాహ్నం 3.40 నుంచి 5.40 వరకు సాగుతుంది. మూడో సెషన్ సాయంత్రం 6 గంటల నుంచీ రాత్రి 8 గంటల వరకూ ఉంటుంది.

news18-telugu
Updated: November 22, 2019, 11:44 AM IST
అన్నీ పింక్ కలరే... అంతా పింక్ బాల్ సందడి...
అన్నీ పింక్ కలరే... అంతా పింక్ బాల్ సందడి... (credit - twitter)
  • Share this:
India vs Bangladesh Pink Ball Test | ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్న భారత్, బంగ్లాదేశ్ పింక్ బాల్ టెస్ట్ మధ్యాహ్నం 1 గంటకు మొదలవ్వబోతోంది. ఈ మ్యాచ్ జరిగే కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌కి క్రికెట్ అభిమానులు వేలాదిగా తరలివచ్చారు. స్టేడియంతోపాటూ... కోల్‌కతా మొత్తాన్ని అభిమానులు పింక్ కలర్‌లో డెకరేట్ చేశారు. చారిత్రక కట్టడాలు, పార్కులు, రెస్టారెంట్లూ... అన్నీ పింక్ కలర్‌లోనే కనిపిస్తున్నాయి. ఇప్పటివరకూ ఇండియన్ క్రికెట్‌లో తెలుపు, ఎరుపు బంతులు మాత్రమే ఉండేవి. తొలిసారి పింక్ బంతిని వాడుతుండటంతో... ఇదో పండగలా జరుపుకుంటున్నారు. తినే పదార్థాలు, వాహనాలు ఎక్కడ, ఏది చూసినా గులాబీ రంగులోనే కనిపిస్తున్నాయి. క్రికెట్ సెలబ్రిటీలు సైతం... తాము చూసే పింక్ కలర్ వస్తువుల్ని ఫొటోలు తీసి... అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు.


రెండు టెస్టుల సిరీస్‌లో ఇప్పటికే ఓ టెస్టును దక్కించుకున్న టీమిండియా... రెండో టెస్టులోనూ విజయం సాధించి... సిరీస్ సొంతం చేసుకునేందుకు పట్టుదలతో ఉంది. పైగా ఈ సిరీస్ గెలిస్తే... టీమిండియాకు ఇది వరుసగా 12వ సిరీస్ గెలుపు అవుతుంది. అందువల్ల ఇవాళ్టి చరిత్రాత్మక టెస్ట్ డే అండ్ నైట్ మ్యాచ్‌ను చూసేందుకు... అభిమానులతోపాటూ... రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు, ప్రముఖులు కూడా హాజరవుతున్నారు.
ప్రస్తుతం టీమిండియా... బ్యాటింగ్, బౌలింగ్ అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది. ఈ కారణంగానే తొలి టెస్టును మూడు రోజుల్లోనే ముగించేసింది. రెండో టెస్టులోనూ అదే ఊపు కొనసాగించాలని భారత్ పట్టుదలతో ఉంది.


Pics : అమాయక చూపుల అందాల రాశి తేజశ్వి
ఇవి కూడా చదవండి :

Health : గుమ్మడికాయ గింజలతో 7 ఆరోగ్య ప్రయోజనాలు

Health Tips : బంగాళాదుంపల్ని ఇలా వండితే మేలు


Health : కూరగాయలు పచ్చివి తింటే ప్రమాదమా... ఆయుర్వేదం ఏం చెబుతోంది?

Health Tips : గొంతు గరగరగా ఉందా... ఇలా చెయ్యండి చాలు... సమస్య పరార్

Health : నిమ్మరసం ఎక్కువగా తాగుతున్నారా... డేంజరే.

First published: November 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>