Home /News /sports /

EVERY CRICKETER MUST PLAY DOMESTIC CRICKET IF THEY ARE INJURED TO PROVE FITNESS AND FORM RAHUL DRAVID NEW RULE JNK

Team India: ఇకపై టీమ్ ఇండియాలో చోటు దక్కాలంటే కష్టపడాల్సిందే.. గాయాల పాలైన క్రికెటర్లకు కొత్త సవాలు

టీమ్ ఇండియాలో చోటు దక్కడం ఇకపై అంత ఈజీ కాదు (PC: BCCI)

టీమ్ ఇండియాలో చోటు దక్కడం ఇకపై అంత ఈజీ కాదు (PC: BCCI)

Team India: టీమ్ ఇండియా క్రికెటర్లు ఎవరైనా గాయాల పాలై జట్టుకు దూరమైతే ఇకపై వాళ్లు తిరిగి నేరుగా జట్టులోకి వచ్చే అవకాశం ఉండదు. ప్రతీ ఒక్కరు దేశవాళీ క్రికెట్ ఆడి ఫిట్‌నెస్‌తో పాటు ఫామ్‌ను నిరూపించుకుంటేనే టీమ్ ఇండియాకు ఎంపిక చేస్తారు. రాహుల్ ద్రవిడ్ పాత సాంప్రదాయాన్ని తిరిగి అమలులోకి తీసుకొని రావాలని భావిస్తున్నాడు.

ఇంకా చదవండి ...
  ఏ దేశంలోని జాతీయ జట్టులో స్థానం సంపాదించాలన్నా చాలా పోటీ ఉంటుంది. ఇక ఇండియాలో అయితే నేషనల్ టీమ్‌కు సెలెక్ట్ కావడం అంత సులభం కాదు. జిల్లా, రాష్ట్రం, జాతీయ స్థాయిని దాటి అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాలంటే టాలెంట్‌తో పాటు కాస్త అదృష్టం కూడా ఉండాలి. గత కొన్నేళ్లుగా బీసీసీఐ (BCCI) దేశవాళీ క్రికెట్‌పై (Domestic Cricket) పూర్తిగా దృష్టి పెట్టింది. దీనికి తోడు ఐపీఎల్ (IPL) ద్వారా దేశవాళీ క్రికెటర్లకు డిమాండ్ పెరిగింది. రంజీ ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ, విజయ్ హజారే వంటి టోర్నీల్లో సత్త చాటి జాతీయ జట్టులోకి ఎంపిక అవుతున్నారు. దేశవాళీ క్రికెట్ నాణ్యత పెరగడంతో పాటు ఐపీఎల్ వల్ల టీమ్ ఇండియా (Team India) బెంచ్ కూడా కుర్రాళ్లతో పటిష్టంగా మారింది. సీనియర్ క్రికెటర్లు ఎవరైనా గాయపడినా.. అందుబాటులో లేకున్నా.. కుర్రాళ్లు ఆ అవకాశాలను దక్కించుకొని ఉపయోగించుకుంటున్నారు. దేశవాళీలో మంచి రికార్డు ఉన్న శ్రేయస్ అయ్యర్ ఇటీవల న్యూజీలాండ్ సిరీస్‌తో టెస్టుల్లో అవకాశం పొందాడు. అరంగేట్రం మ్యాచ్‌లోనే సత్తా చాటి జట్టులో స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. అయితే గాయపడి జట్టుకు దూరమైన ఆటగాళ్లు తిరిగి జట్టులోకి వస్తే యువకుల స్థానాలకు గ్యారెంటీ లేకుండా పోతుంది. ఈ విషయంలో రాహుల్ ద్రవిడ్ పాత పద్దతికి జై కొట్టాడు.

  జాతీయ జట్టులో స్థానం సంపాదించిన ఒకరి రెండు మంచి ప్రదర్శనలు చేసిన తర్వాత చాలా మంది జట్టులో స్థానం ఖరారు చేసుకుంటున్నారు. మధ్యలో ఎప్పుడైనా గాయపడినా.. ఎన్ఏసీ లేదా సొంత జిమ్‌లలో కోలుకొని తిరిగి జట్టులోకి వస్తున్నారు. యోయోటెస్టులు పాసైతే చాలు మళ్లీ జట్టులో స్థానం ఖరారు అయిపోతున్నది. అయితే ఇకపై ఇలా ఉండకూడదని కోచ్ రాహుల్ ద్రవిడ్ భావిస్తున్నారు. టీమ్ ఇండియా బిజీ షెడ్యూల్ కారణంగా ఆటగాళ్లు తరుచూ గాయాలపాలౌతున్నారు. అయితే అలా గాయపడిన క్రికెటర్లు కోలుకొని నేరుగా జట్టులోకి ఉండటానికి వీలుండదు. వాళ్లు తప్పకుండా దేశవాళీ క్రికెట్ ఆడి తమ ఫిట్‌నెస్, ఫామ్ నిరూపించుకోవల్స ఉంటుంది.

  Team India : టీమిండియా సారథిగా రోహిత్ శర్మ ఓకే.. మరీ, వైస్ కెప్టెన్ ఎవరు..? రేసులో ఆ ఇద్దరు..


  అనిల్ కుంబ్లే కోచ్‌గా పని చేసిన సమయంలో కూడా ఇలాంటి నిబంధన ఉన్నది. అయితే సీనియర్లు ఈ నిబంధనలపై వ్యతిరేకత వ్యక్తం చేయడం అప్పట్లో వివాదంగా మారింది. అనిల్ కుంబ్లే కోచ్ పదవి వదిలేయడానికి ఈ నిబంధనకు కూడా ఒక కారణమని అప్పట్లో వార్తలు వచ్చాయి. రవిశాస్త్రి భారత జట్టు హెడ్ కోచ్ అయిన తర్వాత ఈ పద్దతిని అసలు అనుసరించడం కూడా మానేశారు. గాయపడిన క్రికెటర్లు జస్ట్ యోయో టెస్టు పాసైపోయి నేరుగా జట్టులోకి వచ్చేవాళ్లు. ఇకపై ఇలా ఉండకూడదని రాహుల్ ద్రవిడ్ సెలెక్షన్ కమిటీకి చెప్పినట్లు తెలుస్తున్నది.

  First Ashes Test : గబ్బాలో ఆస్ట్రేలియా దెబ్బ.. ఇంగ్లండ్ అబ్బా.. టీ-20 బ్యాటింగ్ తో హెడ్ సెంచరీ..
  గత మూడు నాలుగేళ్లుగా సీనియర్ క్రికెటర్లు దేశవాళీ క్రికెట్ ఆడటం పూర్తిగా మానేశారు. ఒక వేళ గాయపడితే కోలుకున్న తర్వాత నేరుగా జట్టులోకి వస్తున్నారు. కొన్ని సార్లు ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా టెస్టుల్లోకి కూడా క్రికెటర్లను ఎంపిక చేశారు. ఇకపై ఈ పద్దతి ఉండకూడదని రాహుల్ ఖరాఖండీగా చెప్పేసినట్లు బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. సెలెక్షన్ పద్దతిని పూర్తిగా మార్చేయాలని ఆయన కోరుతున్నారు. టెస్ట్ క్రికెట్‌కు ఎంపిక అవ్వాలంటే కేవలం ఫస్ట్ క్లాస్ కెరీర్‌ను మాత్రమే ప్రతిపాదనగా తీసుకోవాలని ద్రవిడ్ అభిప్రాయపడుతున్నాడు. ఐపీఎల్ ప్రదర్శనను కేవలం వైట్ బాల్ క్రికెట్‌కు పరిమితం చేయాలని ఆయన అంటున్నాడు.

  Virat Kohli : అప్పుడు ధోనీ చేసిన పని ఇప్పుడు కోహ్లీ చేసి ఉంటే కనీస గౌరవమైనా దక్కి ఉండేది..!


  ఇటీవల హార్దిక్ పాండ్యా ఫిట్‌నెస్ విషయంలో టీమ్ మేనేజ్‌మెంట్ పూర్తిగా విఫలమైందని ద్రవిడ్ భావిస్తున్నాడు. హార్దిక్ గాయం నుంచి కోలుకున్న తర్వాత దేశవాళీ క్రికెట్ ఆడించి ఉంటే ఏ మేరకు ఫిట్‌గా ఉన్నాడో తెలిసిపోయి ఉండేదని.. కానీ ఐపీఎల్‌లో రెండు ఇన్నింగ్స్‌ల ఆధారంగా టీ20 వరల్డ్ కప్‌కు ఎంపిక చేయడం భారత జట్టుకు భారంగా మారిందని ద్రవిడ్ అంటున్నాడు. ఇకపై ఇలాంటివి జరుగకుండా అందరు ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని అంటున్నాడు. హార్దిక్ పాండ్యా ఇప్పుడు జట్టులోకి రావాలన్నీ తప్పకుండా రంజీ ట్రోఫీ ఆడాల్సి ఉంటుంది. ఫామ్ కోల్పోయిన క్రికెటర్లు కూడా దేశవాళీలో నిరూపించుకుంటేనే సెలెక్షన్‌లో ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఈ నియమం దీర్ఘకాలికంగా జట్టుకే ఉపయోగపడుతుందని.. స్టార్ క్రికెటర్లు ఆడటం వల్ల రంజీ ట్రోపీకి కూడా ఆదరణ పెరుగుతందని బోర్డు భావిస్తున్నది.

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
  Published by:John Kora
  First published:

  Tags: Bcci, Cricket, Rahul dravid, Team india

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు