Home /News /sports /

EURO CUP 2020 GETTING MASON MOUNTS JERSEY A 10 YEAR OLD GIRL WHO CRIED OUT OF SHEER JOY VIDEO GOES VIRAL SRD

Euro Cup 2020 : అభిమానానికి దక్కిన అరుదైన బహుమతి..గుక్కపెట్టి ఏడ్చిన అమ్మాయి..వైరల్ వీడియో..

Photo Credit : Twitter

Photo Credit : Twitter

Euro Cup 2020 : యూఈఎఫ్‌ఏ చాంపియన్‌షిప్‌ యూరోకప్‌ 2020లో ఇంగ్లండ్‌ జట్టు 55 ఏళ్ల తర్వాత ఫైనల్లో అడుగుపెట్టింది. డెన్మార్క్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో 2-1 తేడాతో విజయం సాధించింది. 1966 ప్రపంచకప్‌ తర్వాత ఒక మేజర్‌ టోర్నీలో ఇంగ్లండ్‌ ఫైనల్లో అడుగుపెట్టడం ఇదే.

ఇంకా చదవండి ...
    యూఈఎఫ్‌ఏ చాంపియన్‌షిప్‌ యూరోకప్‌ 2020లో ఇంగ్లండ్‌ జట్టు 55 ఏళ్ల తర్వాత ఫైనల్లో అడుగుపెట్టింది. డెన్మార్క్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో 2-1 తేడాతో విజయం సాధించింది. 1966 ప్రపంచకప్‌ తర్వాత ఒక మేజర్‌ టోర్నీలో ఇంగ్లండ్‌ ఫైనల్లో అడుగుపెట్టడం ఇదే. అయితే, ఇంగ్లండ్‌ ఫుట్‌బాలర్‌ మాసన్‌ మౌంట్‌ మ్యాచ్‌ విజయంతో పాటు అభిమానుల మనుసులు గెలుచుకోవడం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. పూర్తి వివరాల్లోకెళితే..55 ఏళ్ల తర్వాత ఫైనల్ లోకి అడుగుపెట్టడంతో ఇంగ్లండ్ జట్టు ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఈ చిరస్మరణీయ సన్నివేశాన్ని మైదానంలో ఉన్న అభిమానులు కూడా ఫుల్‌ ఎంజాయ్‌ చేశారు. వారి సంబరాలను మరింత రెట్టింపు చేయడానికి మౌంట్‌ తన జెర్సీని ఒక అమ్మాయికి కానుకగా ఇచ్చాడు. మ్యాచ్‌ ఆరంభం నుంచి తమకు మద్దతిచ్చిన ఆ అమ్మాయి దగ్గరకు వచ్చి తన జెర్సీని ఆమె చేతిలో పెట్టి వెళ్లిపోయాడు. అయితే ఆ అమ్మాయి ఏం అనుకుందో ఏమో తన తండ్రిని హద్దుకొని గట్టిగా ఏడ్చేసింది. తన అభిమానికి సరియైన ప్రతిఫలం దక్కడంతో ఆమె కంట ఆనంద భాష్పాలు కారాయ్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.

    ఇదంతా చూసిన మిగతావాళ్లు.. '' మీ తండ్రీ కూతుళ్లు అదృష్టవంతులు.. ఇది సెలబ్రేట్‌ చేసుకోవాల్సిన సమయం'' అంటూ కంగ్రాట్స్‌ చెప్పారు. అయితే, ఈ వీడియోనూ రెమ్‌ విలియ్స్‌ అనే వ్యక్తి తన ట్విటర్‌లో షేర్‌ చేయగా ట్రెండింగ్‌గా మారింది. ఇప్పటివరకు ఈ వీడియోనూ దాదాపు 6.7 మిలియన్‌ వ్యూస్‌ రాగా.. వేల సంఖ్యలో లైక్‌లు, కామెంట్లు వచ్చాయి. ఇక 55 ఏళ్ల తర్వాత ఒక మెగాటోర్నీలో ఫైనల్‌ చేరిన ఇంగ్లండ్‌ జూలై 11న ఇటలీతో టైటిల్‌ పోరుకు తలపడనుంది.


    మరోవైపు, యూరోపియన్ దేశాల్లో ఫుట్‌బాల్‌కు ఉండే క్రేజే వేరు. ఇంగ్లాండ్ జట్టు 55 ఏళ్ల తర్వాత యూరో కప్ ఫైనల్ చేరింది. ఫైనల్ మ్యాచ్ కూడా లండన్ వింబ్లే స్టేడియంలో నిర్వహిస్తుండటంతో టికెట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. సెమీస్, ఫైనల్ మ్యాచ్‌ల కోసం అధికారికంగా అమ్మిన టికెట్లు ఎప్పుడో అయిపోయాయి. అయితే ఇంగ్లాండ్ ఫైనల్ చేరడంతో ఒక్కసారిగా బ్లాక్ మార్కెట్లో వికెట్ల విక్రయాలు ఊపందుకున్నాయి. ఇటలీతో జరుగనున్న ఫైనల్ మ్యాచ్ టికెట్ల కోసం బ్లాక్ మార్కెట్‌లో రూ. 56 లక్షలకు అమ్ముతున్నారని సమాచారం. వింబ్లే స్టేడియంలో సీట్ కెపాసిటీ లక్షకు పైగానే ఉంటుంది. అయితే కరోనా కారణంగా కేవలం 67500 టికెట్లు మాత్రమే విక్రయించడానికి అనుమతి ఉంది.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: EURO 2020, Euro Cup 2021, Foot ball

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు