• Home
  • »
  • News
  • »
  • sports
  • »
  • EURO 2020 DENMARKS FOOTBALLER CHRISTIAN ERIKSEN COLLAPSES MID GAME AGAINST FINLAND SK

Euro 2020: ఆట మధ్యలో కుప్పకూలిన ఫుట్‌బాలర్.. యూరో కప్‌లో అపశృతి.. వీడియో వైరల్

క్రిస్టియన్ ఎరిక్సన్ (Image:Twitter)

Christian Eriksen: స్ట్రెచర్‌పై తీసుకెళ్తున్న సమయంలో ఎరిక్సన్ స్పృహలోనే ఉన్నాడు. ప్రమాదమేమీ లేదని క్రిస్టియన్ ఎరిక్సన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని యూరో 2020 ప్రతినిధులు తెలిపారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.

  • Share this:
    UEFA EURO 2020 టోర్నమెంట్‌లో అపశృతి చోటుచేసుకుంది. శనివారం కోపెన్‌హెగన్ వేదికగా డెన్మార్క్, ఫిన్లాండ్ మధ్య జరిగిన గేమ్‌లో డానిష్ ఆటగాడు క్రిస్టియన్ ఎరిక్సన్ కుప్పకూలిపోయాడు. మ్యాచ్ మొదటి అర్ధభాగంలోనే ఈ ఘటన జరిగింది. ఫుట్ బాల్ వైపు పరిగెడుతూ ఒక్కసారిగా కిందపడిపోయాడు ఎరిక్సన్. సహచర ఆటగాళ్లంతా అతడి వద్దకు చేరుకొని పైకి లేపేందుకు ప్రయత్నించారు. కానీ ఉలుకూ పలుకూలేదు. వెంటనే మెడికల్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. అతడు ఎవరికి కనిపించకుండా ఆటగాళ్లంతా చుట్టూ గోడలా నిలబడ్డారు. మెడికల్ సిబ్బంది వచ్చి CPR చేశారు. అనంతరం హుటాహుటిన స్ట్రెచర్‌పై ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటన అనంతరం డెన్మార్క్, ఫిన్లాండ్ మ్యాచ్ నిలిచిపోయింది.



    గ్రౌండ్‌లో సహచర ఆటగాళ్లంతా కంటతడి పెట్టిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఐతే స్ట్రెచర్‌పై తీసుకెళ్తున్న సమయంలో ఎరిక్సన్ స్పృహలోనే ఉన్నాడు. ప్రమాదమేమీ లేదని క్రిస్టియన్ ఎరిక్సన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని యూరో 2020 ప్రతినిధులు తెలిపారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. తదుపరి పరీక్షలు చేయాల్సి ఉందని వెల్లడించారు.


    మరోవైపు ఎరిక్సన్ త్వరగా కోలుకోవాలని ప్రపంచవ్యాప్తంగా క్రీడా ప్రముఖులు, అభిమానులు కోలుకుంటున్నారు. భారత ఫుట్ బాల్ టీమ్‌తో పాటు ఐపీఎల్ జట్లు కూడా ట్వీట్ చేశాయి. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్ జట్లు సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టాయి. అటు అభిమానులు పెద్ద ఎత్తున ట్వీట్స్ చేస్తున్నారు. క్రిస్టియన్ ఎరిక్సన్ క్షేమంగా తిరిగి రావాలని దేవుళ్లను ప్రార్థిస్తున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published: