Home /News /sports /

EURO 2020 CLIMATE ACTIVIST CRASHLANDS PARACHUTE IN FRANCE VS GERMANY GAME WITH A MESSAGE VIDEO GOES VIRAL SK

Euro 2020: ఫుట్‌బాల్ మ్యాచ్‌లో కలకలం.. ఆటగాళ్ల మధ్య ల్యాండయిన పారాచూట్.. అంతా షాక్

ఫుట్‌బాల్‌లో పారాచూట్

ఫుట్‌బాల్‌లో పారాచూట్

UEFA Euro 2020: పారాచూట్‌ కిందకు దిగే సమయంలో దాని వైర్లు.. స్టేడియం పైకప్పుకు అనుసంధానంగా ఉన్న ఓవర్ హెడ్ కెమెరాకు తట్టుకున్నాయి. సాంకేతిక సమస్యలతో మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కాసేపు నిలిచిపోయింది. ఒక్కసారిగా లైవ్‌ కట్‌ కావడంతో మైదానంలో ఏం జరుగుతుందో ఎవ్వరికీ అర్ధం కాలేదు.

ఇంకా చదవండి ...
    Euro 2020: యూరో కప్‌లో భాగంగా జరిగిన ఓ మ్యాచ్‌లో తీవ్ర కలకలం రేగింది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఓ పారాచ్యూట్ ఏకంగా గ్రౌండ్‌లో ల్యాండ్ అయింది. అదుపు తప్పి క్రాష్ ల్యాండ్ కావడంతో పులువురికి గాయాలయ్యాయి. మంగళవారం మ్యునిచ్‌లో జర్మనీ, ఫ్రాన్స్ మధ్య ఫుట్ బాల్ మ్యాచ్ జరిగింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు గ్రౌండ్‌లోకి ఓ పారాచూట్ దూసుకొచ్చింది. పారాచూట్ రైడర్ నినాదాలు చూస్తే గ్రౌండ్‌లో దిగాడు. ఐతే దానిపై నియంత్రణ కోల్పోవడంతో క్యాష్ ల్యాండ్ అయింది. ఈ ఘటనలో పలువురు ప్రేక్షుకులు గాయపడ్డారు. ఫ్రాన్స్ కోచ్ డిడియర్ డెస్చంప్స్ తృటితో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

    పారాచూట్‌ కిందకు దిగే సమయంలో దాని వైర్లు.. స్టేడియం పైకప్పుకు అనుసంధానంగా ఉన్న ఓవర్ హెడ్ కెమెరాకు తట్టుకున్నాయి. సాంకేతిక సమస్యలతో మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కాసేపు నిలిచిపోయింది. ఒక్కసారిగా లైవ్‌ కట్‌ కావడంతో మైదానంలో ఏం జరుగుతుందో ఎవ్వరికీ అర్ధం కాలేదు. వెంటనే పారాచూట్ ల్యాండ్ అవడంతో అభిమానులతో పాటు ఆటగాళ్లు, మ్యాచ్ నిర్వాహకులు షాక్ తిన్నారు. ఆ పారాచూట్‌పై కిక్ అవుట్ ఆయిల్, గ్రీన్ పీస్ అని రాసి ఉంది. రష్యాకు చెందిన ప్రభుత్వరంగ ఇంధన సంస్థ గాజ్‌ప్రామ్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. ఈ కంపెనీకి వ్యతిరేకంగా పలువురు ఆందోళనలు చేస్తున్నారు. తమ నిరసన ప్రపంచానికి తెలియాలంటే ఇలాంటి మ్యాచ్‌లో నిరసన చేయాలని అతడు భావించాడు. ఈ క్రమంలోనే పారాచూట్‌ను గ్రౌండ్ మీదుగా తీసుకెళ్లాలని అనుకున్నాడు. కానీ అనుకోకుండా అది క్రాష్ ల్యాండ్ అవడంతో తీవ్ కలకలం రేగింది.


    ఐతే ఈఘటనను యురోపియన్‌ సాకర్‌ పాలకమండలి తీవ్రంగా ఖండించింది. నిరసన తెలియజేసిన విధానాన్ని నిర్లక్ష్యపు, ప్రమాదకర చర్యగా పేర్కొంది ఈ చర్యను తీవ్రంగా పరిగణిస్తున్నామని చెప్పిన UEFA.. నిరసనకారుడిపై చర్యలకు ఆదేశిస్తామని స్పష్టం చేసింది. కాగా, ఈ మ్యాచ్‌లో వరల్డ్ ఛాంపియన్ ఫ్రాన్స్ 1-0తో గెలిచి యూరోకప్-2020లో శుభారంభం చేసింది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: EURO 2020, Football

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు