• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • ESCAPED FROM BIOBUBBLE AND SEEN IN MALDIVES MICHEAL SLATER SLAMS AUSTRAIA PRIME MINISTER JNK

IPL 2021 : బయోబబుల్ నుంచి తప్పించుకొని.. మాల్దీవుల్లో తేలాడు.. అక్కడి నుంచే ప్రధానిపై విమర్శలు

IPL 2021 : బయోబబుల్ నుంచి తప్పించుకొని.. మాల్దీవుల్లో తేలాడు.. అక్కడి నుంచే ప్రధానిపై విమర్శలు

ఇంటికి వెళ్లాలని బయలు దేరి మాల్దీవుల్లో ఇరుక్కున్నాడు.

కరోనాకు భయపడి బయోబబుల్ నుంచి వెళ్లిపోయాడు. ఆస్ట్రేలియా ప్రభుత్వం అనుమతించక పోవడంతో మాల్దీవుల్లో చిక్కొకొని పోయాడు.

  • Share this:
    ఐపీఎల్ 2021 (IPL 2021) సీజన్‌ను నిరవధిక వాయిదా (Suspended) వేయడానికి రెండు రోజల ముందు ఆస్ట్రేలియాకు చెందిన కామెంటేటర్ మైఖేల్ స్లేటర్ (Micheal Slater) బయోబబుల్ నుంచి తప్పించుకొని వెళ్లపోయాడు. ఆస్ట్రేలియాకు (Australia) చెందిన ఈ మాజీ క్రికెటర్ ప్రస్తుతం ఐపీఎల్ బ్రాడ్‌కాస్టర్ అయిన స్టార్ స్పోర్ట్స్‌లో వ్యాఖ్యాతగా పని చేస్తున్నాడు. అయితే అనూహ్యంగా అతడు ముంబైలోని బయోబబుల్ నుంచి అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు. అయితే అతడు ఎక్కడికి వెళ్లాడనే ఆందోళనలో ఉండగానే ట్విట్టర్‌లో వరుసగా ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్‌పై విమర్శల దాడి మొదలు పెట్టాడు. ముంబై నుంచి మాల్దీవులకు చేరుకున్న మైఖేల్ స్లేటర్ అక్కడి నుంచి ఆస్ట్రేలియా వెళ్లడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే ఇండియా నుంచి వచ్చే ఆస్ట్రేలియా పౌరులపై కఠిన ఆంక్షలు అమలు అవుతున్నాయి. 5 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తామని ప్రధాని హెచ్చరించారు. దీంతో మైఖేల్ స్లేటర్ అగ్గి ఫైర్ అవుతున్నాడు. 'ప్రభుత్వం తమ పౌరుల పట్ల బాధ్యత కలిగి ఉంటే మమ్మల్ని దేశంలోకి అనుమతించాలి. కానీ ప్రధాని తన చేతులకు రక్తం ఎందుకు పూసుకుంటున్నాడు. నేను ప్రభుత్వ అనుమతితోనే ఐపీఎల్‌కు వచ్చాను. కానీ ఇప్పుడు ప్రభుత్వం నన్న నిర్లక్ష్యం చేస్తున్నది' అని ట్వీట్‌లో పేర్కొన్నాడు. అయితే డబ్బు కోసం కరోనాను కూడా లెక్క చేయకుండా ఇండియా వెళ్లావంటూ పలువురు స్లేటర్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు.

    కాగా, అలాంటి విమర్శలు చేసే వారికి కూడా స్లేటర్ జవాబు ఇచ్చాడు. క్రికెట్ కెరీర్ ముగిసిన తర్వాత తనకు కూడు పెడుతున్నది కామెంటేటర్ వృత్తే అన్నాడు. తన వృత్తి ధర్మం మేరకు ఆస్ట్రేలియా ప్రభుత్వం వద్ద అన్ని రకాల అనుమతులు తీసుకొని ఇండియా వెళ్లాను. కానీ కరోనా కారణంగా అర్దాంతరంగా వదిలేసి వచ్చేశాను. ఇన్నాళ్లు చేసిన పనికి నాకు డబ్బు కూడా ఇవ్వలేదు. తర్వాత అయినా ఇస్తారనే గ్యారంటీ లేదు. ఇవన్నీ తెలయకుండా అనవసరంగా విమర్శలు చేస్తున్నారంటూ స్లేటర్ దుయ్యబట్టాడు.





    మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు చెందిన ఒక ఆటగాడు ఈ రోజు మైఖేల్ స్లేటర్‌తో ఫోన్‌లో మాట్లాడినట్లు తెలుస్తున్నది. తాను ఆస్ట్రేలియా ఎలా రావాలంటూ సదరు ఆటగాడు ఆందోళనగా స్లేటర్‌కు కాల్ చేశాడని.. అయితే తానే మాల్దీవుల్లో చిక్కుకొని పోయానని... ప్రస్తుతానికి ఇక్కడి నుంచి బయటపడే మార్గాల కోసం అన్వేషిస్తున్నట్లు స్లేటల్ తెలిపాడు. అయితే ఆ ఫోన్ చేసిన ఆటగాడు డేవిడ్ వార్నర్ అయ్యుండొచ్చని తెలుస్తున్నది. ఐపీఎల్ వాయిదా పడటంతో విదేశీ ఆటగాళ్లు, కోచ్‌లు, ఇతర సిబ్బంది త్వరగా స్వదేశాలకు చేరుకోవాలని ఆరాటపడుతున్నారు. బీసీసీఐ వారిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తామని ఇప్పటికే ప్రకటించింది.
    Published by:John Naveen Kora
    First published:

    అగ్ర కథనాలు