మూడో బిడ్డకు జన్మనిచ్చిన రష్యా టెన్నీస్ తార

రష్యా మాజీ టెన్నీస్ తార అన్నా కోర్నికోవా మూడో బిడ్డకు జన్మనిచ్చింది. గత నెలలోనే ఆమె ఆడబిడ్డకు జన్మనివ్వగా...ఆలస్యంగా సోషల్ మీడియాలో విషయం వెల్లడించారు ఆమె భర్త, మ్యూజిక్ సెలబ్రిటీ ఎన్‌రిక్యూ ఇగ్లేసియస్.

news18-telugu
Updated: February 14, 2020, 3:49 PM IST
మూడో బిడ్డకు జన్మనిచ్చిన రష్యా టెన్నీస్ తార
అన్నా కోర్నికోవా దంపతులు
  • Share this:
రష్యా మాజీ టెన్నీస్ తార అన్నా కోర్నికోవా మూడో బిడ్డకు జన్మనిచ్చింది. గత నెలలోనే ఆమె ఆడబిడ్డకు జన్మనివ్వగా...ఆలస్యంగా సోషల్ మీడియాలో విషయం వెల్లడించారు ఆమె భర్త, మ్యూజిక్ సెలబ్రిటీ ఎన్‌రిక్యూ ఇగ్లేసియస్. అన్నా కోర్నికోవా మూడోసారి గర్భందాల్చిన విషయాన్ని కూడా మీడియాకు తెలియకుండా అత్యంత గోప్యంగా ఉంచారు. జనవరి 30న తమకు మూడో సంతానం కలిగినట్లు ఎన్‌రిక్యూ ఇగ్లేసియస్ ఇన్‌స్టాలో వెల్లడించే వరకు అన్నా కోర్నికోవా ప్రెగ్నెంట్‌గా ఉన్న విషయం కూడా ఎవరికీ తెలీదు. ఆస్పత్రిలో శిశువును తన చేతులపై పెట్టుకున్న ఫోటోను షేర్ చేశారు. అన్నా కోర్నికోవా మరో రెండు ఫోటోలను తన ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంది. వారి ఇన్‌స్టా పేజ్ కంగ్రాట్న్ మెసేజ్‌లతో నిండిపోయింది. ప్రెగ్నెన్సీని ఎలా గోప్యంగా ఉంచారంటూ ఫ్యాన్స్ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. తన అందచందాలతో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఫ్యాన్స్‌‌ను సొంతం చేసుకుంది అన్నా కోర్నికోవా. 

Instagramలోని ఈ పోస్ట్‌ని వీక్షించండి
 

My Sunshine 01.30.2020


Enrique Iglesias (@enriqueiglesias) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది
 
Instagramలోని ఈ పోస్ట్‌ని వీక్షించండి
 

My Sunshine 01.30.2020


Anna Kournikova Iglesias (@annakournikova) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది
 
Instagramలోని ఈ పోస్ట్‌ని వీక్షించండి
 

01.30.2020


Anna Kournikova Iglesias (@annakournikova) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది


అన్నా కోర్నికోవా, ఎంటిక్యూ ఎన్‌రిక్యూ 2001లో పెళ్లి చేసుకున్నారు. వారికి రెండు సంవత్సరాల వయస్కులైన నికోలస్, లూసీ అనే కవల పిల్లలు ఉన్నారు. ఇప్పుడు మూడో బిడ్డకు తల్లిదండ్రులయ్యారు. న్యూ ఇయర్ సందర్భంగా తన కవల పిల్లల వీడియోను షేర్ చేసింది అన్నా కోర్నికోవా. 
Instagramలోని ఈ పోస్ట్‌ని వీక్షించండి
 

#happynewyear #сновымгодом 🎈


Anna Kournikova Iglesias (@annakournikova) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది
First published: February 14, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు