Smriti Mandhana : వండర్ వుమెన్.. స్మృతి మంధాన క్యాచ్ చూస్తే మీరు కూడా ఇదే మాట అంటారు..

Photo Credit : Twitter

Smriti Mandhana : అప్పుడప్పుడూ క్రికెట్‌లో సూపర్ మూమెంట్స్ జరుగుతుంటాయి. ఫీల్డర్స్ మెరుపు విన్యాసాలు కావొచ్చు. వికెట్ కీపర్ల నైపుణ్యాలు కావచ్చు.. బ్యాట్స్‌మెన్ల అద్భుతమైన షాట్స్ కావొచ్చు.. ఇలా ఎన్నో జరుగుతాయి. అలాంటి విన్యాసమే..ఇంగ్లండ్, భారత్ మహిళల మూడో వన్డేలో చోటు చేసుకుంది.

  • Share this:
    అప్పుడప్పుడూ క్రికెట్‌లో సూపర్ మూమెంట్స్ జరుగుతుంటాయి. ఫీల్డర్స్ మెరుపు విన్యాసాలు కావొచ్చు. వికెట్ కీపర్ల నైపుణ్యాలు కావచ్చు.. బ్యాట్స్‌మెన్ల అద్భుతమైన షాట్స్ కావొచ్చు.. ఇలా ఎన్నో జరుగుతాయి. అలాంటి విన్యాసమే..ఇంగ్లండ్, భారత్ మహిళల మూడో వన్డేలో చోటు చేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఆఖరి వన్డేలో మిథాలీ సేన, ఇంగ్లండ్‌ మహిళల జట్టుపై విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ టైంలో టీమిండియా డ్యాషింగ్‌ బ్యాట్స్‌ఉమెన్‌ స్మృతి మంధాన పట్టిన క్యాచ్‌.. మ్యాచ్‌ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. ఇప్పుడిప్పుడే వుమెన్స్ క్రికెటర్లు కూడా ఫీల్డింగ్‌లో మెరుస్తున్నారు. తాజాగా ఇండియ‌న్ వుమెన్స్ క్రికెటర్ స్మృతి మంధాన త‌న ఫీల్డింగ్‌తో అందరిని ఆశ్చ‌ర్యంలో ముంచెత్తింది. బౌండరీ వద్ద పరుగెత్తుకుంటూ వచ్చి డైవ్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అయింది. భారత్, ఇంగ్లండ్‌ మహిళల జట్ల మధ్య నిన్న మూడో వన్డే జరిగింది. ఈ మ్యాచులో ఇంగ్లండ్ మొదట బ్యాటింగ్ చేసింది. 59 బంతుల్లో 5 ఫోర్లతో 49 పరుగులు చేసిన నాట్‌ స్కివర్‌.. హాఫ్ సెంచరీకి ఒక పరుగు దూరంలో ఉంది. అర్ధ సెంచరీ చేయాలనుకున్న స్కివర్‌.. దీప్తి బౌలింగ్‌లో లాంగ్‌ షాట్‌ కోసం ప్రయత్నించింది. ఆ టైంలో బౌండరీ లైన్ దగ్గర స్మృతి మంధాన పరుగెత్తుకుంటూ వచ్చి.. డైవ్ చేస్తూ కళ్లు చెదిరే రీతిలో క్యాచ్‌ అందుకుంది. దీంతో స్కివర్‌ నిరాశగా పెవిలియన్ చేరింది. స్టన్నింగ్‌ క్యాచ్‌ పట్టిన మంధానపై తోటి ప్లేయర్స్ అభినందనలు కురిపించారు.

    ఇక, స్మృతి మంధాన పట్టిన క్యాచ్ చూసిన మాజీ క్రికెట‌ర్ల‌తో పాటు ట్విట‌ర్ యూజ‌ర్లు ఆమెపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. "ఫ్లై స్మృతి ఫ్లై గ‌ర్ల్.. ఫెంటాస్టిక్ క్యాచ్‌ " అంటూ ఆస్ట్రేలియా మాజీ వుమెన్స్ క్రికెట‌ర్ లీసా స్తాలేక‌ర్ ట్వీట్ చేశారు. " వండర్ వుమెన్ " 'రవీంద్ర జడేజాను మించిపోయావ్', 'వావ్ ఫెంటాస్టిక్ క్యాచ్' అంటూ తెగపొగిడేస్తున్నారు ఫ్యాన్స్‌. ఈ మ్యాచ్‌లో మంధాన బ్యాటింగ్‌లోనూ రాణించింది. 57 బంతుల్లో 49 ప‌రుగులు చేసి భారత జట్టు విజ‌యంలో కీల‌క‌పాత్ర పోషించింది.


    ఇక, మూడు వన్డేల సిరీసులో భాగంగా చివరిదైన మూడో వన్డేలో భారత్‌ నాలుగు వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ మహిళలపై గెలిచింది. వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను 47 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 219 పరుగులు చేసింది. నాట్‌ స్కివర్‌ (49; 5 ఫోర్లు), కెప్టెన్‌ హీతర్‌ నైట్‌ (46; 4 ఫోర్లు) రాణించారు. దీప్తి శర్మ 3 వికెట్లు తీసింది. లక్ష్యఛేదనలో భారత్‌ మరో మూడు బంతులు మిగిలి ఉండగానే 46.3 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 220 పరుగులు చేసి గెలుపొందింది. ఓపెనర్ స్మృతి మంధాన (49; 8 ఫోర్లు) రాణించింది. మిథాలీ రాజ్ అజేయ అర్ధ సెంచరీ 86 బంతుల్లో 75 నాటౌట్‌; 8 ఫోర్లు) సాధించడంతో పాటు చివరి వరకు క్రీజులో నిలిచి భారత్‌ను విజయతీరాలకు చేర్చింది. సిరీస్ ను కోల్పోయిన మిథాలీ సేన ఆఖరి మ్యాచ్ లో గెలిచి పరువు దక్కించుకుంది.
    Published by:Sridhar Reddy
    First published: