Siraj Counter to English Fans: ఇంగ్లాండ్ అభిమానుల ట్రోలింగ్.. అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన సిరాజ్ మియా

ఇంగ్లాండ్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే కౌంటర్ ఇస్తున్న మహ్మద్ సిరాజ్ (PC: Sky Sports/Twitter)

INDvsENG: ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత జట్టుపై అక్కడి ఇంగ్లీష్ ఫ్యాన్స్ అనుచితంగా ప్రవర్తిస్తున్నారు. మూడవ టెస్టు తొలి రోజు హెడింగ్లేలో అభిమానుల ట్రోలింగ్‌కు సిరాజ్ గట్టి కౌంటర్ ఇచ్చాడు.

  • Share this:
    ఇంగ్లాండ్ (England) పర్యటనలో ఉన్న భారత జట్టు (Team India) మూడో టెస్టు (India Vs England) తొలి ఇన్నింగ్స్‌లో ఘోరంగా విఫలమైన సంగతి తెలిసిందే. 78 పరుగులకే ఆలౌట్ అయిన తర్వాత ఇంగ్లాంగ్ తొలి ఇన్నింగ్స్ ప్రారంభించింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 120 పరుగులు చేసింది. అయితే టీమ్ ఇండియా ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఇంగ్లాండ్ అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. భారత క్రికెటర్లను పదే పదే రెచ్చగొట్టడానికి ప్రయత్నించారు. తొలి రెండు టెస్టుల్లో టీమ్ ఇండియాతో పై చేయి అయ్యింది. దీంతో గ్యాలరీల్లో సైలెంట్‌గా కూర్చున్న ఇంగ్లాండ్ అభిమానులు.. మూడో టెస్టు తొలి రోజు మాత్రం రెచ్చిపోయారు. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న భారత పేసర్ మహ్మద్ సిరాజ్‌పై (Mohammad Siraj) బాటిల్ విసిరారు. అయితే ఆ బాటిల్ సిరాజ్‌కు తగలలేదు. అయితే కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) బాటిల్ పడటం గమనించాడు. వెంటనే ఆ బాటిల్ తిరిగి వారివైపే విరిరెయ్ అన్నట్లుగా సైగ చేశాడు. దీంతో సిరాజ్ ఆ బాటిల్‌ను తీసి గ్యాలరీ వైపు విసిరాడు. అయినా సరే ఇంగ్లాండ్ అభిమానులు తమ అత్యత్సాహాన్ని ఆపలేదు. తమ చేష్టలతో మహ్మద్ సిరాజ్‌ను విసిగించడం మొదలు పెట్టారు.

    భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో అత్యల్ప స్కోర్‌కు ఆలౌట్ అయిన విషయాన్ని దృష్టిలో పెట్టుకొని స్కోరెంత? అని అడిగారు. మహ్మద్ సిరాజ్ మామూలుగానే హైదారబాదీ స్టైల్‌లో పంచ్‌లు విసురుతుంటాడు. వాళ్లు అడిగిన ప్రశ్నకు చిర్రెత్తుకొచ్చి 1-0 అంటూ చేతులతో సైగలు చేసి చూపించాడు. అంటే సిరీస్‌లో మీరు ఇంకా గెలవలేదు.. మేము 1-0తో ఆధిపత్యంలో ఉన్నాము అంటూ సిరాజ్ సైగలు చేశాడు. టీవీ ప్రత్యక్ష ప్రసారంలో సిరాజ్ చూపించిన సైగలు కనపించాయి. కామెంటేటర్లు కూడా సిరాజ్ సైగలకు నవ్వుకున్నారు. తనను ఇంగ్లాండ్ అభిమానులు పంచ్‌లతో విసిగిస్తుంటే.. వాళ్లకే రివర్స్ పంచ్ ఇచ్చి షభాష్ అని అనిపించుకున్నాడు.





    కాగా, ఈ పర్యటనలో భారత ఆటగాళ్లపై ఇంగ్లాండ్ అభిమానులు తరచూ తమ చేష్టలతో ఇబ్బంది పెడుతున్నారు. రెండో టెస్టు సందర్భంగా కొంత మంది కేఎల్ రాహుల్‌పై బీర్ బాటిల్ మూతలు విసిరారు. దానిపై కేఎల్ రాహుల్ మ్యాచ్ అఫీషియల్స్‌కు పిర్యాదు చేయకుండా వదిలేశాడు. ఇదే అదనుగా తీసుకొని ఇప్పుడు లీడ్స్‌లో సిరాజ్‌పై అనుచితంగా ప్రవర్తించారు. అతని పైకి అభిమానుల్లో ఒకరు బంతి కూడా విసిరారు. అయితే మ్యాచ్ అనంతరం వికెట్ కీపర్ రిషబ్ పంత్ మాట్లాడుతూ.. మేం ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఇంగ్లాండ్ అభిమానులు ఇబ్బంది పెట్టారు. సిరాజ్‌పై బంతి విసిరారు. ఆ సమయంలో కోహ్లీ కూడా చాలా బాధపడ్డాడు. ఎవరైనా ఏమైనా అనాలనుకుంటే కామెంట్లు చేయండి. అంతే కాని ఫీల్డర్లపైకి బంతులు, బాటిల్స్ విసరడం ఏంటని పంత్ ప్రశ్నించాడు. మహ్మద్ సిరాజ్‌పై కావాలనే జాతి వివక్ష పూర్వకంగా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని పంత్ చెప్పుకొచ్చాడు. కాగా.. మూడో టెస్టు ప్రారంభానికి ముందు ఇంగ్లాండ్ క్రికెటర్లు జాతి వివక్షకు వ్యతిరేకంగా టీషర్ట్స్ ధరించడం గమనార్హం.

    England Cricketers: ఇంగ్లాండ్ క్రికెటర్లు నల్లని టీషర్ట్స్ ఎందుకు ధరించారు? దాని వెనుక ప్రత్యేక కారణం ఉందా?

    Published by:John Naveen Kora
    First published: