Home /News /sports /

ENGLANDS NEW TEST CAPTAIN BEN STOKES HAMMERED A 64 BALL CENTURY FOR DURHAM AGAINST WORCESTERSHIRE IN A COUNTY CHAMPIONSHIP MATCH WATCH VIDEO SRD

Viral Video : బాబు స్టోక్స్ అది ఐపీఎల్ కాదు.. ఇదెక్కడి విధ్వంసం.. పాపం, 18 ఏళ్ల కుర్రాడు బిత్తరపోయాడు..

Photo Credit : IPL Twitter

Photo Credit : IPL Twitter

Viral Video : ఇంగ్లండ్ స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ఐపీఎల్ కి దూరమైనా.. తన విధ్వసంకర బ్యాటింగ్ ను మాత్రం ఆపలేదు. కౌంటీ క్రికెట్ లో పరుగుల సునామీ సృష్టించాడు.

    క్రికెట్ అంటేనే ఓ అద్భుతం అంటారు.. అందులోనూ ధనాధన్ ఫార్మట్ టీ20 వచ్చాక ఆట ఇంకాస్త అదుర్స్ అనిపిస్తోంది. అభిమానులను ఫుల్ మీల్స్ లాంటి విందు అందిస్తోంది. ఆటగాళ్లు ఫార్మాట్ తో సంబంధం లేకుండా రెచ్చిపోతున్నారు. టెస్టు క్రికెట్ లోనూ మెరుపులు మెరిపిస్తున్నారు. లేటెస్ట్ గా ఇంగ్లండ్ స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ (Ben Stokes) కౌంటీ క్రికెట్ లో తన సునామీ ఇన్నింగ్స్ తో సరికొత్త రికార్డులు క్రియేట్ చేశాడు. ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్సీ అందుకున్న జోష్ లో కౌంటీ క్రికెట్ లో రెచ్చిపోయాడు. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 64 బంతుల్లోనే సెంచరీ నమోదు చేశాడు. డర్హౌమ్ (Durham) కౌంటీకి ఆడుతున్న బెన్ స్టోక్స్.. వోర్సెస్టర్‌షైర్ (Worcestershire ) మీద తన బ్యాటింగ్ తో విరుచుకుపడ్డాడు. అతని సునామీ ఇన్నింగ్స్ లో ఒకే ఓవర్ లో 34 పరుగులు చేయడం విశేషం. స్టోక్స్ వీరవిహారంతో డర్హమ్ ఆరు వికెట్ల నష్టానికి 580 పరుగుల భారీ స్కోరు వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.

    బెన్ స్టోక్స్ ఈ ఇన్నింగ్స్ లో కేవలం 88 బంతుల్లోనే 161 పరుగులు చేశాడు. తన ఇన్నింగ్స్ లో ఏకంగా 17 సిక్సర్లు ఉండటం విశేషం. దీంతో.. కౌంటీ క్రికెట్ లో చరిత్ర సృష్టించాడు. కౌంటీ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్సర్లు (17) బాదిన ఆటగాడిగా రికార్డు క్రియేట్ చేశాడు ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్.

    ఇది కూడా చదవండి : ముంబైతో మ్యాచ్ అంటే మిగతా జట్లకు తడిసిపోతుంది ఇక్కడ.. మ్యాటర్ ఏంటంటే..

    ఇక, డర్హమ్ క్రికెట్ క్లబ్ లో ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. ఇక.. 59 బంతుల్లో 70 పరుగుల వద్ద ఉన్నప్పుడు.. 18 ఏళ్ల జోష్ బేకర్ వేసిన ఓవర్ లో విధ్వంసం సృష్టించాడు. ఆ ఓవర్ లో 6, 6, 6, 6, 6, 4.. వరుసగా బాదిన స్టోక్స్ 64 బంతుల్లోనే తన సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ ఓవర్ లో ఏకంగా 34 పరుగులు పిండుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.


    ఇక, గత నెలలో ఇంగ్లండ్‌ టెస్టు కెప్టెన్‌గా బెన్‌ స్టోక్స్‌ ఎంపికైన సంగతి తెలిసిందే. స్టోక్స్‌ ఇంగ్లండ్‌ టెస్టు జట్టుకు 81వ కెప్టెన్‌. ఇక వరుస పరాజయాల నేపథ్యంలో విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఇంగ్లం‍డ్‌ టెస్టు కెప్టెన్సీకు జో రూట్‌ గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో.. ఈ స్టార్ ఆల్ రౌండర్ పై నమ్మకముంచిన ఈసీబీ అతనికి సారథ్య బాధ్యతల్ని అప్పగించింది.ఇక స్టోక్స్ 2013లో టెస్టుల్లో అరంగేట్రంచేశాడు. ఇప్పటి వరకు 73 టెస్టులో ఇం‍గ్లండ్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2017లో ఇంగ్లండ్‌ టెస్టు జట్టుకు వైస్ కెప్టెన్‌గా స్టోక్స్ ఎంపికయ్యాడు. ఇప్పటి వరకు 73 టెస్టులు ఆడిన స్టోక్స్ 5,061 పరుగలతో పాటు.. 174 వికెట్లు పడగొట్టాడు.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Cricket, England, Sports, Viral Video

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు