లీడ్స్‌లోని హెడింగ్లే స్టేడియంలో జరుగుతున్న మూడో టెస్టులో (India Vs England) భారత జట్టు (Team India) ఇన్నింగ్స్ 78 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌పై (England) ఘోరంగా ఓడిపోయింది. ఐదు టెస్టుల సిరీస్‌లో ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. 215/2 ఓవర్ నైట్ స్కోర్‌తో నాలుగో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు ఒక్క సెషన్‌లోనే మిగిలిన 8 వికెట్లు కోల్పోయింది. మూడో రోజు చివరి సెషన్‌లో క్రీజులో పాతుకొని పోయి గొప్ప బ్యాటింగ్ ప్రదర్శన చేసిన పుజార.. నాలుగో రోజు తొలి ఓవర్‌లోనే పెవీలియన్ చేరాడు. ఒవర్ నైట్ స్కోర్‌కు ఒక్క పరుగులు కూడా జత చేయకుండా చతేశ్వర్ పుజార (91) (Chateswar Pujara) ఓలి రాబిన్‌సన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ రూపంలో అవుటయ్యాడు. ఇక కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli), అజింక్య రహానే (Ajinkya Rahane) జట్టును ఆదుకుంటారని అందరూ భావించారు. అయితే అర్ద సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత విరాట్ కోహ్లీ (55) ఓలీ రాబిన్‌సన్ (Ollie Robinson) బౌలింగ్‌లో జో రూట్‌కు క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరాడు. ఆ తర్వాత రెండు పరుగులకే అజింక్య రహానే (10) అండర్సన్ బౌలింగ్‌లో జాస్ బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. అదే స్కోర్ వద్ద రిషబ్ పంత్ (1) ఓలీ రాబిన్‌సన్ బౌలింగ్‌లో క్రెయిగ్ ఓవర్టన్‌కు క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరాడు. చివర్లో రవీంద్ర జడేజా (30) కాస్త దూకుడుగా ఆడాడు. కేవలం 25 బంతుల్లోనే 1 సిక్స్, 5 ఫోర్ల సాయంతో 30 పరుగులు జోడించాడు. కానీ అతడికి తోడుగా ఎవరూ నిలవలేదు. మహ్మద్ షమి (6) మొయిన్ అలీ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. ఇషాంత్ శర్మ (2) ఓలీ రాబిన్ సన్ బౌలింగ్‌లో జాస్ బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరాడు. జోరు మీద ఉన్న రవీంద్ర జడేజా (30) ఓలీ రాబిన్‌సన్ బౌలింగ్‌లోనే జాస్ బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అదే స్కోర్ వద్ద మహ్మద్ సిరాజ్ (0) క్రెయిగ్ ఓవర్టన్ బౌలింగ్‌లో జానీ బెయిర్ స్టోకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దీంతో భారత జట్టు 278 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
ఇంగ్లాంగ్ బౌలర్లు పిచ్ పరిస్థితికి తగ్గట్లుగా బంతులు విసురుతూ భారత జట్టు బ్యాటింగ్ లైనప్‌ను కుప్ప కూల్చారు. నాలుగో రోజు కేవలం 19.3 ఓవర్ల పాటు మాత్రమే బ్యాటింగ్ చేసి మిగిలిన 8 వికెట్లు కోల్పోవడం గమనార్హం. భారత జట్టు నాలుగో రోజు 63 పరుగులు మాత్రమే జత చేసింది. కోహ్లీ నుంచి సిరాజ్ వరకు కేవలం 54 నిమిషాల్లో పెవీలియన్ చేరిపోయారంటే భారత జట్టు ఎంత దారుణంగా బ్యాటింగ్ చేసిందో అర్దం చేసుకోవచ్చు. నిన్న చివరి సెషన్ తప్ప భారత జట్టు ఈ మ్యాచ్‌లో ఏ సెషన్ లోనూ ఆధిపత్యం కనపర్చలేక పోయింది. లీడ్స్ టెస్టు ఓటమితో ఐదు మ్యాచ్‌ల సిరీస్ 1-1తో సమంగా మారింది. కీలకమైన నాలుగో టెస్టు సెప్టెంబర్ 2 నుంచి 6 వరకు ఓవల్ వేదికగా జరుగనున్నది.ఈ మ్యాచ్‌లో మొత్తం 7 వికెట్లు తీసిన ఓలీ రాబిన్‌సన్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
The winning moment!! ?https://t.co/UakxjzUrcE
??????? #ENGvIND ?? pic.twitter.com/zHsifDHw7q
— England Cricket (@englandcricket) August 28, 2021
Ollie Robinson ➕ Test Cricket ➡️ ?
Highlights: https://t.co/oUyPxbthME
??????? #ENGvIND ?? pic.twitter.com/wybpdlnJsT
— England Cricket (@englandcricket) August 28, 2021
స్కోర్ బోర్డు:
ఇండియా తొలి ఇన్నింగ్స్ 78 ఆలౌట్
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ 432 ఆలౌట్
ఇండియా రెండో ఇన్నింగ్స్
రోహిత్ శర్మ (ఎల్బీడబ్ల్యూ)(బి) ఓలీ రాబిన్‌సన్ 59, కేఎల్ రాహుల్ (సి) జానీ బెయిర్‌స్టో (బి) క్రెయిగ్ ఓవర్టన్ 8, చతేశ్వర్ పుజార (ఎల్బీడబ్ల్యూ)(బి) ఓలీ రాబిన్‌సన్ 91, విరాట్ కోహ్లీ (సి) జో రూట్ (బి) ఓలీ రాబిన్‌సన్ 55, అజింక్య రహానే (సి) జాస్ బట్లర్ (బి) జేమ్స్ అండర్సన్ 10, రిషబ్ పంత్ (సి) క్రెయిగ్ ఓవర్టన్ (బి) ఓలీ రాబిన్ సన్ 1, రవీంద్ర జడేజా (సి) జాస్ బట్లర్ (బి) క్రెయిగ్ ఓవర్టన్ 30, మహ్మద్ షమి (బి) మొయిన్ అలీ 6, ఇషాంత్ శర్మ (సి) జాస్ బట్లర్ (బి) ఓలీ రాబిన్ సన్ 2, జస్ప్రిత్ బుమ్రా 1 నాటౌట్, మహ్మద్ సిరాస్ (సి) జానీ బెయిర్‌స్టో (బి) క్రెయిగ్ ఓవర్టన్ 0; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (99.3 ఓవర్లు) 278 ఆలౌట్
వికెట్ల పతనం: 1-34, 2-116, 3-215, 4-237, 5-239, 6-239, 7-254, 8-257, 9-278, 10-278
బౌలింగ్: జేమ్స్ అండర్సన్ (26-11-63-1), ఓలీ రాబిన్‌సన్ (26-6-65-5), క్రెయిగ్ ఓవర్టన్ (18.3-6-47-3), సామ్ కర్రన్ (9-1-40-0), మొయిన్ అలీ (14-1-40-1), జో రూట్ (6-1-15-0)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, India vs england, Team India, Test Cricket