ENGvIND : ఏకైక టెస్ట్ మ్యాచ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్.. చరిత్ర సృష్టించిన సోఫియా..!

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ మహిళా జట్టు

ఏడేళ్ల తర్వాత ఇండియా, ఇంగ్లాండ్ మహిళా జట్లు తొలి సారిగా టెస్టు మ్యాచ్ ఆడుతున్నాయి. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకున్నది. భారత్ తరపున ఐదుగురు టెస్టుల్లో అరంగేట్రం చేస్తున్నారు.

  • Share this:
    ఇంగ్లాండ్‌లోని బ్రిస్టల్ కౌంటీ గ్రౌండ్‌లో ఇండియా, ఇంగ్లాండ్ మహిళా జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ కాసేపటి క్రితం టాస్ వేశారు. టాస్ గెలిచిన ఆతిథ్య ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకున్నది. 2014 తర్వాత ఈ రెండు జట్లు టెస్ట్ మ్యాచ్ ఆడటం ఇదే తొలిసారి. గతంలో రెండు సార్లు ఇంగ్లాండ్‌తో టెస్టు మ్యాచ్‌లు ఆడిన ఇండియా.. ఆ రెండింటిలో గెలుపొందింది. 2014లో దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరిగిన మ్యాచ్ తర్వాత టీమ్ ఇండియా టెస్టు ఆడటం ఇదే తొలిసారి. టీమ్ ఇండియా తరపున షెఫాలీ వర్మ, దీప్తి శర్మ, పూజ వస్త్రాకర్, తానియా భాటియా, స్నేహ్ రాణా.. ఇంగ్లాండ్ తరపున సోఫియా డంక్లీ టెస్టుల్లోకి అరంగేట్రం చేస్తున్నారు. ఇంగ్లాండ్ మహిళా టెస్టు జట్టులో స్థానం దక్కించుకున్న తొలి నల్లజాతీయురాలిగా సోఫియా డంక్లీ చరిత్ర సృష్టించింది.







    ఇండియా విమెన్:

    స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, పూనమ్ రౌత్, మిథాలీ రాజ్ (కెప్టెన్), హర్మన్ ప్రీత్ కౌర్, దీప్తి శర్మ, స్నేహ్ రాణా, తానియా భాటియా (వికెట్ కీపర్), జులన్ గోస్వామి, పూజా వస్త్రాకర్, శిఖా పాండే

    ఇంగ్లాండ్ విమెన్:

    లారెన్ విన్‌ఫీల్డ్-హిల్, టామీ బ్యూమౌంట్, హీథర్ నైట్ (కెప్టెన్), నతాలీ షివర్, ఆమీ జోన్స్ (వికెట్ కీపర్), సోఫియా డంక్లీ, జార్జియా ఎల్విస్, కేథరిన్ బ్రంట్, అన్యా షర్బ్‌సోల్, సోషియా ఎక్లిస్టోన్, కేట్ క్రాస్







    బ్రిస్టల్ మైదానం తొలి రెండు రోజులు బ్యాటింగ్‌కు సహకరించే అవకాశం ఉన్నది. అందుకే ఇంగ్లాండ్ కెప్టెన్ కేథరిన్ నైట్ ఇండియాకు బౌలింగ్ చేసే అవకాశం ఇచ్చింది. మ్యాచ్‌కు వర్షం అడ్డం పడే అవకాశాలు ఉన్నాయి.
    Published by:John Naveen Kora
    First published: