England vs West Indies: రూట్ సూపర్ సెంచరీ...చిత్తుగా ఓడిన వెస్టిండీస్

లీగ్ మ్యాచ్‌ల్లో భాగంగా శనివారం రెండు మ్యాచ్‌లు జరుగుతాయి. మధ్యాహ్నం 3 గంటలకు ఓవల్ స్టేడియంలో శ్రీలంక, ఆస్ట్రేలియా తలపడనున్నాయి. సాయంత్రం 6గంటలకు సౌతాఫ్రికా, ఆప్ఘనిస్తాన్ మ్యాచ్ జరగనుంది.

news18-telugu
Updated: June 14, 2019, 9:51 PM IST
England vs West Indies: రూట్ సూపర్ సెంచరీ...చిత్తుగా ఓడిన వెస్టిండీస్
రూట్ సూపర్ సెంచరీ...చిత్తుగా ఓడిన వెస్టిండీస్
news18-telugu
Updated: June 14, 2019, 9:51 PM IST
England vs West Indies, ICC Cricket World Cup 2019 Match: సౌతాంప్టన్ వన్డేలో ఇంగ్లీష్ టీమ్ అదరొట్టింది. 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్ జట్టుపై ఘన విజయం సాధించింది. బౌలింగ్, బ్యాటింగ్‌లో అద్భుతంగా రాణించి కరీబియన్ టీమ్‌ని చిత్తుగా ఓడించింది ఇంగ్లండ్. ఇక జో రూట్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 100 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచిన జో రూట్ ఈ టోర్నీలో రెండో సెంచరీ సాధించాడు. అంతకు ముందు పాకిస్తాన్‌ జట్టుపై సెంచరీ చేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో బౌలింగ్‌లోనూ సత్తా చాటాడు రూట్. హెట్‌మెయిర్, హోల్డర్‌ని ఔట్ చేసి రెండు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.

213 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ చాలా ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది. 33.1 ఓవర్లలోనే మ్యాచ్‌ని ఫినిష్ చేసి వెస్టిండీస్‌ జట్టును ఘోరంగా ఓడించింది. జో రూట్ 100 రన్స్‌తో చెలరేగిపోయాడు. బెయిర్‌స్టో 45, వోక్స్ 40 పరుగులతో రాణించారు. ఇంగ్లండ్ జట్టు కోల్పోయిన ఈ రెండు వికెట్లనూ గాబ్రియెల్ పడగొట్టాడు. ఇక టోర్నీలో నాలుగు మ్యాచ్‌లు ఇడిన ఇంగ్లండ్ మూడింట విజయం సాధించిది. 6 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దూసుకెళ్లింది.

అంతకు ముందు బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు 44.4 ఓవర్లలో 212 పరుగులు చేసి ఆలౌటయింది. పూరన్ 63 పరుగులతో రాణించాడు. హెట్‌మెయిర్ 39, క్రిస్ గేల్ 36 పరుగులు చేసి పరవా లేదనిపించారు. రస్సెల్ (16 బంతుల్లో 21 రన్స్) కొద్దిసేపు మెరుపులు మెరిపించినా..ఆ వెంటనే ఔట్ అయ్యాడు. మిగతా బ్యాట్స్‌మెన్ చెప్పుకోదగ్గర స్కోర్ చేయలేదు. ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ వుడ్, జోఫ్రా ఆర్చర్ చెరో మూడు వికెట్లు తీయగా.. జో రూట్ ఇద్దరిని ఔట్ చేశాడు. ఇక ప్లంకెట్, వోక్స్‌కి తలో వికెట్ దక్కింది.

లీగ్ మ్యాచ్‌ల్లో భాగంగా శనివారం రెండు మ్యాచ్‌లు జరుగుతాయి. మధ్యాహ్నం 3 గంటలకు ఓవల్ స్టేడియంలో శ్రీలంక, ఆస్ట్రేలియా తలపడనున్నాయి. సాయంత్రం 6గంటలకు కార్డిఫ్‌లో సౌతాఫ్రికా, ఆప్ఘనిస్తాన్ మ్యాచ్ జరగనుంది. ఇక కోట్లాది మంది క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ ఆదివారం మధ్యాహ్నం జరుగనుంది.

First published: June 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...