మ్యాచ్ చూడాడనికి అక్కడికి వెళ్ళాలని ఉంది: రోహిత్ శర్మ

Rekulapally Saichand
Updated: July 9, 2020, 7:14 PM IST
మ్యాచ్ చూడాడనికి అక్కడికి వెళ్ళాలని ఉంది: రోహిత్ శర్మ
కుల్దీప్ యాదవ్, రోహిత్ శర్మ (BCCI/ Twitter )
  • Share this:
ప్రపంచ వ్యాప్తంగా బుసలు కొడుతున్న కరోనా వైరస్ కారణాంగా దాదాపు నాలుగు నెలల పాటు స్తంభించిపోయిన క్రీడా ఈవెంట్స్ మళ్ళి ప్రారంభమవుతున్నాయి. ముఖ్యంగా మన దేశంలో అమితంగా ఇష్టపడే క్రికెట్ టీవీల ముందు మూగబోవడంతో ఫ్యాన్స్ కొంత నిరుత్సాహానికి  లోనైయ్యారు. తాజాగా ఇంగ్లాండ్‌, వెస్టిండీస్‌ జట్ల మధ్య బయోసెక్యూర్‌ విధానంలో జరుగుతున్న టెస్టుతో కొంత ఊరట చెందుతున్నారు. 117 రోజుల విరామం తర్వాత ప్రారంభమైన ఈ మ్యాచ్‌ని చూసి సంబరపడుతున్నారు.

మళ్ళి క్రికెట్ మ్యాచ్‌‌లు టీవీ తెరల ముందు కదలాడుతుండడంతో మాజీ క్రికెటర్స్, ప్రస్తుత ఆటగాళ్ళ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. క్రికెట్ తిరిగి ప్రారంభమవడంతో సౌరభ్‌గంగూలీ, రవిచంద్రన్‌ అశ్విన్‌‌తో పాటు ఆసీస్ మాజీ క్రికెటర్స్ రికీ పాంటింగ్‌, షేన్‌వార్న్‌ ట్విటర్‌ వేదికగా ఆనందాన్ని వ్యక్తం చేశారు. అలాగే టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ సౌథాంప్టన్‌ మ్యాచ్ తన అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. "క్రికెట్ మళ్ళి మెుదలైంది ఇంగ్లాడ్‌లో పరిస్థితులన్ని సానుకూలంగానే ఉన్నాయి. తిరిగి ఆట ప్రారంభమవ్వడం చూస్తే చాలా ఆనందంగా ఉంది. నాకు కూడా అక్కడి వెళ్ళి ఆ మ్యాచ్ చూడాలనిపిస్తోందన్నారు" రోహిత్.

సౌథాంప్టన్‌ వేదికగా ఇంగ్లాండ్‌, వెస్టిండీస్‌ జట్ల మధ్య జరగుతున్న తొలి టెస్టు ప్రారంభమైన సంగతి తేలిసిందే. బుధవారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌కి వరణుడు అడ్డంకిగా నిలిచాడు. తిరిగి గురువారం మెుదలైన మ్యాచ్‌లో కూడా పదే పదే వర్షం అంతరాయం కలిగించింది. బ్యాటింగ్ చేస్తున్న ఇంగ్లాండ్ జట్టు 40 ఓవర్లలో 5వికెట్ల నష్టానికి 85 పరగులు చేసింది. విండీస్ కెప్టెన్ హోల్డర్ కట్టిదిట్టమైన బౌలింగ్ చేస్తూ ఇంగ్లీష్ జట్టు శాసిస్తు్న్నాడు.
Published by: Rekulapally Saichand
First published: July 9, 2020, 7:14 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading