ఆయన లాంటి అల్‌రౌండర్ టీంలో ఉంటే టీమిండియా ప్రతి చోట గెలిచేది

స్టోక్స్‌పై ఇర్ఫాన్‌ పఠాన్‌ ప్రశంసలు కురిపించాడు. బెన్‌స్టోక్స్‌ లాంటి ఆల్‌రౌండర్‌ టీమిండియాలో ఉంటే ప్రతి చోట విజేతగా మారేది అంటూ ట్వీట్ చేశాడు. దీంతో ఎవరిమీదైనా సైటెర్లు వేసే యువారాజ్ పఠాన్‌కు దిమ్మతిరిగే పంచ్ ఇచ్చాడు. "టీమిండియాలో మ్యాచ్‌లు గెలిపించా గల సత్తా ఉన్న ఆల్‌రౌండర్‌ లేడాని నీ అర్ధమా" అంటూ ప్రశ్నించాడు.

Rekulapally Saichand
Updated: July 23, 2020, 11:38 AM IST
ఆయన లాంటి అల్‌రౌండర్ టీంలో ఉంటే టీమిండియా ప్రతి చోట గెలిచేది
ఇంగ్లండ్ క్రికెట్ టీమ్ (Image:Cricket World Cup/Twitter)
  • Share this:
ఓ వ్యక్తిని ప్రశసించడంలో ఓ పరిమితి అనేది ఉంటుంది. అంతేకానీ అతిచేస్తూ అనవసరపు పోగడ్తలతో ముంచెత్తడం కొన్ని చిక్కుల్లో పడెస్తోంది.
తాజాగా టీమ్‌ఇండియా మాజీ పేసర్‌ ఇర్ఫాన్‌ పఠాన్ ఇలానే ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌ను ప్రశంసిస్తూ చిక్కుల్లోనే పడ్డాడు. ఇంతకి ఆయనను ఇబ్బందులకు గురిచేసిన మ్యాటర్ ఏంటో ఓసారి చూద్దాం...

విండీస్,ఇంగ్లాండ్ మధ్య జరిగిన రెండో టెస్ట్‌లో ఇంగ్లీష్ జట్టు అద్భుతమైన విజయాన్ని సాధించింది. మూడు టెస్ట్‌ల సిరీస్‌లో మొదటి టెస్టులో వెస్టిండీస్‌ గెలవగా రెండో టెస్ట్‌లో ఇంగ్లాండ్ గెలవాల్సిన తప్పని పరిస్థితిలో స్టోక్స్‌ అద్భుత ఆటతీరును కనబరిచి జట్టును గెలిపించాడు. వన్ మ్యాన్ షోతో బ్యా్టింగ్‌ ఇటు బౌలింగ్‌లో తన ప్రతాపం చూపించాడు. దీంతో అతనిపై అందరూ ప్రశసంలజల్లు కురిపిస్తున్నారు. అద్భుతంగా ఆడిన స్టోక్స్‌పై ఇర్ఫాన్‌ పఠాన్‌ ప్రశంసలు కురిపించాడు.
"బెన్‌స్టోక్స్‌ లాంటి ఆల్‌రౌండర్‌ టీమిండియాలో ఉంటే భారత్  ప్రతి చోట విజేతగా మారేది అంటూ ట్వీట్ చేశాడు. దీంతో ఎవరిమీదైనా సైటెర్లు వేసే యువారాజ్ పఠాన్‌కు దిమ్మతిరిగే పంచ్ ఇచ్చాడు. "టీమిండియాలో మ్యాచ్‌లు గెలిపించా గల సత్తా ఉన్న ఆల్‌రౌండర్‌ లేడాని నీ అర్ధమా" అంటూ ప్రశ్నించాడు.

దీంతో ఇర్ఫాన్ పఠాన్‌ కూడా యువరాజ్ దీటైనా సమాధానం ఇచ్చారు. " బ్రదర్.. యువరాజ్ ఎప్పుడో వీడ్కోలు పలికాడు" అంటూ చమత్కారించాడు. దానికి కూడా యువీ హస్యభరితమైన సమాధానం ఇచ్చాడు. ఇలాంటి జవాబు నీ నుంచి వస్తోందని నాకు తెలుసు.. నీవు కూడా తక్కువేమి కాదు"అని బదులిచ్చాడు. ప్రస్తుతం వీరి హస్యభరితమైన సంభాషణ సామాజీక మాధ్యమాలలో వైరల్ అవుతోంది.
Published by: Rekulapally Saichand
First published: July 23, 2020, 11:38 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading