కరోనా కరాళ నృత్యంతో క్రీడారంగం చిన్నభిన్నంమైంది. పేక్షాకులు లేక స్టేడియాలన్ని మూగబోయాయి. ఆటగాళ్ళు ఆట నుంచి దూరమయ్యారు.
ఈవెంట్స్ అన్ని వాయిదా పడ్డాయి. ముఖ్యంగా అంతర్జాతీయ క్రికెట్‌పై కరోనా ప్రభావం ఎక్కువగా పడింది. దాదాపు నాలుగు నెలల పాటు
క్రికెట్ ఈవెంట్స్ వాయిదా పడుతునే ఉన్నాయి. అభిమానులకు ఊరట కలిగించేలా బుధవారం ఇంగ్లాండ్, వెస్టిండీస్ టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్ మెుదలైంది.
ఐసీసీ కొత్త నిబంధనాలు
కరోనా ప్రభావం కారణంగా కొత్త నిబంధనాలను అమల్లోకి తెచ్చింది ఐసీసీ. గతంలో మాదిరి వికెట్ పడితే విభిన్నంగా సంబురాలు,సెంచరీలు బాదగానే అభినందించుకోవడం, అప్పటిలాగే డ్రెసింగ్ రూంలో ఒక్కరి పక్కన మరొక్కరు కూర్చొవడం, బంతిపై మెరుపు కోసం వాడే ఉమ్మడం ఇక కుదరదు. పలు పాత రూల్స్‌పై ఐసీసీ నిషేధం విధించింది.
We will bat first here in Southampton! 🏴🏏#ENGvWI
ఇంగ్లాండ్, వెస్టిండీస్ మధ్య జరగాల్సిన తొలి టెస్టుకు వర్షం అంతరాయం కలిగించింది. . మెుదటిలో చిరుజల్లులు కురిసిన ఆ తర్వాత భారీ వర్షం పడింది. దీంతో టాస్ పడకుండానే ఇరు జట్ల ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లారు. కొద్ది రోజులుగా సౌతాంప్టన్‌లో వాతావరణం చల్లగా ఉంది. మ్యాచ్ ప్రారంభానికి ముందు వర్షం పడడంతో చాలా రోజుల తర్వాత ఆటను తిలకిద్దాం అనుకున్నా అభిమానులకు నిరాశే మిగిలింది. తర్వాత వరణుడు శాంతించడంతో ఎంఫైర్ల్ ఇరువురు కెప్టెన్స్‌ను టాస్కు అహ్వనించారు. ఇంగ్లాడ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
Published by:Vijay Bhaskar Harijana
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.