హోమ్ /వార్తలు /క్రీడలు /

SL VS ENG : స్టోక్స్ పోరాటం వృధా.. 20 పరుగులతో శ్రీలంక గెలుపు

SL VS ENG : స్టోక్స్ పోరాటం వృధా.. 20 పరుగులతో శ్రీలంక గెలుపు

‘ది ఐలాండ్’ రిపోర్ట్ ప్రకారం కొద్దిరోజుల క్రితం ఈ టూర్‌కు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భారత ప్రభుత్వం ఓకే చెప్పిన తరువాతే ఇందుకు బీసీసీఐ అనుమతి ఇచ్చినట్టు సమాచారం.

‘ది ఐలాండ్’ రిపోర్ట్ ప్రకారం కొద్దిరోజుల క్రితం ఈ టూర్‌కు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భారత ప్రభుత్వం ఓకే చెప్పిన తరువాతే ఇందుకు బీసీసీఐ అనుమతి ఇచ్చినట్టు సమాచారం.

ICC World Cup 2019 | ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ బెన్ స్టోక్స్ చేసిన పోరాటం వృధా అయింది.

ICC World Cup 2019: వరల్డ్ కప్‌లో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టుకు శ్రీలంక షాక్ ఇచ్చింది. 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. లీడ్స్‌లోని హెడింగ్లేలో జరుగుతున్న మ్యాచ్‌లో కేవలం 232 పరుగుల స్వల్ప స్కోర్ మాత్రమే చేసిన శ్రీలంక జట్టు.. 212 పరుగులకే ఇంగ్లండ్‌ను ఆలౌట్ చేసింది. శ్రీలంక బౌలర్లు లసిత్ మలింగ, ధనంజయ డిసెల్వ భయంకర బౌలింగ్‌కు బ్రిటిష్ బ్యాట్స్‌మెన్ పెవిలియన్ బాట పట్టారు. మలింగ నాలుగు వికెట్లు తీశాడు. ధనంజయ డిసెల్వ మూడు వికెట్లు పడగొట్టాడు. 233 పరుగుల లక్ష్య ఛేదనతో రంగంలోకి దిగిన ఇంగ్లండ్‌కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. బెయిర్ స్కోక్ డకౌట్ అయ్యాడు. జోరూట్ (57), బెన్ స్టోక్స్ (82 ), పరుగులు చేసినా.. ఇంగ్లండ్‌ను ఓటమి నుంచి బయటపడేయలేకపోయారు. మిగిలిన బ్యాట్స్‌మెన్ స్వల్ప స్కోర్‌కే ఔటయ్యారు.

క్రికెట్ అభిమానులకు ఈ మ్యాచ్ ఒక అద్భుత అనుభూతిని కల్పించింది. వరల్డ్ కప్‌లో 300కు పైగా స్కోర్‌ను అవలీలగా ఛేదించిన ఇంగ్లండ్ జట్టు 232 పరుగుల లక్ష్యాన్ని ఈజీగా కొట్టేస్తారని అంతా భావించారు. అయితే, శ్రీలంక బౌలర్ల ధాటికి బ్రిటిష్ బ్యాట్స్‌మెన్ చాప చుట్టేశారు. అయితే, కేవలం బెన్ స్టోక్స్ ఒక్కడే వీరోచిత పోరాటం చేశాడు. ఓడిపోతుందనుకున్న మ్యాచ్‌ను ఇంగ్లండ్ గెలుస్తుందేమో అనుకునేలా చేశాడు. పదకొండో ఆటగాడిగా వచ్చిన ఉడ్స్‌కు స్ట్రైకింగ్ ఇస్తే ఔట్ అయ్యే ప్రమాదం ఉందని ఊహించి.. చాలా జాగ్రత్తగా ఆడాడు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. 89 బంతుల్లో 82 పరుగులు  చేశాడు. అయితే, 47వ ఐదో బంతికి సింగల్ తీయడమే స్టోక్స్ చేసిన తప్పు అయింది. ఓవర్లో చివరి బాల్ ఆడిన మార్క్ ఉడ్ డకౌట్ అయ్యాడు. దీంతో శ్రీలంక విజయం సాధించింది.

అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక పరుగులు చేయడానికి చాలా కష్టపడింది. ఓపెనర్లు కరుణరత్నె, పెరారా తీవ్రంగా నిరాశపరిచారు. మాథ్యూస్ (85 నాటౌట్), ఫెర్నాండో (49), మెండిస్ (46), ధనంజయ డిసెల్వ (29) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. మిగిలిన వారు సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యారు.

First published:

Tags: Cricket, England, ICC Cricket World Cup 2019, Sri Lanka

ఉత్తమ కథలు