news18-telugu
Updated: July 3, 2019, 7:29 PM IST
ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ జాసన్ రాయ్
వరల్డ్ కప్‌లో భాగంగా ఇంగ్లాండ్-న్యూజిలాండ్ జట్ల మధ్య చెస్టర్ లీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో బ్రిటీష్ జట్టు 8 వికెట్ల నష్టానికి 305 పరుగులు చేసింది. ఓపెనర్లు జాసన్ రాయ్60(61), జానీ బెయిర్‌స్టో(106) పరుగులతో జట్టుకు మంచి శుభారంభాన్ని అందించారు. అయితే ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్లలో ఒక్కరు కూడా ఎక్కువసేపు క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. కెప్టెన్ మోర్గాన్ ఒక్కడే 42 పరుగులతో చెప్పుకోదగ్గ స్కోరు సాధించాడు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో ఇంగ్లాండ్ 305 పరుగులు సాధించింది. న్యూజిలాండ్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, హెన్రీ,జేమ్స్ నీషం రెండేసి వికెట్లు తీశారు. కాగా, ఇంగ్లాండ్-న్యూజిలాండ్‌లకు ఇదే చివరి లీగ్ మ్యాచ్ కావడంతో గెలుపే లక్ష్యంగా రెండు జట్లు బరిలో దిగాయి. ఈ మ్యాచ్‌లో గెలిచే జట్టు నేరుగా సెమీస్‌కు చేరుకుంటుంది. ఒకవేళ ఓడిపోతే మాత్రం మిగతా జట్ల గెలుపోటములపై ఆ జట్టు సెమీస్ అవకాశాలు ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలన్న కసితో రెండు జట్లు తలపడుతున్నాయి.
Published by:
Srinivas Mittapalli
First published:
July 3, 2019, 7:29 PM IST