England vs New Zealand Live Score, ICC World Cup 2019 Final at Lords: లార్డ్స్ వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో, తొలుత బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ నిలకడగా బ్యాటింగ్ చేస్తోంది. న్యూజిలాండ్ 24 ఓవర్లకు గానూ రెండు వికెట్లు కోల్పోయి 106 పరుగులు చేసింది. ఓపెనర్ హెన్రీ నికోలస్ నిలకడగా ఆడుతూ హాఫ్ సెంచరీ దిశగా కదులుతున్నాడు. వేగంగా పరుగులు సాధించే క్రమంలో 103 పరుగుల వద్ద కెప్టెన్ విలియమ్సన్ సైతం ఔట్ కావడం గమనార్హం.
ఇదిలాఉంటే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కు ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే రెండు జట్లలో ఎవరు వరల్డ్ కప్ గెలిచినా తొలిసారి టోర్నీ గెలిచిన వారు అవుతారు. ఇంగ్లాండ్ ఇప్పటికే 1979, 1987, 1992 వరల్డ్ కప్ ఫైనల్స్‌లో కప్ గెలుచుకునే అవకాశాన్ని చేజార్చుకోగా, న్యూజిలాండ్ 2015లో తొలిసారి వరల్డ్ కప్ ఫైనల్ లో ఆస్ట్రేలియాతో తలపడి కప్ గెలుచుకునే అవకాశాన్ని చేజార్చుకుంది. ఇప్పటికే 11 సార్లు వరల్డ్ కప్ టోర్నీ నిర్వహించగా, ఆస్ట్రేలియా అత్యధికంగా 5 సార్లు వరల్డ్ కప్ గెలుచుకుంది. అలాగే భారత్, వెస్టిండీస్ లు చెరో రెండు సార్లు టోర్నీ గెలుచుకోగా, శ్రీలంక, పాకిస్థాన్ లు ఒక సారి చొప్పున వరల్డ్ కప్ ను తమ ఖాతాలో వేసుకున్నాయి.
HUGE APPEAL!
The umpire is unmoved, but England are convinced... and UltraEdge shows a spike!#KaneWilliamson has to go. Massive moment!#CWC19Final | #CWC19 pic.twitter.com/yZHxCluOit
— Cricket World Cup (@cricketworldcup) July 14, 2019
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket World Cup 2019, ICC, ICC Cricket World Cup 2019