England vs New Zealand | ఇంగ్లాండ్ లక్ష్యం 242 రన్స్...వికెట్లు పడుతున్న నిలబడిన కివీస్

England vs New Zealand Live Score, ICC World Cup 2019 Final at Lords: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ పరుగుల సాధనలో తడబడింది. వరుసగా వికెట్లు పడటంతో పాటు భారీ భాగస్వామ్యాలు నెలకొల్పడంలో కివీస్ బ్యాట్స్ మెన్ ఫెయిలయ్యారనే చెప్పవచ్చు.

news18-telugu
Updated: July 14, 2019, 8:10 PM IST
England vs New Zealand | ఇంగ్లాండ్ లక్ష్యం 242 రన్స్...వికెట్లు పడుతున్న నిలబడిన కివీస్
Image : Twitter
news18-telugu
Updated: July 14, 2019, 8:10 PM IST
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ పరుగుల సాధనలో తడబడింది. వరుసగా వికెట్లు పడటంతో పాటు భారీ భాగస్వామ్యాలు నెలకొల్పడంలో కివీస్ బ్యాట్స్ మెన్ ఫెయిలయ్యారనే చెప్పవచ్చు. నిర్ణీత 50 ఓవర్లలో ఇంగ్లాండ్ 241/8 స్కోరు సాధించడం విశేషం. కివీస్ ఓపెనర్లు మార్టిన్ గుప్తిల్, హెన్రీ నికోలస్ నిలకడగా ఇన్నింగ్స్ ప్రారంభించినప్పటికీ 6వ ఓవర్లో గుప్తిల్ ఔటయ్యాడు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన కెప్టెన్ కేన్ విలియమ్సన్ 30 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు. ఈ క్రమంలోనే హాఫ్ సెంచరీ సాధించిన హెన్రీ నికోలస్ (55) వేగంగా పరుగులు చేసే క్రమంలో ఔటయ్యాడు. అనంతరం రాస్ టైలర్ సైతం (15) స్వల్ప పరుగులకే ఔటయ్యాడు. అనంతరం వచ్చిన టామ్ లాథమ్ వికెట్లపై కుదురుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే న్యూజిలాండ్ స్కోరు 200 దాటింది.

ఇదిలాఉంటే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కు ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే రెండు జట్లలో ఎవరు వరల్డ్ కప్ గెలిచినా తొలిసారి టోర్నీ గెలిచిన వారు అవుతారు. ఇంగ్లాండ్ ఇప్పటికే 1979, 1987, 1992 వరల్డ్ కప్ ఫైనల్స్‌లో కప్ గెలుచుకునే అవకాశాన్ని చేజార్చుకోగా, న్యూజిలాండ్ 2015లో తొలిసారి వరల్డ్ కప్ ఫైనల్ లో ఆస్ట్రేలియాతో తలపడి కప్ గెలుచుకునే అవకాశాన్ని చేజార్చుకుంది. ఇప్పటికే 11 సార్లు వరల్డ్ కప్ టోర్నీ నిర్వహించగా, ఆస్ట్రేలియా అత్యధికంగా 5 సార్లు వరల్డ్ కప్ గెలుచుకుంది. అలాగే భారత్, వెస్టిండీస్ లు చెరో రెండు సార్లు టోర్నీ గెలుచుకోగా, శ్రీలంక, పాకిస్థాన్ లు ఒక సారి చొప్పున వరల్డ్ కప్ ను తమ ఖాతాలో వేసుకున్నాయి.

First published: July 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...