England VS Australia : వరల్డ్ కప్ థ్రిల్లర్...సమరానికి సై అంటున్న ఇంగ్లాండ్, ఆసీస్...

ICC World Cup 2019 | ఇప్పటికే వరల్డ్ కప్ లో ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ పూర్తవ్వగా, దాదాపు అదే స్థాయిలో ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. చిరకాల ప్రత్యర్థులుగా తలపడుతున్న ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలు ప్రపంచకప్ లో కూడా తలపడుతున్న నేపథ్యంలో ఈ మ్యాచ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.

news18-telugu
Updated: June 24, 2019, 8:24 PM IST
England VS Australia : వరల్డ్ కప్ థ్రిల్లర్...సమరానికి సై అంటున్న ఇంగ్లాండ్, ఆసీస్...
ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్
  • Share this:
ఆతిథ్య ఇంగ్లాండ్, డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ కప్ టోర్నీలో మరో ఆసక్తికరమైన పోరుకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే వరల్డ్ కప్ లో ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ పూర్తవ్వగా, దాదాపు అదే స్థాయిలో ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. చిరకాల ప్రత్యర్థులుగా తలపడుతున్న ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలు ప్రపంచకప్ లో కూడా తలపడుతున్న నేపథ్యంలో ఈ మ్యాచ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ఒక వైపు ఆస్ట్రేలియా డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగుతుండగా, ఇంగ్లాండ్ మాత్రం స్థానబలాన్నే నమ్ముకొని సిద్ధమవుతోంది. ముఖ్యంగా ఇంగ్లాండ్‌కు ఈ టోర్నీలో మొత్తం 6 మ్యాచుల్లో 4 మ్యాచుల్లో గెలవగా, రెండు మ్యాచుల్లో ఇంగ్లాండ్ పరాజయం పాలైంది. దీంతో ఇంగ్లాండ్ సెమీస్ చేరాలంటే మిగిలినా మూడు మ్యాచుల్లో తప్పనిసరిగా రెండు మ్యాచులు గెలవాల్సి ఉంటుంది. కాగా ఇంగ్లాండ్ లీగ్ దశలో మిగిలిన మూడు మ్యాచులు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, భారత్ తో ఆడాల్సి ఉంది. ఈ మూడు టీమ్‌లపై గెలవడం ఇంగ్లాండ్‌కు ఆషామాషీ విషయం కాదని గుర్తించాల్సిందే. ఎందుకంటే ఇప్పటి వరకూ ఇంగ్లాండ్ గెలిచిన నాలుగు మ్యాచుల్లో గట్టిగా పోటీ ఇచ్చే జట్లేవీ తగల్లేవు. అయితే పాకిస్థాన్, శ్రీలంకలు గట్టి పోటీ ఇవ్వగానే ఇంగ్లీష్ క్రికెటర్లు చేతులేత్తేయడం గమనార్హం.

ఇదిలా ఉంటే డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా మాత్రం వరల్డ్ కప్‌లో ఆరు మ్యాచుల్లో 5 మ్యాచులు గెలిచి సెమీస్ మార్గం సుగమం చేసుకుంది. ఆసీస్ బ్యాట్స్ మెన్లలో డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్‌ ఇద్దరూ ఫామ్‌లోకి రావడంతో పాటు, డేవిడ్ వార్నర్ టోర్నీలో ఇప్పటి వరకూ 447 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. అలాగే అటు కెప్టెన్ ఆరోన్ ఫించ్ కూడా ఫామ్ లోకి రావడంతో ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా కనిపిస్తోంది. దీంతో పాటు 2015 వరల్డ్ కప్ టోర్నీలో ఇంగ్లాండ్ పై ఆస్ట్రేలియా 135 పరుగుల విజయం సాధించింది. అయితే ఈ సారి ఎలాగైనా ఆస్ట్రేలియాపై విజయం సాధించి సెమీస్‌కు మార్గం సుగమం చేసుకోవాలని ఇంగ్లాండ్ ప్రయత్నిస్తోంది. అయితే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇంగ్లాండ్ అటు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పటిష్టంగా ఉన్న నేపథ్యంలో ఆస్ట్రేలియాపై ఆధిపత్యం చేయాలని ప్రయత్నించే అవకాశం లేకపోలేదు. అయితే ఆస్ట్రేలియా కూడా అంతే స్థాయిలో పటిష్టంగా ఉండటంతో మంగళవారం మ్యాచ్ థ్రిల్లింగ్‌గా సాగే అవకాశం ఉంది.


Published by: Krishna Adithya
First published: June 24, 2019, 8:21 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading