England Vs Australia | స్మిత్ ఒంటరి పోరు...ఇంగ్లాండ్ టార్గెట్ 224 రన్స్

England Vs Australia Live Score, World Cup 2019 Semi-Final Match at Birmingham: ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న సెమీ ఫైనల్ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49 ఓవర్లకు 223 పరుగులకు ఆలౌటైంది.

news18-telugu
Updated: July 11, 2019, 6:44 PM IST
England Vs Australia | స్మిత్ ఒంటరి పోరు...ఇంగ్లాండ్ టార్గెట్ 224 రన్స్
(Image : twitter)
news18-telugu
Updated: July 11, 2019, 6:44 PM IST
England Vs Australia Live Score, World Cup 2019 Semi-Final Match at Birmingham:  ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న సెమీ ఫైనల్ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49 ఓవర్లకు 223 పరుగులకు ఆలౌటైంది. ఇదిలా ఉంటే ఆస్ట్రేలియా తొలి ఆరు ఓవర్లకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. తొలి బంతికే ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్(0) పరుగులేమి చేయకుండా ఔటవ్వడంతో ఆసీస్ కు మొదటి షాక్ తగిలింది. ఆ తర్వాత 3వ ఓవర్లో డేవిడ్ వార్నర్ సైతం కేవలం 9 పరుగులకే ఔట్ కావడంతో ఆస్ట్రేలియాకు రెండో షాక్ తగిలింది. క్రిస్ వోక్స్ వేసిన బంతికి బెయిర్ స్టోకు క్యాచ్ ఇచ్చి వార్నర్ వెనుదిరిగాడు. ఇక 6 ఓవర్లో ఆసీస్ హ్యాండ్స్ కాంబ్ రూపంలో మూడోవికెట్ కోల్పోయింది. ఇలా ఆస్ట్రేలియా కేవలం 14 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లోకి కూరుకుపోయింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన అలెక్స్ కేరీ(46), స్టీవ్ స్మిత్ వికెట్ల పతనానికి ఫుల్ స్టాప్ పెట్టి స్కోరు బోర్డును నిలబెట్టే ప్రయత్నం చేశారు. అయితే ఈ క్రమంలోనే 4వ వికెట్ భాగస్వామ్యానికి ఏకంగా 103 పరుగుల భాగస్వామ్యం జతయ్యింది. ఈ క్రమంలోనే అలెక్స్ కేరీ ఔటవ్వడంతో మరోసారి ఆస్ట్రేలియా వికెట్ల పతనం ఆగలేదు. అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన మార్కస్ స్టోయినిస్(0) డకౌటై వెనుదిరిగాడు. దీంతో ఆస్ట్రేలియా మరోసారి 118 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోవడంతో ఆసీస్ బ్యాట్స్ మెన్ పై ఒత్తిడి పెరిగింది.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన గ్లెన్ మాక్స్‌వెల్ (22) వికెట్లలో కుదురుకునే ప్రయత్నం చేసినప్పటికీ వేగంగా పరుగులు తీసే క్రమంలో ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన పాట్ కమిన్స్(6) పరుగులకే ఔటయ్యాడు. ఒక వైపు వికెట్లు పడుతున్నప్పటికీ స్టీవ్ స్మిత్ మాత్రం నిరాశ చెందకుండా ఒంటరి పోరు చేస్తూ 47 వ ఓవర్లో 85 పరుగులకు రనౌటయ్యాడు. అత్యల్ప స్కోరుకే ఆస్ట్రేలియా నిలిచిపోతుందనుకున్న క్రమంలో స్మిత్ ఒంటరి పోరుతో స్కోరు 200 పరుగులు దాటడం విశేషం.ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ ఓక్స్ 2 వికెట్లు తీయగా, జోఫ్రా ఆర్చర్ ఒక వికెట్ పడగొట్టాడు.

First published: July 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...