England vs Australia | అదరగొడుతున్న ఆస్ట్రేలియా...అర్ధ సెంచరీ చేసి వార్నర్ ఔట్...

England vs Australia Live Score, ICC Cricket World Cup 2019 Match at Lord's: లార్డ్స్ వేదికగా జరుగుతున్న ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ వరల్డ్ కప్ టోర్నీ లీగ్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఆసీస్ శుభారంభం చేసింది. ఓపెనర్లు ఫించ్, వార్నర్ లు రాణించగా తొలివికెట్‌కు 123 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలోనే ఇద్దరు ఓపెనర్లు ఆర్థ సెంచరీలు పూర్తి చేసుకున్నారు.

news18-telugu
Updated: June 25, 2019, 5:20 PM IST
England vs Australia | అదరగొడుతున్న ఆస్ట్రేలియా...అర్ధ సెంచరీ చేసి వార్నర్ ఔట్...
ఆరంభం అదుర్స్...
  • Share this:
England vs Australia Live Score, ICC Cricket World Cup 2019 Match at Lord's: లార్డ్స్ వేదికగా జరుగుతున్న ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ వరల్డ్ కప్ టోర్నీ లీగ్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఆసీస్ శుభారంభం చేసింది. ఓపెనర్లు ఫించ్, వార్నర్ లు రాణించగా తొలివికెట్‌కు 123 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలోనే ఇద్దరు ఓపెనర్లు ఆర్థ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. కానీ 22వ ఓవర్లో వార్నర్ ఔటవ్వగా 30 ఓవర్లకు ఆస్ట్రేలియా స్కోరు ఒక వికెట్ నష్టానికి 160 దాటింది. ఇదిలాఉంటే చిరకాల ప్రత్యర్థులుగా తలపడుతున్న ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలు ప్రపంచకప్ లో కూడా తలపడుతున్న నేపథ్యంలో ఈ మ్యాచ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ఒక వైపు ఆస్ట్రేలియా డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగుతుండగా, ఇంగ్లాండ్ మాత్రం స్థానబలాన్నే నమ్ముకొని సిద్ధమవుతోంది. ముఖ్యంగా ఇంగ్లాండ్‌కు ఈ టోర్నీలో మొత్తం 6 మ్యాచుల్లో 4 మ్యాచుల్లో గెలవగా, రెండు మ్యాచుల్లో ఇంగ్లాండ్ పరాజయం పాలైంది. దీంతో ఇంగ్లాండ్ సెమీస్ చేరాలంటే మిగిలినా మూడు మ్యాచుల్లో తప్పనిసరిగా రెండు మ్యాచులు గెలవాల్సి ఉంటుంది.

Published by: Krishna Adithya
First published: June 25, 2019, 4:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading