HOME » NEWS » sports » ENGLAND VS AUSTRALIA LIVE SCORE ICC CRICKET WORLD CUP 2019 MATCH AT LORDS AUSTRALIA WON THE MATCH MK

England vs Australia | అదరగొట్టిన ఆస్ట్రేలియా...బెదిరిపోయిన ఇంగ్లాండ్...ఒత్తిడిలో చేతులెత్తేసిన ఇంగ్లీష్ టీమ్...

England vs Australia Live Score, ICC Cricket World Cup 2019 Match at Lord's: ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ వరల్డ్ కప్ టోర్నీ లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్ 286 పరుగుల లక్ష్య ఛేదనలో తడబడి 221 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఇంగ్లాండ్ పై ఆస్ట్రేలియా 64 పరుగుల ఆధిక్యంతో గెలిచింది.

news18-telugu
Updated: June 25, 2019, 10:52 PM IST
England vs Australia | అదరగొట్టిన ఆస్ట్రేలియా...బెదిరిపోయిన ఇంగ్లాండ్...ఒత్తిడిలో చేతులెత్తేసిన ఇంగ్లీష్ టీమ్...
విజయోత్సాహంలో ఆసీస్, నైరాశ్యంలో ఇంగ్లాండ్
  • Share this:
England vs Australia Live Score, ICC Cricket World Cup 2019 Match at Lord's: లార్డ్స్ వేదికగా జరుగుతున్న ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ వరల్డ్ కప్ టోర్నీ లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్ 286 పరుగుల లక్ష్య ఛేదనలో తడబడి 221 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఇంగ్లాండ్ పై ఆస్ట్రేలియా 64 పరుగుల ఆధిక్యంతో గెలిచింది. ఆస్ట్రేలియా బౌలింగ్ ఎటాక్ ముందు ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ భాగస్వామ్యాలను ఏర్పరచడంలో విఫలమయ్యారు. ఒక దశలో 53 పరుగులకే ఇంగ్లాండ్ 4 వికెట్లు కోల్పోయి చిక్కుల్లో పడింది. ఈ దశలో బెన్ స్టోక్స్ (89) మాత్రం క్రీజులో నిలబడి పరిస్థితిని తీర్చిదిద్దే పని భుజాన వేసుకున్నాడు. అయినప్పటికీ వికెట్ల పతనం మాత్రం ఆగలేదు. చివరకు ఇంగ్లాండ్ 44 ఓవర్లకు 221 పరుగులు చేసి ఆలౌటైంది. ఆస్ట్రేలియా బౌలింగ్ లో జాసన్ బెహ్రెన్‌డార్ఫ్ ఏకంగా 5 వికెట్లు పడగొట్టగా, మిచెల్ స్టార్క్ మాత్రం 4 వికెట్లు పడగొట్టాడు. ఇక మార్కస్ స్టోయినిస్ సైతం ఒక వికెట్ పడగొట్టి ఇంగ్లాండ్ పతనానికి కారణమయ్యారు. అయితే ఈ విజయంతో ఆసీస్ సెమీ ఫైనల్ బెర్తు కన్ఫార్మ్ చేసుకుంది.

ఇదిలా ఉంటే తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 285 పరుగులు చేసింది. ఓపెనర్ ఫించ్(100) సెంచరీతో శుభారంభం చేసినప్పటికీ ఆ తర్వాత వికెట్లు పడటంతో స్కోరు బోర్డు నెమ్మదించింది. ఒక దశలో ఆస్ట్రేలియా 37 ఓవర్లకే 3 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసినప్పటకీ, చివరి పది ఓవర్లలో కేవలం 70 పరుగులు మాత్రమే చేసి వేగంగా పరుగులు సాధించడంలో విఫలమైంది. ఇదిలా ఉంటే ఓపెనర్లు ఫించ్, వార్నర్ లు రాణించగా తొలివికెట్‌కు 123 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలోనే ఇద్దరు ఓపెనర్లు ఆర్థ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. కానీ 22వ ఓవర్లో వార్నర్ ఔటవ్వగా 28 ఓవర్లకు ఆస్ట్రేలియా స్కోరు ఒక వికెట్ నష్టానికి 150 దాటింది. కానీ సెంచరీ సాధించిన ఫించ్ 100 పరుగుల వద్ద ఔటవ్వడంతో పాటు మిడిలార్డర్లో వచ్చిన మాక్స్ వెల్ (12), స్టోయినిస్ (8) తక్కువ పరుగులకే పెవిలియన్ బాటపట్టడంతో ఆస్ట్రేలియా స్కోరు 300 దాటలేదు. ఇంగ్లాండ్ బౌలర్లు సైతం సరైన సమయంలో భాగస్వామ్యాలను విడగొట్టి ఆస్ట్రేలియాను కట్టడి చేసారు. బౌలర్లలో క్రిస్ వోక్స్ రెండు వికెట్లు పడగొట్టగా, జొఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్, బెన్ స్టోక్స్, మొయిన్ ఆలీ చెరోవికెట్ పడగొట్టారు.


Published by: Krishna Adithya
First published: June 25, 2019, 10:43 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading