news18-telugu
Updated: June 25, 2019, 7:15 PM IST
సెంచరీ కొట్టిన ఆనందంలో ఫించ్
England vs Australia Live Score, ICC Cricket World Cup 2019 Match at Lord's: లార్డ్స్ వేదికగా జరుగుతున్న ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ వరల్డ్ కప్ టోర్నీ లీగ్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 285 పరుగులు చేసింది. ఓపెనర్ ఫించ్(100) సెంచరీతో శుభారంభం చేసినప్పటికీ ఆ తర్వాత వికెట్లు పడటంతో స్కోరు బోర్డు నెమ్మదించింది. ఒక దశలో ఆస్ట్రేలియా 37 ఓవర్లకే 3 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసినప్పటకీ, చివరి పది ఓవర్లలో కేవలం 70 పరుగులు మాత్రమే చేసి వేగంగా పరుగులు సాధించడంలో విఫలమైంది. ఇదిలా ఉంటే ఓపెనర్లు ఫించ్, వార్నర్ లు రాణించగా తొలివికెట్‌కు 123 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలోనే ఇద్దరు ఓపెనర్లు ఆర్థ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. కానీ 22వ ఓవర్లో వార్నర్ ఔటవ్వగా 28 ఓవర్లకు ఆస్ట్రేలియా స్కోరు ఒక వికెట్ నష్టానికి 150 దాటింది. కానీ సెంచరీ సాధించిన ఫించ్ 100 పరుగుల వద్ద ఔటవ్వడంతో పాటు మిడిలార్డర్లో వచ్చిన మాక్స్ వెల్ (12), స్టోయినిస్ (8) తక్కువ పరుగులకే పెవిలియన్ బాటపట్టడంతో ఆస్ట్రేలియా స్కోరు 300 దాటలేదు. ఇంగ్లాండ్ బౌలర్లు సైతం సరైన సమయంలో భాగస్వామ్యాలను విడగొట్టి ఆస్ట్రేలియాను కట్టడి చేసారు. బౌలర్లలో క్రిస్ వోక్స్ రెండు వికెట్లు పడగొట్టగా, జొఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్, బెన్ స్టోక్స్, మొయిన్ ఆలీ చెరోవికెట్ పడగొట్టారు.
ఇదిలాఉంటే చిరకాల ప్రత్యర్థులుగా తలపడుతున్న ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలు ప్రపంచకప్ లో కూడా తలపడుతున్న నేపథ్యంలో ఈ మ్యాచ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ఒక వైపు ఆస్ట్రేలియా డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగుతుండగా, ఇంగ్లాండ్ మాత్రం స్థానబలాన్నే నమ్ముకొని సిద్ధమవుతోంది. ముఖ్యంగా ఇంగ్లాండ్‌కు ఈ టోర్నీలో మొత్తం 6 మ్యాచుల్లో 4 మ్యాచుల్లో గెలవగా, రెండు మ్యాచుల్లో ఇంగ్లాండ్ పరాజయం పాలైంది. దీంతో ఇంగ్లాండ్ సెమీస్ చేరాలంటే మిగిలినా మూడు మ్యాచుల్లో తప్పనిసరిగా రెండు మ్యాచులు గెలవాల్సి ఉంటుంది.
Published by:
Krishna Adithya
First published:
June 25, 2019, 7:10 PM IST